iDreamPost

RCBలో బ్లాక్ షీప్! మ్యాచ్‌ గెలిచినా ఆ ప్లేయర్‌ని తీసేయమంటూ ఫ్యాన్స్ రచ్చ!

  • Published Mar 26, 2024 | 1:00 PMUpdated Mar 26, 2024 | 1:00 PM

RCB, Rajat Patidar, IPL 2024: చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ.. పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో తమ సత్తా చాటి.. ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసింది. అయినా కూడా టీమ్‌లో ఓ ప్లేయర్‌ను తీసేయాలని ఆర్సీబీ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..

RCB, Rajat Patidar, IPL 2024: చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ.. పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో తమ సత్తా చాటి.. ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసింది. అయినా కూడా టీమ్‌లో ఓ ప్లేయర్‌ను తీసేయాలని ఆర్సీబీ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 26, 2024 | 1:00 PMUpdated Mar 26, 2024 | 1:00 PM
RCBలో బ్లాక్ షీప్! మ్యాచ్‌ గెలిచినా ఆ ప్లేయర్‌ని తీసేయమంటూ ఫ్యాన్స్ రచ్చ!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బాల్‌ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఇన్నింగ్స్‌కు తోడు దినేస్‌ కార్తీక్‌ అద్భుతమైన ఫినిషింగ్‌తో ఆర్సీబీకి ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మంచి థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించినా.. టీమ్‌లోని ఓ ప్లేయర్‌ను తీసేయాలని ఆర్సీబీ అభిమానులు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అతనుంటే.. టీమ్‌కు భారీ నష్టమంటూ, అతని ప్లేస్‌లో వేరే ప్లేయర్‌ను ఆడించాలని కోరుతున్నారు. మరి సొంత టీమ్‌ అభిమానుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆ ప్లేయర్‌ ఎవరు? ఎందుకు అతన్ని తీసేయాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారో ఇప్పుడు చూద్దాం..

రజత్‌ పాటిదార్‌.. ఆర్సీబీలో యంగ్‌ ప్లేయర్‌. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్‌ సెంచరీలు చేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పాటిదార్‌ 333 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన రజత్‌.. ఆ సీజన్‌లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయంతో ఐపీఎల్‌ 2023 సీజన్‌కు దూరం అయ్యాడు. మళ్లీ తిరిగి ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. అయితే.. రజత్‌ పాటిదార్‌ను టీమ్‌ నుంచి తీసేయాలని, అతని ప్లేస్‌లో మరో ప్లేయర్‌ను టీమ్‌లోకి తీసుకోవాలని ఆర్సీబీ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అందుకు కారణం తొలి రెండు సీజన్స్‌లో అతను విఫలం అవ్వడమే. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయిన పాటిదార్‌, సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 18 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు.

Don't want that player in RCB

రెండు మ్యాచ్‌ల్లో విఫలం అయినంత మాత్రనా ఓ యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్‌ను పక్కనపెట్టేయాలా? అనే అనుకోవచ్చు. అయితే.. ఒక్కడ పాటిదార్‌ రెండు మ్యాచ్‌ల్లో విఫలం అయ్యాడనేది పాయింట్‌ కాదు.. అతని ఇంటెంట్‌ సరిగా లేదని ఫ్యాన్స్‌ అంటున్నారు. చాలా కేర్‌లెస్‌గా బ్యాటింగ్‌ చేస్తున్నాడని, ప్రతి సీజన్‌లో టీమ్‌ ఎంత బాగున్నా.. ఎవరో ఒక ప్లేయర్‌ టీమ్‌కు దారుణంగా నష్టం చేకూరుస్తున్నాయి. ఈ సారి పాటిదార్‌ అలాంటి ప్లేయర్‌లా మారే ఛాన్స్‌ ఉందని ఆర్సీబీ అభిమానులు భయపడుతున్నారు. ఓ పది మ్యాచ్‌లు చూసి.. టీమ్‌ నుంచి తీసేసే కంటే.. కాస్త ముందుగానే జాగ్రత్త పడి.. అతని ప్లేస్‌లో మరో యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

పైగా పాటిదార్‌ ఎక్కువగా కీలకమైన వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. తొలి మ్యాచ్‌లో వన్‌డౌన్‌లోనే వచ్చాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇలా ఎంతో కీలకమైన స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తూ.. విఫలం అవుతూ టీమ్‌పై నెగిటివ్‌ ఇంప్యాక్ట్‌ చూపిస్తున్నాడని ఫ్యాన్స్‌ అంటున్నారు. అయితే.. టెక్నికల్‌గా పాటిదార్‌ చాలా మంచి ప్లేయర్‌ అయినప్పటికీ.. గాయం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత సరిగా ఆడలేకపోతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పాటిదార్‌ దారుణంగా విఫలం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ ఫ్యాన్స్‌ అతన్ని తీసేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి