iDreamPost

వీడియో: స్పీడ్​లో మయాంక్​తో పోటీపడుతున్న రాజస్థాన్ పేసర్! ఎవరీ కుల్దీప్ సేన్?

  • Published Apr 11, 2024 | 6:18 PMUpdated Apr 11, 2024 | 6:18 PM

లక్నో ఎక్స్​ప్రెస్ మయాంక్ యాదవ్​తో పోటీపడుతున్నాడో రాజస్థాన్ పేసర్. ఈ యంగ్ గన్ కూడా బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ బ్యాటర్లను వణికిస్తున్నాడు.

లక్నో ఎక్స్​ప్రెస్ మయాంక్ యాదవ్​తో పోటీపడుతున్నాడో రాజస్థాన్ పేసర్. ఈ యంగ్ గన్ కూడా బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ బ్యాటర్లను వణికిస్తున్నాడు.

  • Published Apr 11, 2024 | 6:18 PMUpdated Apr 11, 2024 | 6:18 PM
వీడియో: స్పీడ్​లో మయాంక్​తో పోటీపడుతున్న రాజస్థాన్ పేసర్! ఎవరీ కుల్దీప్ సేన్?

ఐపీఎల్ చాలా సంచలనాలకు వేదికగా నిలిచింది. ఎన్నో పాత రికార్డులు ప్రస్తుత సీజన్​లో బ్రేక్ అవుతున్నాయి. కొందరు యంగ్​స్టర్స్ అదిరిపోయే ఆటతీరుతో అందరి మనసులు కూడా దోచుకుంటున్నారు. టీమిండియాతో పాటు ఫారెన్ స్టార్స్ రాణిస్తారనుకుంటే వాళ్లతో పోటీపడుతూ యువకులు మంచి ఇంప్రెషన్ తీసుకుంటున్నారు. లక్నో సూపర్ జియాంట్స్ పేసర్ మయాంక్ యాదవ్ వారిలో ఒకడు. 150 కిలోమీటర్లకు తగ్గని ఎక్స్​ప్రెస్ పేస్​తో అతడు వేసే బంతులకు మహామహా బ్యాటర్ల దగ్గర కూడా ఆన్సర్ ఉండటం లేదు. మయాంక్ వరుసగా అద్భుతమైన ప్రదర్శనలతో అందరి ఫోకస్​ను తనవైపునకు తిప్పుకున్నాడు. ఈ తరుణంలో మరో యంగ్ పేసర్ అతడికి పోటీగా దూసుకొచ్చాడు. అతడే కుల్దీప్ సేన్.

రాజస్థాన్ రాయల్స్ పేసర్ కుల్దీప్ సేన్ గురించి క్రికెట్ అభిమానులు ఇప్పుడు తెగ మాట్లాడుకుంటున్నారు. గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్​లో అతడు బౌలింగ్ చేసిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. రన్స్ బాగానే ఇచ్చినా అతడి క్విక్ పేస్, ఫియర్​లెస్ అప్రోచ్​ను మెచ్చుకుంటున్నారు. ఈ మ్యాచ్​లో జీటీ ఓపెనర్లు మాథ్యూ వేడ్​, సాయి సుదర్శన్​తో పాటు అభినవ్ మనోహర్​ను ఔట్ చేశాడతను. వీళ్లలో సుదర్శన్ ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. మిగిలిన ఇద్దర్నీ క్లీన్​బౌల్డ్ చేశాడు కుల్దీప్. నిలకడగా 147 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడతను. పరుగులు సమర్పించుకున్నా భయపడకుండా బ్యాటర్లను అటాక్ చేస్తూ పోయాడు కుల్దీప్. అందుకే అతడు 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.

ఎవరీ కుల్దీప్ సేన్?

ఒక్క మ్యాచ్​తో అందరి అటెన్షన్​ను తన వైపునకు తిప్పుకున్నాడు కుల్దీప్. దీంతో అసలు ఎవరితను? బ్యాగ్రౌండ్ ఏంటి? అనేది తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మధ్యప్రదేశ్​కు చెందిన కుల్దీప్ సేన్ అక్టోబర్ 22, 1996న రెవాలో పుట్టాడు. ఎంపీ తరఫున డొమెస్టిక్ లెవల్​లో రాణిస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. అతడు ఇప్పటికే భారత జట్టు తరఫున కూడా అరంగేట్రం చేశాడు. 2022లో బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో టీమిండియాకు ఆడాడు. ఆ మ్యాచ్​లో 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు కుల్దీప్. అదే ఏడాది వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.20 లక్షల బేస్ ప్రైజ్​కు అతడ్ని సొంతం చేసుకుంది. మొత్తంగా టీ20ల్లో 37 మ్యాచుల్లో 29 వికెట్లు పడగొట్టాడతను. కుల్దీప్ బౌలింగ్ చూసిన వాళ్లు మయాంక్ యాదవ్​తో అతడ్ని పోలుస్తున్నారు. లైన్ అండ్ లెంగ్త్ సరిచేసుకుంటే అతడ్ని ఆపడం కష్టమని అంటున్నారు. మరి.. కుల్దీప్ సేన్ బౌలింగ్​ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి