iDreamPost

Virat Kohli: వీడియో: కార్తీక్ భార్యపై కోహ్లీ కామెంట్స్.. RCB ఆటగాళ్లు అంతా షాక్!

  • Published Apr 19, 2024 | 8:11 PMUpdated Apr 19, 2024 | 8:11 PM

ఆర్సీబీ జట్టు వరుస పరాజయాలతో పూర్తిగా డీలా పడిపోయింది. ఐపీఎల్ ఫస్టాఫ్ ముగిసేసరికి ఆ టీమ్ పాయింట్స్ టేబుల్​లో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే బెంగళూరు ఓడిపోయినా గానీ విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ పోరాటపటిమ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఆర్సీబీ జట్టు వరుస పరాజయాలతో పూర్తిగా డీలా పడిపోయింది. ఐపీఎల్ ఫస్టాఫ్ ముగిసేసరికి ఆ టీమ్ పాయింట్స్ టేబుల్​లో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే బెంగళూరు ఓడిపోయినా గానీ విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ పోరాటపటిమ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది.

  • Published Apr 19, 2024 | 8:11 PMUpdated Apr 19, 2024 | 8:11 PM
Virat Kohli: వీడియో: కార్తీక్ భార్యపై కోహ్లీ కామెంట్స్.. RCB ఆటగాళ్లు అంతా షాక్!

ప్రతి ఏడాది గంపెడాశలతో ఐపీఎల్​ను స్టార్ట్ చేయడం కప్పు లేకుండానే టోర్నీని ముగించడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అలవాటుగా మారింది. 16 ఏళ్ల క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో ఆర్సీబీ ఒకటి. హ్యూజ్ ఫ్యాన్ బేస్ కలిగిన ఈ టీమ్ ఈసారైనా మ్యాజిక్ చేస్తుందని అభిమానులు భావించారు. ఈసాలా కప్ నమ్దే అంటూ మరోమారు నమ్మకంతో ఉన్నారు. కానీ వాళ్ల ఆశల్ని అడియాశలు చేస్తూ వరుస పరాజయాలతో ఫస్టాఫ్ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్​లో లాస్ట్​ ప్లేస్​లో నిలిచింది డుప్లెసిస్ సేన. అయితే గెలుపోటముల సంగతి పక్కనబెడితే టీమ్​లోని సీనియర్లు విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ ఆడుతున్న తీరును మాత్రం మెచ్చుకోవాల్సిందే. వీళ్లు తుదివరకు పోరాడుతూనే ఉన్నారు. అలాంటి వీళ్లిద్దరి మధ్య సంభాషణకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కార్తీక్ భార్య మీద కోహ్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరాట్ ఇంత మాట అనేశాడేంటని చాలా మంది షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆర్సీబీ ఆటగాళ్ల మధ్య చిన్న ఇంటర్వ్యూ నిర్వహించారు. దీనికి ఆ జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ డీకే హోస్ట్​గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా పలు సరదా ప్రశ్నలు అడుగుతూ, వాటికి అంతే ఫన్నీ ఆన్సర్స్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ జాలీగా సాగింది. అయితే కార్తీక్ అడిగిన ఓ క్వశ్చన్​కు కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్రికెటర్లు కాకుండా నీకు ఇష్టమైన ఇతర స్పోర్స్​పర్సన్ ఎవరు? అని కింగ్​ను డీకే అడిగాడు. దీనికి వెంటనే ‘నీ భార్య’ అంటూ సమాధానం ఇచ్చాడు విరాట్. దీంతో క్షణకాలం కార్తీక్​తో పాటు అక్కడ ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లందరూ షాకయ్యారు.

Virat kohli coments on DK s wife

కోహ్లీ రిప్లైని అంతే సరదాగా తీసుకున్న డీకే గ్రేట్ ఆన్సర్ అంటూ నవ్వాడు. దీంతో విరాట్ కూడా నవ్వుల్లో మునిగిపోయాడు. తన మైండ్​లో డిఫరెంట్ ఆన్సర్ ఉందన్నాడు కార్తీక్. దీంతో కింగ్ పగలబడి నవ్వాడు. నువ్వు నన్ను పట్టేశావంటూ డీకే కూడా స్మైల్ ఇచ్చాడు. ఇక, కార్తీక్ సతీమణి దీపికా పల్లికల్ స్క్వాష్ క్రీడాకారిణి అనే సంగతి తెలిసిందే. స్క్వాష్ ప్లేయర్​గా ఆమె ఇంటర్నేషనల్ వైడ్​గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమెను ఆరాధించే అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే ఫేవరెట్ స్పోర్ట్స్​పర్సన్ అని డీకే అడగ్గానే అతడు ఎక్స్​పెక్ట్ చేయని విధంగా ‘నీ వైఫ్’ అని కోహ్లీ ఆన్సర్ ఇచ్చాడు. అయితే కొందరు మాత్రం విరాట్ అంత మాట అనేశాడేంటి అంటూ దీనికి విపరీతార్థాలు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి నెటిజన్స్ కౌంటర్ ఇస్తున్నారు. కార్తీక్​ను ఆటపట్టిద్దామని, ఫన్నీగా కోహ్లీ అలా అన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దీంట్లో తప్పు పట్టాల్సిందేమీ లేదని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి