iDreamPost

వీడియో: RCBని ఓడించిన అంపైర్లు! కోహ్లీ ఔట్​తో పాటు మరిన్ని ప్రూఫ్​లు!

  • Published Apr 22, 2024 | 10:29 AMUpdated Apr 22, 2024 | 10:29 AM

గెలవాల్సిన మ్యాచ్​లో కేకేఆర్ చేతిలో ఓడిన ఆర్సీబీ నిరాశలో కూరుకుపోయింది. అయితే ఆ టీమ్​ ఓటమిలో అంపైర్ల పాత్ర తెలిస్తే మీరూ షాకవ్వాల్సిందే.

గెలవాల్సిన మ్యాచ్​లో కేకేఆర్ చేతిలో ఓడిన ఆర్సీబీ నిరాశలో కూరుకుపోయింది. అయితే ఆ టీమ్​ ఓటమిలో అంపైర్ల పాత్ర తెలిస్తే మీరూ షాకవ్వాల్సిందే.

  • Published Apr 22, 2024 | 10:29 AMUpdated Apr 22, 2024 | 10:29 AM
వీడియో: RCBని ఓడించిన అంపైర్లు! కోహ్లీ ఔట్​తో పాటు మరిన్ని ప్రూఫ్​లు!

డూ ఆర్ డై మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. ప్లేఆఫ్స్​కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన వేళ ఓటమిపాలైంది డుప్లెసిస్ సేన. కోల్​కతా నైట్ రైడర్స్​తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్​లో 1 పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ టీమ్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఏదైనా అద్భుతాలు జరిగితే చెప్పలేం. కానీ అఫీషియల్​గా మాత్రం ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోయాయి. అయితే హైటెన్షన్ మ్యాచ్​లో బంతి బంతికి విజయం ఇరు టీమ్స్​తో దోబూచులాడింది. ఆఖరి వరకు పోరాడినా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఆ జట్టు ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నా అసలు రీజన్ మాత్రం అంపైర్లేనని చెప్పాలి. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

విరాట్ కోహ్లీ ఔట్​తో సహా ఇంకొన్ని విషయాల్లో అంపైరింగ్ మిస్టేక్స్ బెంగళూరుకు శాపంగా మారాయి. అవన్నీ అనుకూలంగా వచ్చి ఉంటే ఆ టీమ్ మరికొన్ని బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించేది. విరాట్ ఔట్ నుంచి మొదలైన అంపైరింగ్ తప్పులు సుయాష్ సిక్స్ విషయం వరకు బెంగళూరుకు వ్యతిరేకంగా వచ్చాయి. హర్షిత్ రాణా వేసిన బీమర్​కు విరాట్ ఔట్ అయ్యాడు. అప్పటికే 7 బంతుల్లో 1 బౌండరీ, 2 సిక్సుల సాయంతో 18 పరుగులు చేసిన కింగ్ సూపర్ టచ్​లో కనిపించాడు. కానీ నడుము కంటే ఎత్తులో వచ్చిన బాల్​ను డిఫెన్స్ చేయబోయి ఔట్ అయ్యాడతను. సాధారణంగా అది నో బాల్. కానీ టెక్నికల్​గా చూసుకుంటే బాల్ డిప్ అయింది కాబట్టి విరాట్​ను ఔట్​గా ప్రకటించారు. ఇక్కడే ఆర్సీబీకి మొదటి దెబ్బ పడింది. ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్ (4) రూపంలో ఆ టీమ్​కు మరో షాక్ తగిలింది.

లోమ్రోర్​ను సునీల్ నరైన్ ఔట్ చేశాడు. కాట్ అండ్ బౌల్డ్​గా ఔటై పెవిలియన్​కు చేరుకున్నాడతను. అయితే అది నో బాల్. నరైన్ బంతి వేసిన సమయంలో అతడి ఫ్రంట్ ఫుట్ లైన్​ను దాటింది. అయినా దీన్ని గమనించని అంపైర్లు ఔట్​గా ప్రకటించారు. తీరా తర్వాత రీప్లేలో చూస్తే అది క్లియర్ నో బాల్ అని తేలింది. అలాగే సూయాష్ ప్రభుదేశాయ్ విషయంలోనూ అంపైర్లు తప్పు చేశారు. 18 బంతుల్లో 24 పరుగులతో సూయాష్ జోరు మీదున్నాడు. అతడే మ్యాచ్​ను ఫినిష్​ చేస్తాడని అంతా అనుకున్నారు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్​లో లెగ్ సైడ్ అతడు కొట్టిన బౌండరీ లైన్ బయట పడింది. అయితే అది సిక్స్ అయినా దాన్ని అంపైర్లు బౌండరీగా ఇచ్చారు. తర్వాత రీప్లేలో అది స్పష్టంగా సిక్స్​కు వెళ్లినట్లు తేలింది. ఈ మ్యాచ్​లో ఆర్సీబీ 1 పరుగు తేడాతో ఓడింది. ఒకవేళ సూయాష్ షాట్​ను సిక్స్​గా ఇచ్చి ఉంటే ఇంకో బంతి మిగిలి ఉండగానే మ్యాచ్​ను నెగ్గేది. ఇది చూసిన నెటిజన్స్.. ఆర్సీబీని అంపైర్లే ఓడించారని కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చెత్త అంపైరింగ్ ఏంటని.. బీసీసీఐ ఏం చేస్తోందని నిలదీస్తున్నారు. మరి.. కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్​లో అంపైరింగ్ మిస్టేక్స్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి