iDreamPost
android-app
ios-app

పేరు ఘనం.. ఆట దారుణం! చెత్త బౌలింగ్​తో ఓటమికి కారణమవుతున్న బౌలర్లు!

  • Published Mar 31, 2024 | 4:14 PM Updated Updated Mar 31, 2024 | 4:14 PM

పేరుకు వాళ్లు టాప్ బౌలర్స్. వేలంలో భారీ ధర చెల్లించి మరీ వాళ్లను ఫ్రాంచైజీలు కొనుక్కున్నాయి. కానీ దారుణమైన బౌలింగ్​తో ఈసారి ఐపీఎల్​లో తమ టీమ్స్ ఓటములకు కారణాలుగా మారుతున్నారు. ఇంతకీ ఎవరా బౌలర్లు అనేది ఇప్పుడు చూద్దాం..

పేరుకు వాళ్లు టాప్ బౌలర్స్. వేలంలో భారీ ధర చెల్లించి మరీ వాళ్లను ఫ్రాంచైజీలు కొనుక్కున్నాయి. కానీ దారుణమైన బౌలింగ్​తో ఈసారి ఐపీఎల్​లో తమ టీమ్స్ ఓటములకు కారణాలుగా మారుతున్నారు. ఇంతకీ ఎవరా బౌలర్లు అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 31, 2024 | 4:14 PMUpdated Mar 31, 2024 | 4:14 PM
పేరు ఘనం.. ఆట దారుణం! చెత్త బౌలింగ్​తో ఓటమికి కారణమవుతున్న బౌలర్లు!

క్రికెట్​లో బ్యాటర్లకు ఉన్నంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు గానీ బౌలర్లు కూడా ఎంతో కీలకం. మ్యాచ్​లో నెగ్గాలంటే టీమ్​లో టాలెంటెడ్ బౌలర్లు ఉండాలి. ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడుతూ పరుగులు కట్టడి చేయడమే గాక వికెట్ల మీద వికెట్లు తీసేవాళ్లు కావాలి. అందుకే మంచి బౌలర్లను వెతకడంలో అన్ని జట్లు బిజీగా ఉంటాయి. ఐపీఎల్​లోనూ ఫ్రాంచైజీలు ఏరికోరి కొందరు బౌలర్లను టీమ్స్​లోకి తీసుకుంటాయి. కొందరికైతే కోట్లకు కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకుంటాయి. అలాంటోళ్లు బాగా పెర్ఫార్మ్ చేస్తే ఓకే, కానీ చెత్తాటతో టీమ్​ ఓటమికి కారణమైతే మాత్రం విమర్శించాల్సిందే. అలా చెత్త బౌలింగ్​తో ఈసారి క్యాష్ రిచ్ లీగ్​లో నలుగురు బౌలర్లు అందరి టార్గెట్​గా మారారు. ఎవరా బౌలర్లు? ఏయే టీమ్స్​లో ఆడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఈసారి ఐపీఎల్​లో టాప్-4 వరస్ట్ బౌలర్స్​లో ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు సన్​రైజర్స్​ వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు భువీ. 8 ఓవర్లు వేసి 104 పరుగులు ఇచ్చుకున్నాడు. అతడి బౌలింగ్ ఎకానమీ 13గా ఉంది. వికెట్లు తీయకపోగా ఓవర్​కు 13 చొప్పున రన్స్ లీక్ చేస్తున్నాడతను. ట్రోఫీ నెగ్గాలని పట్టుదలతో ఉన్న ఎస్​ఆర్​హెచ్​కు బలం అవుతాడని అనుకుంటే.. చెత్త బౌలింగ్​తో టీమ్​కు భారంగా మారాడు భువీ. ఇక, వరస్ట్ బౌలర్స్ లిస్ట్​లో రెండో ప్లేస్​లో ఉన్నాడు కోల్​కతా నైట్ రైడర్స్ ఏస్ పేసర్ మిచెల్ స్టార్క్. మినీ ఆక్షన్​లో రూ.25 కోట్లు పెట్టి మరీ ఈ ఆసీస్ స్పీడ్​స్టర్​ను కొనుక్కుంది కేకేఆర్. మిగిలిన టీమ్స్​తో పోటీపడి దక్కించుకుంటే అతడు మాత్రం చెత్తాటతో దారుణంగా నిరాశపరుస్తున్నాడు.

ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో స్టార్క్ 12.50 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 8 ఓవర్లు వేసి ఏకంగా 100 పరుగులు ఇచ్చుకున్నాడు. కేకేఆర్ కీర్తి కిరీటంలో మరో ఐపీఎల్ ట్రోఫీని తీసుకొచ్చి పెడతాడనుకుంటే టీమ్​కు అతిపెద్ద మైనస్​గా మారాడు స్టార్క్. అతడి బౌలింగ్​లో బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. బౌండరీలు, సిక్సులు బాదుతూ స్టార్క్​కు చుక్కలు చూపిస్తున్నారు. కాగా, వరస్ట్ ఎకానమీ కలిగిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ పేసర్ అల్జారీ జోసెఫ్​ ఉన్నాడు.

జోసెఫ్ మూడు మ్యాచుల్లో 9.4 ఓవర్లు వేసి.. 115 పరుగులు ఇచ్చుకున్నాడు. బౌలింగ్ బలహీనంగా ఉందని బాధపడుతున్న ఆర్సీబీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాడు జోసెఫ్. ఈ లిస్ట్​లో ఆఖరి స్థానంలో ఉన్నాడు పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్. ఇప్పటిదాకా టోర్నీలో 8 ఓవర్లు వేసి 92 పరుగులు ఇచ్చుకున్నాడతను. 3 వికెట్లు తీసినా కీలక సమయాల్లో రన్స్ సమర్పించుకుంటూ చేతికొచ్చిన మ్యాచ్​ను పంజాబ్ నుంచి జారిపోయేలా చేస్తున్నాడు. దీంతో మాకు వద్దు ఈ దరిద్రం అని పంజాబ్ ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. మరి.. ఈ బౌలర్లు పుంజుకొని టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తారని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: దేశం మారినా రాత మారలేదు.. క్రికెట్​లో ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు!