Nidhan
హైస్కోరింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ ఆర్సీబీతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరుకు ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు వార్నింగ్ ఇచ్చారు.
హైస్కోరింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ ఆర్సీబీతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరుకు ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు వార్నింగ్ ఇచ్చారు.
Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాత మారింది. ఒక్క సీజన్ గ్యాప్‌లో ఆ టీమ్ ఆడేతీరు కంప్లీట్‌గా ఛేంజ్ అయింది. ఇంతవరకు బౌలింగ్ బలంగా ఆడుతూ వచ్చిన ఆరెంజ్ ఆర్మీకి ఇప్పుడు బ్యాటింగ్ యూనిట్ అతిపెద్ద బలంగా మారింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు గ్రౌండ్లోకి దిగింది మొదలు ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేవ్, పవర్ప్లేనా అనేది పట్టించుకోవడం లేదు, ఏ ఫీల్డర్ ఎక్కడున్నాడు అనే దాంతో సంబంధం లేకుండా బాల్‌ను బాదితే బౌండరీ లైన్ దాటాలి లేదా స్టాండ్స్‌లో పడాలనే సూత్రంతో చెలరేగుతున్నారు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడి 266 పరుగుల భారీ స్కోరు చేశారు. ఛేజింగ్‌లో డీసీ 199 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ తర్వాత ఆర్సీబీకి వార్నింగ్ ఇచ్చారు ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.
అపోజిషన్ టీమ్స్‌పై ఉరుములా విరుచుకుపడుతున్నారు సన్‌రైజర్స్ బ్యాటర్లు. 300 పరుగుల స్కోరును నమోదు చేయడమే తమ టార్గెట్ అని చెప్పిన ఎస్ఆర్హెచ్.. డీసీతో మ్యాచ్‌లో దాన్ని అందుకోలేకపోయింది. 266 దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఈ సీజన్లో 250 ప్లస్ స్కోర్లను మూడుసార్లు బాదిన ఆరెంజ్ ఆర్మీ.. 300 లక్ష్యాన్ని నెక్స్ట్ మ్యాచ్‌తో అందుకోవాలని చూస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీతో మ్యాచ్ తర్వాత ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పంచుకున్నారు. 266 కంటే 300 స్కోరు చాలా బాగుంటుందని, ఆ నంబర్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తామని అన్నారు. అదే తమ నెక్స్ట్ బిగ్ స్కోర్ అని చెప్పారు. ఆర్సీబీతో మ్యాచ్‌కు టికెట్లు అన్నీ అమ్ముడుబోయాయని.. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే ఆ మ్యాచ్‌లోనే దీన్ని అందుకుంటామని తెలిపారు.
ఉప్పల్ వేదికగా ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్కు మధ్య ఏప్రిల్ 25వ తేదీన మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో డీసీతో మ్యాచ్ ముగిశాక మాట్లాడుతూ ఆ జట్టుకు వార్నింగ్ ఇచ్చారు హెడ్-అభిషేక్. నెక్స్ట్ మ్యాచ్‌లో 300 టార్గెట్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. డుప్లెసిస్ సేనకు ఇక మూడిందని, ఆ టీమ్ బౌలర్లకు బ్యాండ్ బాజా బారాతేనని కామెంట్స్ చేస్తున్నారు. అంతో ఇంతో బెటర్ బౌలింగ్ యూనిట్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మీదే ఇంతలా విరుచుకుపడిన కమిన్స్ సేన.. చెత్త బౌలింగ్‌తో తిప్పలు పడుతున్న బెంగళూరును ఎలా వదులుతుందని క్వశ్చన్ చేస్తున్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరిన్ని రికార్డులు నమోదు చేయడం పక్కా అని చెబుతున్నారు. మరి.. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 300 స్కోరు చేస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: టీ 20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా ద్విముఖ వ్యూహం! ఆ రాక్షసులు ఇద్దరే ఓపెనర్స్!
Question: What is the next big score for SRH?
Abhishek Sharma said “Number 3 at front would be better looking than this”
Travis Head replied “I heard it’s sold out crowd next game, hopefully there if we continue good form”. pic.twitter.com/2stNgMeEGz
— Johns. (@CricCrazyJohns) April 21, 2024