Tirupathi Rao
MI vs RCB- Glenn Maxwell: ఐపీఎల్ లో ఆర్సీబీ అదృష్టం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. కోహ్లీ ఫెయిల్ అయితే జట్టు పరిస్థితి అంతంత మాత్రమే అనే పరిస్థితి కనిపిస్తోంది. గ్లెన్ మ్యాక్స్ వెల్ మరోసారి జట్టుని నిండా ముంచేశాడు.
MI vs RCB- Glenn Maxwell: ఐపీఎల్ లో ఆర్సీబీ అదృష్టం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. కోహ్లీ ఫెయిల్ అయితే జట్టు పరిస్థితి అంతంత మాత్రమే అనే పరిస్థితి కనిపిస్తోంది. గ్లెన్ మ్యాక్స్ వెల్ మరోసారి జట్టుని నిండా ముంచేశాడు.
Tirupathi Rao
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ప్రతి జట్టు విజయం కోసం పోరాడుతూ ఉంది. కానీ, కొన్ని జట్లు తమ ప్రయత్నంలో సక్సెస్ అయితే మరికొన్ని జట్లు మాత్రం పదే పదే తడబడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ జట్టు ఇంకా గాడిలో పడినట్లు మాత్రం కనిపించడం లేదు. ఐపీఎల్ 2024లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఒక్క బిగ్ విక్టరీ కూడా నమోదు చేయలేకపోయింది. గెలిచిన ఒక్క మ్యాచ్ కూడా ఆఖరి ఓవర్ వరకు లాక్కొచ్చి గెలిచిన పరిస్థితి. ఆర్సీబీ జట్టులో కోహ్లీ ఫెయిల్ అయితే అంతా డొల్లే అనే విషయం ముంబయితో గురువారం జరిగిన మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. డుప్లెసిస్(61) కెప్టెన్ ఇన్నింగ్స్, రజత్ పాటిదార్(50) స్ప్లెండిడ్ హాఫ్ సెంచరీ లేకపోతే ఆర్సీబీ బొక్కబోర్లా పడేది. ఈసారి కూడా మ్యాక్స్ వెల్ ఫెయిల్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు.
ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డొల్లతనం బయటపడింది. విరాట్ కోహ్లీ 9 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. డుప్లెసిస్ కాస్త పోరాడుతూ వచ్చినా కూడా అంత గొప్ప స్కోర్ రాబట్టలేకపోయింది. కోహ్లీ అవుటయ్యాక ఈ గేమ్ లో మ్యాక్స్ వెల్ పై అభిమానులు పెద్దఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో అయినా మ్యాక్సీ చెలరేగుతాడని.. అద్భుతమైన ఇన్నింగ్స్ అందిస్తారని ఎదురుచూసి భంగపాటుకు గురయ్యారు. ఎందుకంటే మరోసారి మ్యాక్స్ వెల్ విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా కోసం ఒంటి కాలు మీద సెంచరీలు కొట్టే మ్యాక్స్ వెల్ ఐపీఎల్ అనగానే ఫుల్ చిల్ అయిపోతాడు. పరుగులు చేయాలి, టీమ్ ని గెలిపించాలి అనే ఉద్దేశం ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Glenn Maxwell duck 😭🤡#MIvsRCB pic.twitter.com/swqvq2pOzh
— Desi Bhayo (@desi_bhayo88) April 11, 2024
ముంబయితో జరిగిన మ్యాచ్ లో కూడా మ్యాక్స్ వెల్ మరోసారి డకౌట్ అవ్వగానే అసలు ఎందుకు మ్యాక్స్ వెల్ కి ఈ రేంజ్ లో అవకాశాలు ఇస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని టీమ్స్ లో కుర్రాళ్లు అద్భుతాలు సృష్టిస్తుంటే.. ఆర్సీబీలో మాత్రం మ్యాక్స్ వెల్ కు పదే పదే అవకాశాలు ఇస్తూ జట్టుకు అన్యాం చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాక్స్ వెల్ ఈ సీజన్లో ఆడిన 6 ఇన్నింగ్స్ వరుసగా చూసుకుంటే.. 0(1), 2(5), 28(19), 0(2), 1(3), 0(4) ఇలా ఉంది. ఈ మొత్తం ఇన్నింగ్స్ లో మ్యాక్స్ వెల్ చేసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువ ఉన్నాయి.
Maxwell🤣 pic.twitter.com/CHNXOwXUG2
— Abhishek (@be_mewadi) April 11, 2024
ఈ స్థాయిలో ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. చివర్లో దినేశ్ కార్తీక మెరుపులు మెరిపించకపోతే ఆర్సీబీ జట్టు అంతంత మాత్రం స్కోర్ కే పరిమితం కావాల్సి వచ్చేది. దినేశ్ కార్తీక్ మాత్రం 23 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో ఆర్సీబ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగలిగింది. మ్యాక్స్ వెల్ కి అన్ని అవకాశాలు అవసరమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Glenn Maxwell in IPL 2024:
0(1).
3(5).
28(19).
0(2).
1(3).
0(4). pic.twitter.com/FGrfwcVnhL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024