iDreamPost

IPL-2024లో సీనియర్ క్రికెటర్ల హవా.. పస తగ్గిందనుకుంటే మరింత చెలరేగుతున్నారు!

  • Published Mar 31, 2024 | 11:21 AMUpdated Mar 31, 2024 | 11:21 AM

ఈసారి ఐపీఎల్​లో కొందరు సీనియర్ క్రికెటర్లు అదరగొడుతున్నారు. పస తగ్గిందనుకుంటే మరింత చెలరేగుతున్నారు. ఎవరా ప్లేయర్లు అనేది ఇప్పుడు చూద్దాం..

ఈసారి ఐపీఎల్​లో కొందరు సీనియర్ క్రికెటర్లు అదరగొడుతున్నారు. పస తగ్గిందనుకుంటే మరింత చెలరేగుతున్నారు. ఎవరా ప్లేయర్లు అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 31, 2024 | 11:21 AMUpdated Mar 31, 2024 | 11:21 AM
IPL-2024లో సీనియర్ క్రికెటర్ల హవా.. పస తగ్గిందనుకుంటే మరింత చెలరేగుతున్నారు!

వాళ్ల పనైపోయింది ఇక షెడ్డుకే అన్నారు. పస తగ్గింది తీసి పక్కన పెట్టండి అంటూ విమర్శించారు. పెర్ఫార్మ్ చేయకపోయినా ఇంకెన్నాళ్లు ఆడతారు భయ్యా అంటూ క్వశ్చన్ చేశారు. టీమ్స్​కు మైండ్ లేదా? వాళ్లను ఎలా కంటిన్యూ చేస్తున్నారంటూ ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్లే దిక్కయ్యారు. ఈసారి ఐపీఎల్​లో సీనియర్ క్రికెటర్ల హవా నడుస్తోంది. పస తగ్గిందనుకున్న ప్లేయర్లు మరింత చెలరేగి ఆడుతున్నారు. తమలో ఇంకా ఆడే సత్తా ఉందని ప్రూవ్ చేస్తున్నారు. బ్యాట్​తోనే గాక బంతితోనూ రాణిస్తూ ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. ఫీల్డింగ్​లో కూడా పాదరసంలా కదులుతూ కుర్ర క్రికెటర్లకు గట్టి పోటీని ఇస్తున్నారు. మరి.. ఎవరా సీనియర్ ప్లేయర్లు? అనేది ఇప్పుడు చూద్దాం..

ఈసారి ఐపీఎల్​లో ముగ్గురు వెటరన్ క్రికెటర్లు మంచి జోరు మీద ఉన్నారు. వాళ్లు బరిలోకి దిగితే విధ్వంసమే అనేలా పరిస్థితి ఉంది. ఆ ముగ్గురిలో ఇద్దరు ఒక టీమ్​కు ఆడేవారే. వాళ్లు మరెవరో కాదు.. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, దినేష్ కార్తీక్. కోల్​కతా నైట్ రైడర్స్ విజయాల్లో రస్సెల్, నరైన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆదుకుంటున్నాడు డీకే. ఆ టీమ్ సాధించిన ఒకే ఒక విజయం కూడా కార్తీక్ మెరుపు బ్యాటింగ్ వల్ల వచ్చిందే కావడం గమనార్హం. ఈ సీజన్ తొలి మ్యాచ్​ నుంచి ఈ సీనియర్ క్రికెటర్లు సూపర్బ్​ టచ్​లో ఉన్నారు. కార్తీక్ కీపింగ్​, బ్యాటింగ్​లో అదరగొడుతుంటే.. నరైన్, రస్సెల్ బౌలింగ్, బ్యాటింగ్​లో తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు.

సీజన్ తొలి మ్యాచ్​లో ఆర్సీబీ మీద 25 బంతుల్లోనే 64 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్​తో విరుచుకుపడ్డాడు రస్సెల్. పలు సీజన్లుగా ఫామ్​ లేమితో బాధపడుతున్న ఈ విండీస్ వీరుడు.. ఇప్పుడు మంచి టచ్​లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్​లో బౌలింగ్​లో కూడా 2 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో అతడికి బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. బౌలింగ్​లో 2 వికెట్లు తీసి అపోజిషన్ టీమ్​ను ముప్పుతిప్పలు పెట్టాడు. రస్సెల్ బౌలింగ్​లో పరుగులు చేయలేక కోహ్లీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

ఇక, ఫస్ట్ మ్యాచ్​లో బ్యాటింగ్​లో ఫెయిలైన సునీల్ నరైన్.. బెంగళూరుతో నిన్న జరిగిన మ్యాచ్​లో 22 బంతుల్లో 47 పరుగులు చేసి మ్యాచ్​ను వన్​ సైడ్ చేసేశాడు. ఆర్సీబీతో మ్యాచ్​లో 1 వికెట్ కూడా తీశాడు. దినేష్ కార్తీక్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ సత్తా చాటాడు. సీఎస్​కేతో మ్యాచ్​లో 26 బంతుల్లో 38 నాటౌట్, పంజాబ్​ మీద 10 బంతుల్లో 28 నాటౌట్, కేకేఆర్​పై 8 బంతుల్లో 20 రన్స్ చేశాడు. చివర్లో వచ్చి ధనాధన్ బ్యాటింగ్​తో అదరగొడుతున్న డీకే వల్లే పంజాబ్ మీద నెగ్గింది ఆర్సీబీ. ఇలా ఈ ముగ్గురు స్టార్లు తమ టీమ్స్ సక్సెస్​లో చాలా కీలకంగా మారారు. వీళ్లు ఇదే రీతిలో ఆడితే ఆయా జట్లకు తిరుగుండదు. మరి.. కార్తీక్, రస్సెల్, నరైన్ పెర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి