iDreamPost
android-app
ios-app

టీమిండియాలోకి మయాంక్ యాదవ్.. T20 వరల్డ్ కప్​తో ఇంటర్నేషనల్ డెబ్యూ!

  • Published Mar 31, 2024 | 12:56 PM Updated Updated Mar 31, 2024 | 12:56 PM

డెబ్యూ మ్యాచ్​లో ఫాస్టెస్ట్ డెలివరీస్​తో రికార్డు బ్రేక్ చేశాడు మయాంక్ యాదవ్. ఒక్క మ్యాచ్​తో ఓవర్​నైట్​ స్టార్​గా మారిపోయాడీ లక్నో పేసర్.

డెబ్యూ మ్యాచ్​లో ఫాస్టెస్ట్ డెలివరీస్​తో రికార్డు బ్రేక్ చేశాడు మయాంక్ యాదవ్. ఒక్క మ్యాచ్​తో ఓవర్​నైట్​ స్టార్​గా మారిపోయాడీ లక్నో పేసర్.

  • Published Mar 31, 2024 | 12:56 PMUpdated Mar 31, 2024 | 12:56 PM
టీమిండియాలోకి మయాంక్ యాదవ్.. T20 వరల్డ్ కప్​తో ఇంటర్నేషనల్ డెబ్యూ!

ఆటగాడికైనా దేశం తరఫున ఆడాలనేది కల. అందుకోసం ఏళ్లకు ఏళ్లు రాత్రింబవళ్లు శ్రమిస్తుంటారు. కొందరికి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. అయితే ఇంకొందరి విషయంలో మాత్రం ఈ డ్రీమ్ త్వరగా నెరవేరుతుంది. అలాంటి అరుదైన కలను ఓ యువ ఆటగాడు నెవరేర్చుకున్నాడని తెలుస్తోంది. ఒకే ఒక్క మ్యాచ్​తో ఓవర్​నైట్​ స్టార్​గా మారిన లక్నో సూపర్ జియాంట్స్ పేసర్ మయాంక్ యాదవ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో అతడి సూపర్బ్ స్పెల్​కు అభిమానులు, ప్రేక్షకులతో పాటు నేషనల్ సెలక్టర్స్ కూడా ఫిదా అయ్యారని సమాచారం.

నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు తగ్గిని పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​తో మయాంక్ బౌలింగ్ చేసిన తీరుకు బీసీసీఐ పెద్దలు కూడా నివ్వెరపోయారట. అతడ్ని త్వరలో టీమిండియాలోకి తీసుకొచ్చేందుకు ప్లానింగ్ మొదలైందని టాక్ నడుస్తోంది. జూన్​లో జరిగే ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్​తో మయాంక్ ఇంటర్నేషన్ డెబ్యూ ఫిక్స్ అయ్యిందని కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్​లోని మాగ్జిమమ్ మ్యాచ్​లను సెలక్టర్ల బృందం దగ్గర ఉండి చూస్తోందని, అందుకోసం మ్యాచ్​లు జరిగే స్టేడియాలకు కూడా స్వయంగా సెలక్టర్లు వెళ్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్​ను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్న సెలక్టర్లు.. స్క్వాడ్​లో చోటు ఖాయం అనుకునే సీనియర్లతో పాటు జూనియర్ల ఆటను కూడా దగ్గర నుంచి గమనిస్తున్నారట.

mayak yadav into team india

ఐపీఎల్​లో ఎవరైనా సంచలన ప్రదర్శనలు చేస్తే వరల్డ్ కప్ టీమ్​లోకి ఎంపికయ్యే ఛాన్స్ ఉందని సీనియర్ క్రికెటర్లు కూడా అంటున్నారు. ఒకవైపు సెలక్టర్ల బృందం మ్యాచ్​లకు రావడం, మరోవైపు బాగా ఆడిన జూనియర్లకు ఛాన్సులు ఇస్తారంటూ మాజీలు అంటున్న తరుణంలో మయాంక్ యాదవ్ సెన్సేషనల్ బౌలింగ్​తో అందరి దృష్టిని ఆకర్షించాడు. పంజాబ్​తో మ్యాచ్​లో అతడి బౌలింగ్ చూసిన నెటిజన్స్ టీమిండియాలోకి అతడి ఎంట్రీ పక్కా అని అంటున్నారు. జస్​ప్రీత్ బుమ్రా తప్ప భారత జట్టులో నిఖార్సయిన పేసర్లు లేరు. సిరాజ్ ఫామ్​లో లేడు, వెటరన్ పేసర్ మహ్మద్ షమి గాయంతో దూరమయ్యాడు. కాబట్టి ప్రత్యర్థి జట్లను భయపెట్టాలంటే మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న కరీబియన్ దీవులకు మయాంక్​ను తీసుకెళ్లాల్సిందేనని అంటున్నారు. అతడి పేస్, లైన్ అండ్ లెంగ్త్, డిసిప్లిన్ సూపర్బ్ అని ప్రశంసిస్తున్నారు. రాబోయే మ్యాచుల్లో కూడా అతడు ఇదే తరహాలో బౌలింగ్ చేస్తే భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మయాంక్​ను టీమిండియాలో చూడాలని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IPL-2024లో సీనియర్ క్రికెటర్ల హవా.. పస తగ్గిందనుకుంటే మరింత చెలరేగుతున్నారు!