iDreamPost
android-app
ios-app

ఫిక్సింగ్ ఆరోపణలకు BCCI కౌంటర్.. ఒక్క దెబ్బతో అందరి నోళ్లూ మూయించారు!

  • Published Apr 19, 2024 | 10:00 PM Updated Updated Apr 19, 2024 | 10:00 PM

ఐపీఎల్-2024లో ఈ మధ్య జరిగిన పలు మ్యాచులపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. టాస్ విషయంలో ఫిక్సింగ్ జరుగుతోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి బీసీసీఐ గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఐపీఎల్-2024లో ఈ మధ్య జరిగిన పలు మ్యాచులపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. టాస్ విషయంలో ఫిక్సింగ్ జరుగుతోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి బీసీసీఐ గట్టి కౌంటర్ ఇచ్చింది.

  • Published Apr 19, 2024 | 10:00 PMUpdated Apr 19, 2024 | 10:00 PM
ఫిక్సింగ్ ఆరోపణలకు BCCI కౌంటర్.. ఒక్క దెబ్బతో అందరి నోళ్లూ మూయించారు!

ఐపీఎల్-2024లో ఓ విషయం బాగా వివాదాస్పదం అవుతోంది. దీని వల్ల క్యాష్ రిచ్ లీగ్ నిర్వాహకులతో పాటు భారత క్రికెట్ బోర్డు కూడా అపవాదును ఎదుర్కొంటోంది. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహించేది ఇలాగేనా? అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ఐపీఎల్ మ్యాచుల్లో టాస్ విషయంలో జరుగుతోంది. మరీ ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్​ల్లో కావాలనే టాస్​ను ఫిక్సింగ్ చేస్తున్నారు? అవతలి టీమ్ టాస్ నెగ్గినా ఎంఐ గెలిచిందంటూ కాయిన్​ను తిప్పడం లాంటివి చేస్తున్నారంటూ సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ బాగా వస్తున్నాయి. దీని గురించి ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, సన్​రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ గ్రౌండ్​లోనే డిస్కస్ చేసుకోవడం ఇటీవల వైరల్​గా మారింది. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న ఆరోపణలకు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

లక్నో సూపర్ జియాంట్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో ఎన్నడూ లేని విధంగా టాస్​ను మరింత జూమ్ చేసి చూపించారు. ఏ టీమ్ టాస్ నెగ్గిందో కూడా టెలికాస్ట్ చేశారు. సాధారణంగా టాస్ విషయంలో అంత పర్టిక్యులర్​గా ఉండరు. టాస్ వేసేటప్పుడు, ఆ తర్వాత ఎవరు నెగ్గారో ప్రెజెంటర్, మ్యాచ్ రిఫరీలు చెబుతుంటారు. కానీ టాస్ విషయంలో ఫిక్సింగ్ జరుగుతోందంటూ వస్తున్న ఆరోపణలను సీరియస్​గా తీసుకున్న బీసీసీఐ.. దీని గురించి బ్రాడ్​కాస్టర్స్​ జియో సినిమా, హాట్ స్టార్​తో కలసి చర్చించిందని తెలుస్తోంది. దీని ఫలితంగానే లక్నో, చెన్నై మ్యాచ్​లో టాస్​ను మరింత జూమ్ చేసి స్పష్టంగా చూపించారని సమాచారం. ఏదేమైనా ఇప్పుడీ టాస్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

BCCI

ఎల్​ఎస్​జీ-సీఎస్​కే మ్యాచ్​ టాస్ వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. టాస్ విషయంలో వస్తున్న విమర్శలకు ఈ ఒక్క పనితో బోర్డు గట్టి కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. ఇక మీదట ఫిక్సింగ్ అంటూ విమర్శలు చేయడానికి కూడా భయపడేలా తిట్టిన నోళ్లను మూయించిందని చెబుతున్నారు. బీసీసీఐ చేసిన పనికి మెచ్చకోవాల్సిందేనని.. ఈ పనితో గేమ్​లో మరింత పారదర్శకత వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. టాస్ విషయంలో బోర్డు చేసిన పనికి తాము మద్దుతు ఇస్తామని నెటిజన్స్ అంటున్నారు. ఇలాంటి మరిన్ని చర్యలతో ఐపీఎల్​పై ఎలాంటి మచ్చ పడకుండా చూడాలని సూచిస్తున్నారు. మరి.. టాస్​ను జూమ్ చేసి టెలికాస్ట్ చేయాలనే బీసీసీఐ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.