Nidhan
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో కింగ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఏంటా రికార్డు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో కింగ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఏంటా రికార్డు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో హైస్కోరింగ్ బ్యాటిల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. చివరి వరకు పోరాడిన ఆర్సీబీ కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. కేకేఆర్ సంధించిన 222 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 221 పరుగులు చేయగలిగింది. విల్ జాక్స్ (55), రజత్ పాటిదార్ (52)తో పాటు ఆఖర్లో కర్ణ్ శర్మ (20) పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. అంపైరింగ్ మిస్టేక్స్ ఆర్సీబీ కొంపముంచాయి. కోహ్లీ ఔట్ దగ్గర నుంచి సుయాష్ ప్రభుదేశాయ్ సిక్స్, మహిపాల్ లోమ్రోర్ ఔట్ వరకు అంపైర్లు చేసిన తప్పిదాలు బెంగళూరు పాలిట శాపంగా మారాయి. ఓటమి ఎదురైనా ఫైటింగ్ స్పిరిట్‌తో అందరి మనసులు గెలుచుకుంది డుప్లెసిస్ సేన. కోహ్లీ అరుదైన ఘనత ఆ టీమ్ ఫ్యాన్స్‌కు ఇంకో ఊరటగా చెప్పాలి.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లీ 7 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. అందులో ఒక బౌండరీతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ పట్టుదలతో ఆడాడు. బిగ్ షాట్స్ కొడుతూ సూపర్ టచ్‌లో కనిపించాడు. అయితే హర్షిత్ రాణా బౌలింగ్‌లో వివాదాస్పద రీతిలో ఔట్ అయ్యాడు. దీని గురించి పక్కన బెడితే ఈ మ్యాచ్‌తో కింగ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో కొట్టిన రెండు సిక్సులతో ఐపీఎల్లో కోహ్లీ సిక్సుల సంఖ్య 264కు చేరింది. ఫస్ట్ సీజన్ నుంచి ఆర్సీబీకే ఆడుతూ వస్తున్న విరాట్.. ఈ రెండు సిక్సులతో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ హిస్టరీలో ఒక జట్టు తరఫున ఆడుతూ ఎక్కువ సిక్సులు కొట్టిన ఫస్ట్ క్రికెటర్‌గా కింగ్ అరుదైన ఘనత సాధించాడు. తన కంటే ముందజంలో ఉన్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను విరాట్ అధిగమించాడు. గేల్ ఆర్సీబీ తరఫున 91 మ్యాచుల్లో 263 సిక్సులు బాదాడు.
టీ20 క్రికెట్లో ఒక టీమ్ తరఫున ఆడుతూ అత్యధిక సిక్సులు బాదిన వారిలో కోహ్లీ, గేల్ తర్వాతి స్థానాల్లో మరో కరీబియన్ వీరుడు కీరన్ పొలార్డ్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నారు. పొలార్డ్ ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ 211 మ్యాచుల్లో 258 సిక్స్‌లు బాదాడు. అదే ధోని సీఎస్కే తరఫున 251 మ్యాచుల్లో 243 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ ముంబైకు ఆడుతూ 214 మ్యాచుల్లో 240 సిక్స్‌లు బాదాడు. అయితే ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక సిక్సులు కొట్టిన లిస్ట్‌లో గేల్ (357 సిక్స్‌లు) ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ (275 సిక్స్‌లు) ఉన్నాడు. మరి.. కోహ్లీ వరల్డ్ రికార్డ్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.