Nidhan
సన్‌రైజర్స్ టీమ్‌పై కింగ్ నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జట్టులోని ఆ ఆటగాడ్ని చూసి చాలా గర్వపడుతున్నానని అన్నారు. అతడ్ని దర్శకధీరుడు రాజమౌళితో పోల్చారు.
సన్‌రైజర్స్ టీమ్‌పై కింగ్ నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జట్టులోని ఆ ఆటగాడ్ని చూసి చాలా గర్వపడుతున్నానని అన్నారు. అతడ్ని దర్శకధీరుడు రాజమౌళితో పోల్చారు.
Nidhan
ఐపీఎల్-2024లో బాగా డామినేట్ చేస్తున్న జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ముఖ్యంగా లీగ్ ఫస్టాఫ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. టాప్ టీమ్స్‌ను కూడా చిత్తుగా ఓడించింది. 250 ప్లస్ స్కోర్లను కూడా నీళ్లు తాగినంత అలవోకగా బాదుతూ అందర్నీ గడగడలాడించింది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో టీమ్ రాత మారిపోయింది. బౌలింగ్‌ను మరింత కట్టుదిట్టంగా మార్చిన కమిన్స్.. బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ అగర్వాల్ లాంటి ఫైరింగ్ పెయిర్‌ను ఓపెనర్లుగా లాక్ చేశాడు. వీళ్లు తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెడుతున్నారు. క్లాసెన్, మార్క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ కూడా ఉతకడమే పనిగా ఆడుతున్నారు. ఇలా వరుస విజయాలతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్‌పై టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న తీరును నాగార్జున మెచ్చుకున్నారు. కమిన్స్ సేనకు ‘ఈసారి ఆట చూస్కోండి నా సామి రంగ’ అనే డైలాగ్‌ను ఆయన డెడికేట్ చేశారు. అలాగే ఆరెంజ్ ఆర్మీ విజయాల్లో కీలకంగా మారిన తెలుగోడు, పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పెర్ఫార్మెన్స్ మీద కూడా నాగ్ రియాక్ట్ అయ్యారు. నితీష్ అద్భుతంగా ఆడుతున్నాడని, అతడి ఆటతీరు మీద గర్వపడుతున్నానని తెలిపారు. నితీష్ రెడ్డిని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో నాగార్జున కంపేర్ చేశారు. ఒక తెలుగు అబ్బాయి ఇంత బాగా ఆడుతుంటే గొప్పగా అనిపిస్తోందన్నారు.
తెలుగు సినిమాను రాజమౌళి ఆస్కార్ లెవల్‌కు తీసుకెళ్లినప్పుడు ఎలా అనిపించిందో సేమ్ ఫీలింగ్ నితీష్ రెడ్డి ఆడుతుంటే కలుగుతోందన్నారు నాగార్జున. తనకు అప్పగించిన పనిని నితీష్ చాలా బాగా నిర్వర్తిస్తున్నాడని.. అతడు మనందరికీ గర్వకారణమన్నారు కింగ్. నితీష్ రెడ్డిపై నాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పినది కరెక్ట్ అని.. ఓ తెలుగోడు ఐపీఎల్లో ఈ రేంజ్లో అదరగొట్టడం హ్యాపీగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో అతడు పెడుతున్న ఎఫర్ట్ చూస్తుంటే త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని అంటున్నారు. నితీష్ ఇలాగే ఆడుతూ ఎస్ఆర్హెచ్కు కప్పు అందించాలని ఆశిస్తున్నారు. మరి.. నితీష్ రెడ్డిపై నాగార్జున చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Nagarjuna with @StarSportsTel #IPLOnStar pic.twitter.com/Yrm5b4UVxF
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) May 6, 2024