Tirupathi Rao
KKR- MI- Hardik Pandya: ముంబయి- కేకేఆర్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బాల్ తో మ్యాజిక్ చేశాడు. విధ్వంసకారి అయిన సునీల్ నరైన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అతని డెలివరీకి నరైన్ కూడా నోరెళ్లబెట్టేశాడు.
KKR- MI- Hardik Pandya: ముంబయి- కేకేఆర్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బాల్ తో మ్యాజిక్ చేశాడు. విధ్వంసకారి అయిన సునీల్ నరైన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అతని డెలివరీకి నరైన్ కూడా నోరెళ్లబెట్టేశాడు.
Tirupathi Rao
        
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి ఇండియన్స్ అభిమానుల ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. వాటిని రెట్టింపు చేస్తూ ముంబయి ఇండియన్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ పై తమ ప్రతాపం చూపించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు కేకేఆర్ బ్యాటర్లు కట్టడి చేసింది. తొలి ఓవర్ నుంచి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎక్కడా కూడా కేకేఆర్ బ్యాటర్లు ఛాన్స్ లేకుండా ముంబయి బౌలర్లు విజృంభించారు. అందరూ ఎకానమీని కంట్రోల్ చేస్తూ పరుగుల రాకుండా కట్టడి చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. నరైన్ ని బౌల్డ్ చేసిన తీరు మాత్రం అందరినీ అబ్బుర పరుస్తోంది.
ముంబయి ఇండియన్స్ ఈ మ్యాచ్ లో ఫుల్ కంబ్యాక్ ఇచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా బౌలర్లు తమ రోల్ ని సక్సెస్ ఫుల్ గా ప్లే చేశారు. జట్టుకు కావాల్సిన కంబ్యాక్ ఇస్తూ వచ్చారు. వారిలో హార్దిక్ పాండ్యా మాత్రం మంచి ఫైటింగ్ స్పిరిట్ ని చూపించాడు. ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేసిన ముంబయి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు పొగిడేస్తున్నారు. ఈ సీజన్లో ఒక కెప్టెన్ గా, బ్యాటర్ గా, బౌలర్ గా హార్దిక్ పాండ్యాకు ఇప్పటివరకు అంత మంచి పేరు రాలేదు. కానీ, ఈ మ్యాచ్ లో మాత్రం అద్భుతం చేసేశాడు. చాలా కంట్రోల్డ్ గా బౌలింగ్ చేసి పరుగులు జారకుండా జాగ్రత్త పడ్డాడు.
दांडी गुल ft Kung Fu Pandya 🎯💙#MumbaiMeriJaan #MumbaiIndians #MIvKKR pic.twitter.com/9oXDFd4MTO
— Mumbai Indians (@mipaltan) May 3, 2024
ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కేకేఆర్ విధ్వంసకారి సునీల్ నరైన్ వికెట్ తీసుకున్నాడు. అప్పుడే క్రీజులో నిలదొక్కుకుంటున్న సునీల్ నరైన్ అదిరిపోయే డెలివరీ వేసి హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. నిన్న మ్యాచ్ లో బుమ్మా సంజూ శాంసన్ ని భువనేశ్వర్ కుమార్ ఎలాగైతే బౌల్డ్ చేశాడో.. అదే విధంగా ఇవాళ హార్దిక్ పాండ్యా నరైన్ బౌల్డ్ చేశాడు. కాకపోతే సంజూ రైట్ హ్యాండ్.. నరైన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అదే తేడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇన్నాళ్లు ఎవరైతే పాండ్యాను ట్రోల్ చేస్తూ వచ్చారో.. వాళ్లే ఇప్పుడు హార్దిక్ పాండ్యాని పొగిడేస్తున్నారు. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ వేయగా.. 44 పరుగులు ఇచ్చాడు. మొత్తం 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే పాండ్యా ఆఖరి ఓవర్లో రస్సెల్ రనౌట్ అయ్యాడు. మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేకేఆర్ పై ముంబయి జట్టు పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది. మరి.. హార్దిక్ పాండ్యా డెలివరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.
𝐔𝐏𝐑𝐎𝐎𝐓𝐄𝐃 🎯
Captain Hardik Pandya strengthens @mipaltan‘s hold with that wicket ☝️#KKR are 4 down now!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvKKR pic.twitter.com/zi75MZHZbl
— IndianPremierLeague (@IPL) May 3, 2024