Nidhan
పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు చెబితేనే బ్యాటర్లు వణికిపోతారు. నిఖార్సయిన పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో అతడు వేసే బంతుల్ని ఎదుర్కోవడం టాప్ బ్యాటర్లకు కూడా కష్టమే.
పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు చెబితేనే బ్యాటర్లు వణికిపోతారు. నిఖార్సయిన పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో అతడు వేసే బంతుల్ని ఎదుర్కోవడం టాప్ బ్యాటర్లకు కూడా కష్టమే.
Nidhan
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు చెబితేనే బ్యాటర్లు వణికిపోతారు. నిఖార్సయిన పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో అతడు వేసే బంతుల్ని ఎదుర్కోవడం టాప్ బ్యాటర్లకు కూడా కష్టమే. ప్రస్తుత జనరేషన్లో బెస్ట్ పేసర్లలో ఒకడిగా కొనసాగుతున్న బుమ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు. వరుస సీజన్లలో అదరగొడుతూ టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తక్కువ టైమ్‌లోనే భారత జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకొని.. క్రమంగా మ్యాచ్ విన్నర్‌గా రూపాంతరం చెందాడు. టీమిండియాకు తురుపు ముక్కగా మారిన ఈ పేసర్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ కోచ్ వల్లే తన ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు.
19 ఏళ్ల వయసులోనే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలోకి ఎంట్రీ ఇచ్చానని బుమ్రా తెలిపాడు. అప్పట్లో రంజీ ట్రోఫీలో ఆడతానని కూడా తాను అనుకోలేదని.. అలాంటిది ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కిందన్నాడు. ఆ సమయంలో తనలోని టాలెంట్‌ను టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ గుర్తించాడని అన్నాడు. జాన్ రైట్ వల్లే తాను ఎంఐ టీమ్‌లోకి అడుగుపెట్టానన్నారు. ఆ జట్టులో ఆడుతూ ఏటికేడు తనను తాను మరింత మెరుగుపర్చుకున్నానని పేర్కొన్నాడు బుమ్రా. గత 11 ఏళ్ల కాలంలో 5 ఐపీఎల్ టైటిల్స్‌ను ముంబై గెలుచుకుందని.. ఆ జట్టుతో తన ప్రయాణం మాటల్లో వర్ణించలేనిదని చెబుతూ పేసుగుర్రం ఎమోషనల్ అయ్యాడు. జాన్ రైట్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని.. అతడే తనను మొదట గుర్తించి, సానబెట్టాడని చెప్పుకొచ్చాడు.
ఇక, ప్రముఖ మోడల్, ప్రెజెంటేటర్ సంజనా గణేశన్‌ను బుమ్రా పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ 2021, మార్చి 15వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఈ జంటకు పండంటి మగబిడ్డ పుట్టాడు. అతడికి అంగద్ అని పేరు పెట్టుకున్నారు. కొడుకు గురించి కూడా బుమ్రా మాట్లాడాడు. అంగద్ తనను చూసి నవ్వడం వరల్డ్‌లోనే బెస్ట్ మూమెంట్‌లా అనిపిస్తుందని అన్నాడు. అతడి నవ్వుకు మించిన ఆనందం తనకు మరొకటి లేదన్నాడు. ఎక్కడికి వెళ్లినా దీన్ని మించిన సంతోషం మరొకటి లేదని.. అంగద్‌ను చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుందన్నాడు బుమ్రా. కాగా, ఐపీఎల్-2024లోనూ బుమ్రా సత్తా చాటుతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లో 6 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ పరుగులు అస్సలు ఇవ్వడం లేదు. అతడి ఎకానమీ 6.12గా ఉంది. మరి.. జాన్ రైట్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానంటూ బుమ్రా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Jasprit Bumrah said, “I came to MI as a 19 year old, that year I didn’t even expect to play Ranji Trophy, but then John Wright saw me. Over the years I have grown here, we have had an interesting journey we won 5 titles. It’s been a great journey”. (JioCinema). pic.twitter.com/OzyI50fcX4
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024