iDreamPost
android-app
ios-app

కేకేఆర్ తో మ్యాచ్.. అరుదైన ఘనత సాధించిన బూమ్ బూమ్ బుమ్రా!

MI vs KKR- Jasprit Bumra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి ఇండియన్స్ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చింది. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా అయితే అరుదైన ఘనత కూడా సాధించాడు.

MI vs KKR- Jasprit Bumra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి ఇండియన్స్ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చింది. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా అయితే అరుదైన ఘనత కూడా సాధించాడు.

కేకేఆర్ తో మ్యాచ్.. అరుదైన ఘనత సాధించిన బూమ్ బూమ్ బుమ్రా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి ఇండియన్స్ ఇన్నాళ్లు సరైన పదర్శన చేయలేదు అంటూ ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. కానీ, కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం ముంబయి జట్టు తమ విశ్వరూపాన్ని చూపించింది. ముఖ్యంగా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా తన రోల్ ను ఎంతో చక్కగా పూర్తి చేశాడు. మొత్తానికి కేకేఆర్ జట్టును ఒక బంతి మిగిలి ఉండగానే.. 169 బంతులకు ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్ లో జాస్ప్రిత్ బుమ్రాకి పర్పుల్ క్యాప్ దక్కింది అంతేకాకుండా మరో అరుదైన ఘనత కూడా సాధించాడు.

కేకేఆర్- ముంబయి మ్యాచ్ లో బౌలర్లు అద్భుతం సృష్టించారు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబయి మొదటి ఓవర్ నుంచి కేకేఆర్ పై ఆధిపత్యం చలాయించింది. వారిని కేవలం 169 పరుగలుకే ఆలౌట్ కూడా చేశారు. ఈ మ్యాచ్ లో జాస్ప్రిత్ బుమ్రా మెస్మరైజింగ్ స్పెల్ వేశాడు. ఈ మ్యాచ్ లో 3.5 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో 3 కీలక వికెట్లను పడగొట్టాడు. అప్పటి వరకు క్రీజులో పాతుకుపోయిన వెంకటేశ్ అయ్యర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతేకాకుండా రమణ్ దీప్ సింగ్, స్టార్క్ వికెట్లు కూడా తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో తీసిన వికెట్లతో పర్పుల్ క్యాప్ ని కూడా సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో జాస్ప్రిత్ బుమ్రా పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా.. ఇంకో ఘనత కూడా సాధించాడు. అదేంటంటే.. ఒక ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక సార్లు 3 వికెట్లు తీసిన లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. బుమ్రా అత్యధికంగా 23 సార్లు ఒక మ్యాచ్ లో 3 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాకుండా.. ఒకే వెన్యూలో 50కి పైగా వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులోకి బుమ్రా కూడా చేరాడు. ముంబయి వాంఖడే వేదికగా బుమ్రా మొత్తం 51 వికెట్లు తీశాడు. ఈ లిస్ట్ లో సునీల్ నరైన్ 69 వికెట్లతో తొలిస్థానంలో ఉన్నాడు.

ఇవి మాత్రమే కాకుండా.. ఈ సీజన్లో బుమ్రా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో కూడా 40 పరుగులు ఇవ్వలేదు. ఇంక ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ లో వెంకటేశ్ అయ్యర్(70), మనీష్ పాండే(42) మినహా మిగిలిన ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ముంబయి బౌలింగ్ చూస్తే.. తుషారా- బుమ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. ఒక రనౌట్ కూడా చేశాడు. చావ్లా ఒక వికెట్ తీసుకున్నాడు. మరి.. జాస్ప్రిత్ బుమ్రా సాధించిన ఈ అరుదైన ఫీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.