iDreamPost

టీ 20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా ద్విముఖ వ్యూహం! ఆ రాక్షసులు ఇద్దరే ఓపెనర్స్!

Australia New Plan For T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే అన్ని జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా లెక్క నెక్ట్స్ లెవల్లో ఉంది. ఇప్పుడు ఓపెనర్స్ గా ఇద్దరు రాక్షసులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Australia New Plan For T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే అన్ని జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా లెక్క నెక్ట్స్ లెవల్లో ఉంది. ఇప్పుడు ఓపెనర్స్ గా ఇద్దరు రాక్షసులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

టీ 20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా ద్విముఖ వ్యూహం! ఆ రాక్షసులు ఇద్దరే ఓపెనర్స్!

ప్రస్తుతం అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మాయలోనే ఉన్నారు. అంతా పొట్టి క్రికెట్ మజాని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, అసలు సమరం ఇంకో నెలలో షురూ కాబోతోంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు కలిసిపోయి భాయీ భాయీ అన్నట్లు ఉన్నా కూడా.. అసలు క్రికెట్ మాత్రం అప్పుడే మొదలు అవుతుంది. ఈ ఐపీఎల్ ఇప్పుడు అన్ని క్రికెట్ టీమ్స్ కి ఫామ్ లోకి రావడానికి, టీ20 ప్రాక్టిస్ కి, బౌలర్లను ఎదుర్కోవడానికి ఒక మంచి ప్లాట్ ఫామ్ అయిపోయింది. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియా జట్టు చాప కింద నీరులా బలంగా మారుతోంది. జట్టు ఏదైనా కూడా వాళ్ల ఆటగాళ్లు విజృంభిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ ఇద్దరితోనే ఆస్ట్రేలియా జట్టు ఓపెనింగ్ చేయించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ అనేది ఇప్పుడు ప్రతి జట్టుకు ప్రాక్టీస్ కి మంచి అవకాశం ఇస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ప్రతి ఆటగాడు చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టుకు ఇది బాగా ప్లస్ అవుతోంది. ఏ జట్టులో ఉన్నా కూడా వాళ్ల ప్రదర్శన టాప్ నాచ్ గా ఉంటోంది. ఇలాంటి తరుణంలో టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మరోసారి బలమైన శక్తిగా ఎదగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వాళ్ల ప్రదర్శన చూస్తే అలాగే ఉంది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ జట్టులో ట్రావిస్ హెడ్ పేరు కచ్చితంగా ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రతి మ్యాచ్ లో విజృంభిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన తాజా మ్యాచ్ లో కూడా కేవలం 32 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. మరోవైపు ఢిల్లీ జట్టు తరఫున చెలరేగిన జేక్ ఫ్రాజర్ మెక్ గర్క్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కుర్రాడు కూడా ఆస్ట్రేలియా జట్టు తరఫున టీ20 వరల్డ్ కప్ టీమ్ లో ఉంటాడని చెప్తున్నారు. అంతేకాకుండా.. ఇంకో వార్త ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అదేంటంటే.. ఇప్పుడు ట్రావిస్ హెడ్- జేక్ ఫ్రాజర్ కలిసి టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనింగ్ చేయబోతున్నారు అంటున్నారు. నిజానికి ఆ ఊహ కూడా టీమిండియా క్రికెట్ అభిమానులకు నిద్ర పట్టనివ్వడం లేదు.

ఐపీఎల్ మ్యాచుల్లో అంటే తమ అభిమాన జట్లలో ఉన్నారు కాబట్టి వారి విధ్వంసాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, టీ20 వరల్డ్ కప్ లో ఇదే తరహా ప్రదర్శన అంటే మాత్రం ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మన యంగ్ స్టర్స్ కూడా ఫామ్ లోకి వస్తున్నా.. వారికి ఏ మాత్రం ఛాన్సులు వస్తాయో చెప్పే పరిస్థితి లేదు. ఈ థాట్ వచ్చిన తర్వాత టీమిండియా అభిమానులు ఐపీఎల్ మజా కంటే కూడా.. వరల్డ్ కప్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. మరోవైపు బీసీసీఐ కూడా పక్కా ప్రణాళికతో రావాలి అని సూచిస్తున్నారు. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రావిస్ హెడ్- జేక్ ఫ్రాజర్ ఆస్ట్రేలియాకి ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి