IPL కోసం బెంగుళూరులో వర్షం పడొద్దా? నిన్నటి వరకు పడ్డ నీటి కష్టాలు మరిచారా?

వర్షం ఇప్పుడు ఒక సిటీని రెండు వర్గాలుగా విభజించి పడేసింది. వర్షం రాకూడదని ఒక వర్గం.. వర్షం రావాలని ఒక వర్గం దాదాపు మాటల యుద్ధమే చేసుకుంటున్నారు. మొన్నటి వరకూ నీటి కష్టాలతో అల్లాడిన బెంగళూరుని వర్షపు చినుకులు పలకరించి హమ్మయ్యా అనిపించాయి. అయితే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ కోసం వర్షం రాకూడదని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీంతో చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కాస్తా.. ఆర్సీబీ వర్సెస్ బెంగళూరు పీపుల్ అయిపోయింది.

వర్షం ఇప్పుడు ఒక సిటీని రెండు వర్గాలుగా విభజించి పడేసింది. వర్షం రాకూడదని ఒక వర్గం.. వర్షం రావాలని ఒక వర్గం దాదాపు మాటల యుద్ధమే చేసుకుంటున్నారు. మొన్నటి వరకూ నీటి కష్టాలతో అల్లాడిన బెంగళూరుని వర్షపు చినుకులు పలకరించి హమ్మయ్యా అనిపించాయి. అయితే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ కోసం వర్షం రాకూడదని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీంతో చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కాస్తా.. ఆర్సీబీ వర్సెస్ బెంగళూరు పీపుల్ అయిపోయింది.

మనం బయటకు వెళ్తున్నప్పుడు వానలు రాకూడదు అని కోరుకుంటాం. మనకి పని ఉంది కాబట్టి రాకూడదు అని కోరుకోవడం సహజం. అదే సమయంలో వానలు పడితే బాగుణ్ణు అని ఒక రైతు కోరుకుంటాడు. ఎందుకంటే ఆ వాన చుక్కే పంట గొంతు తడుపుతుంది. అతని కడుపు నింపుతుంది. ఒకే ఊరిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వర్షం పడకూడదు, పడాలి అని కోరుకుంటారు. ఇది నైజం. ఇప్పుడు బెంగళూరులో కూడా ఇదే జరుగుతుంది. వర్షాలు పడితే బాగుణ్ణు అని ఒక వర్గం.. అస్సలు వర్షం పడడానికి వీల్లేదని ఒక వర్గం తెగ ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఎంతలా అంటే ఊరు కంటే ఐపీఎల్ మ్యాచులే ఎక్కువ అన్నట్టుగా ఆర్సీబీ ఫ్యాన్స్ తయారయ్యారు.    

బెంగళూరువాసులు: మొన్నటి వరకూ వర్షాలు పడాలని మీరే కదండీ అన్నారు.. 

ఆర్సీబీ ఫ్యాన్స్: అది మొన్నరా 

ఇదీ అక్కడి పరిస్థితి. మొన్నటి వరకూ నీళ్లు లేవని బెంగళూరు వాసులు అష్టకష్టాలు పడ్డారు. మాకు నీళ్లియ్యండి మహాప్రభో అని అందరూ కలిసి రోడ్లెక్కారు. మరి వీళ్ళ మొర ఆ వానదేవుడు విన్నాడు కాబోలు వాళ్ళ గొంతులు తడిసేలా.. అక్కడ రోడ్లు మునిగేలా వర్షాన్ని కురిపించాడు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ మధ్యలో ఎండలొకటి విసిగించాయి. ఈ ఎండలకు మళ్ళీ సమస్య మొదలైంది. అయితే వర్షాల కారణంగా వాతావరణం చల్లబడింది. మే 18న భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఇదే రోజున బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీకి మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కి చాలా కీలకం. ఈ మ్యాచ్ నెగ్గితేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది.

లీగ్ దశలో ఇవాళ చెన్నైతో ఆడే మ్యాచే వీళ్ళకి ఆఖరి మ్యాచ్. ఇది ఆర్సీబీకి క్రూషియల్ మ్యాచ్. ఇది ఓడిపోతే ఆర్సీబీ ఇక ఇంటికి వెళ్లిపోవాల్సిందే. వరుసగా 6 మ్యాచ్ లు ఓడిపోతూ వచ్చిన ఆర్సీబీ.. మళ్ళీ నిలబడి వరుసగా 5 మ్యాచులు గెలుచుకుంటూ ఇక్కడి వరకూ వచ్చింది. చెన్నైతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది. కప్పు కొట్టే ఛాన్స్ ఉంటుంది. అదే వర్షం పడితే కనుక రెండు టీమ్స్ కి చెరో పాయింట్ వస్తుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది. అందుకే మ్యాచ్ ఎలాగైనా జరగాలి అని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మ్యాచ్ అయ్యే వరకూ వర్షం పడకూడదు అని ప్రార్థిస్తున్నారు.

మరోవైపు వర్షం పడాలి.. నీటి కష్టాలు తీరాలి అని నాన్ క్రికెట్ లవర్స్, బెంగళూరు వాసులు కోరుకుంటున్నారు. మీరు మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. మొన్నటి వరకూ వర్షం పడాలి, నీటి కష్టాలు తీరాలి అని కోరుకున్నారు కదా. మరి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ కోసం వర్షం రాకూడదని కోరుకుంటున్నారా? మీ ఐపీఎల్ మ్యాచ్ కోసం సిటీ మొత్తం నీటి కష్టాలతో అల్లాడిపోవాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ బెంగళూరు వాసులుగా తయారైంది పరిస్థితి. మరి వానదేవుడు ఆర్సీబీ ఫ్యాన్స్ మొర ఆలకించి ఆగిపోతాడో లేక బెంగళూరు వాసుల మొర విని వాన జల్లు కురిపిస్తాడో చూడాలి. 

Show comments