iDreamPost

దేశం మారినా రాత మారలేదు.. క్రికెట్​లో ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు!

  • Published Mar 31, 2024 | 2:07 PMUpdated Mar 31, 2024 | 2:07 PM

కొందరు అన్​లక్కీ ప్లేయర్లు ఉంటారు. ఎంతో టాలెంట్ ఉన్నా వాళ్లు పెద్దగా ఏదీ సాధించలేరు. దురదృష్టమో ఇంకేమో కానీ వాళ్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సాగుతుంది. అలాంటి ఓ క్రికెటర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

కొందరు అన్​లక్కీ ప్లేయర్లు ఉంటారు. ఎంతో టాలెంట్ ఉన్నా వాళ్లు పెద్దగా ఏదీ సాధించలేరు. దురదృష్టమో ఇంకేమో కానీ వాళ్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సాగుతుంది. అలాంటి ఓ క్రికెటర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

  • Published Mar 31, 2024 | 2:07 PMUpdated Mar 31, 2024 | 2:07 PM
దేశం మారినా రాత మారలేదు.. క్రికెట్​లో ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు!

కొందరు అన్​లక్కీ ప్లేయర్లు ఉంటారు. ఎంతో టాలెంట్ ఉన్నా వాళ్లు పెద్దగా ఏదీ సాధించలేరు. దురదృష్టమో ఇంకేమో కానీ వాళ్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సాగుతుంది. కెరీర్​లో ఎక్కడికో వెళ్తారు, అన్ని రికార్డులు బద్దలు కొడతారు అంటూ అందరూ వారి మీద ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కానీ అవేవీ వర్కౌట్ కావు. అలాంటి ఓ దురదృష్టవంతుడే ఉన్ముక్త్ చంద్. కెప్టెన్​గా భారత జట్టుకు అండర్-19 వరల్డ్ కప్ అందించాడు. సూపర్బ్ బ్యాటింగ్​తో టీమిండియా ఫ్యూచర్ స్టార్​ తానేనని ఆశలు రేకెత్తించాడు. అందరూ అతడ్ని నెక్స్ట్ సచిన్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ ఎంత ప్రయత్నించినా టీమిండియాలో చోటు దక్కలేదు. ఐపీఎల్​లోనూ ఐదారు సీజన్స్ ఆడినా అంతగా ఇంప్రెస్ చేయలేదు. వచ్చిన అరకొర ఛాన్సులను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు.

డొమెస్టిక్ క్రికెట్​లో సత్తా చాటినా భారత సెలక్టర్లు ఉన్ముక్త్ చంద్​ను కరుణించలేదు. దీంతో అతడు విసిగిపోయాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్​లోనూ అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించి.. ఛాన్సులు వెతుక్కుంటూ అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లాడు. యూఎస్​ఏ టీమ్​కు ఆడి తన ఇంటర్నేషనల్ క్రికెట్ డ్రీమ్​ను సాకారం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కసిగా అక్కడికి వెళ్లిన ఉన్ముక్త్.. మైనర్ క్రికెట్ లీగ్​లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్​గా నిలిచాడు. దీంతో జూన్​లో జరిగే టీ20 వరల్డ్ కప్​లో అమెరికా టీమ్​కు అతడ్నే కెప్టెన్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ ఉన్ముక్త్​ను బ్యాడ్ లక్ వెంటాడింది. కెనడాతో జరిగే టీ20 సిరీస్ కోసం ప్రకటించిన యూఎస్ స్క్వాడ్​లో అతడికి ప్లేస్ దక్కలేదు.

There is no more unlucky person in cricket!

కెనడా సిరీస్​కు కివీస్ ఆల్​రౌండర్ కోరె అండర్సన్​తో పాటు గజానంద్ సింగ్, జెస్సీ సింగ్, మోనక్ పటేల్, నిస్గర్ పటేల్, స్టీవెన్ టేలర్, ఉస్మాన్ రఫీక్, నోష్​టుష్​ కెన్జిగ్ తదిరత ప్లేయర్లను సెలక్ట్ చేశారు. ఈ సిరీస్​లో చోటు దక్కకపోవడంతో టీ20 వరల్డ్ కప్​లో ఉన్ముక్త్ ఆడటం కష్టంగా మారింది. ఒకవేళ కెనడాతో సిరీస్​లో ఆడితే అతడి ప్రపంచ కప్ ఆశలు సజీవంగా ఉండేవి. కానీ టీమ్​లో స్థానం లభించకపోవడంతో వరల్డ్ కప్ ఆశలు దాదాపుగా అడుగంటినట్లే. ఎన్నో ఆశలతో దేశం దాటి వెళ్తే మళ్లీ దురదృష్టమే వెంటాడటంతో ఉన్ముక్త్ ఎమోషనల్ అయ్యాడు. తన బాధను వ్యక్తం చేస్తూ ట్విట్టర్​లో ఓ పోస్ట్​ పెట్టాడు. వ్యవస్థ బాగుండాలని చాలా మంది కోరుకుంటారని, కానీ పవర్​లోకి వచ్చాక వాళ్లు కూడా అదే అన్యాయమైన మార్గంలో నడుస్తారని ఉన్ముక్త్ ఆ ట్వీట్​లో రాసుకొచ్చాడు. మార్పు తీసుకురావాలంటే బలంగా నిలబడటం తప్ప ఏమీ చేయలేమని తెలిపాడు. మరి.. దేశం మారినా ఉన్ముక్త్ రాత మారకపోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: టీమిండియాలోకి మయాంక్ యాదవ్.. T20 వరల్డ్ కప్​తో ఇంటర్నేషనల్ డెబ్యూ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి