iDreamPost
android-app
ios-app

RR vs DC: రాజస్థాన్ vs ఢిల్లీ.. గెలుపు ఎవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Mar 27, 2024 | 8:31 PM Updated Updated Mar 27, 2024 | 8:31 PM

ఐపీఎల్-2024లో మరో ఇంట్రెస్టింగ్​ ఫైట్​ కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. తొలి మ్యాచ్​లో విక్టరీ సాధించి ఊపు మీదున్న రాజస్థాన్, బోణీ కొట్టేందుకు తహతహలాడుతున్న ఢిల్లీ మధ్య మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది.

ఐపీఎల్-2024లో మరో ఇంట్రెస్టింగ్​ ఫైట్​ కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. తొలి మ్యాచ్​లో విక్టరీ సాధించి ఊపు మీదున్న రాజస్థాన్, బోణీ కొట్టేందుకు తహతహలాడుతున్న ఢిల్లీ మధ్య మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది.

  • Published Mar 27, 2024 | 8:31 PMUpdated Mar 27, 2024 | 8:31 PM
RR vs DC: రాజస్థాన్ vs ఢిల్లీ.. గెలుపు ఎవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఐపీఎల్-2024లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్​కు అంతా రెడీ అయింది. తొలి మ్యాచ్​లో విక్టరీ సాధించి ఊపు మీదున్న రాజస్థాన్ రాయల్స్, బోణీ కొట్టేందుకు తహతహలాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. విజయాల జోరును కొనసాగించాలని సంజూ సేన చూస్తోంది. ఈ మ్యాచ్​తోనైనా ఖాతా తెరవాలని పంత్ టీమ్ భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్​లో టఫ్ కాంపిటీషన్ తప్పేలా కనిపించడం లేదు. సవాయ్ మాన్​సింగ్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరగనున్న ఈ మ్యాచ్​లో ఏయే టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి? ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోంది? ఎవరు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్ రాయల్స్

లక్నో సూపర్ జెయింట్స్​తో జరిగిన తొలి మ్యాచ్​లో నెగ్గిన రాజస్థాన్ ఈ సీజన్​ను పాజిటివ్​గా స్టార్ట్ చేసింది. ఆ మ్యాచ్​లో కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాట్​తో రఫ్ఫాడించాడు. 52 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. రియాన్ పరాగ్ (29 బంతుల్లో 43) కూడా తన బ్యాట్ పవర్ చూపించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12 బంతుల్లో 21) క్విక్ స్టార్ట్ అందించాడు. ఆ మ్యాచ్​లో ఫెయిలైన మరో ఓపెనర జాస్ బట్లర్, హార్డ్ హిట్టర్ షిమ్రాన్ హిట్​మెయిర్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫామ్​లో ఉన్న ధృవ్ జురెల్ రూపంలో మరో క్వాలిటీ బ్యాటర్​తో రాజస్థాన్​ బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. ట్రెంట్ బౌల్ట్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మతో కూడిన ఎక్స్​పీరియెన్స్​డ్ బౌలింగ్ యూనిట్ రాయల్స్​కు బిగ్ ప్లస్ అనే చెప్పాలి. అయితే స్పీడ్​స్టర్ బర్గర్ ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం, బట్లర్ పూర్ ఫామ్ ఆ టీమ్​కు మైనస్​గా మారింది.

ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ అతిపెద్ద బలం ఆ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్. రెండేళ్ల తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన పంత్.. ఫస్ట్ మ్యాచ్​లో 18 పరుగులే చేశాడు. కానీ మంచి టచ్​లో కనిపించాడు. కీపింగ్​లోనూ అతడి కదలికలు అద్భుతంగా ఉన్నాయి. టీమ్​ను నడిపిస్తున్న తీరు కూడా బాగుంది. పంజాబ్​తో మ్యాచ్​లో ఓడిపోయినా ఢిల్లీ పోరాడిన తీరును మెచ్చుకోవాలి. వార్నర్, మార్ష్ రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ ఉండటం ఆ టీమ్​కు బిగ్ ప్లస్. పంత్​తో పాటు హోప్ కూడా టచ్​లో ఉండటం కలిసొచ్చే అంశం. కొత్త కుర్రాడు అభిషేక్ పోరెల్ హార్డ్ హిట్టింగ్​తో ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. అయితే రికీ భుయ్, స్టబ్స్ ఫామ్​లో లేకపోవడం మైనస్ పాయింట్. బిగ్ ఇన్నింగ్స్​తో భారీ టార్గెట్ సెట్ చేసే బ్యాటర్ డీసీలో కనిపించడం లేదు. బౌలింగ్​లో కుల్దీప్ యాదవ్ తప్ప అందరూ తొలి మ్యాచ్​లో తేలిపోయారు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు.

ప్రిడిక్షన్

రెండు జట్ల బలాబలాలను బట్టి చూస్తే.. ఈ మ్యాచ్​లో రాజస్థాన్ విజయం సాధించడం తథ్యం. ఈ ఇరు టీమ్స్ మధ్య ఇప్పటిదాకా 27 మ్యాచ్​లు జరిగాయి. 13 మ్యాచుల్లో డీసీ, 14 మ్యాచుల్లో ఆర్ఆర్ నెగ్గాయి. అయితే రాజస్థాన్​ మంచి ఊపులో ఉండటం, ఆ టీమ్​కు పెద్దగా మైనస్​లు లేకపోవడం, హోమ్ గ్రౌండ్​లో మ్యాచ్ జరుగుతుండటం, డీసీ టీమ్ ఇంకా సెటిల్ కాకపోవడం దృష్ట్యా ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ గెలవడం ఖాయం.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

రాజస్థాన్:
జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్​మెయిర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.
ఢిల్లీ:
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, అన్రిచ్ నార్త్​జే, ఖలీల్ అహ్మద్.

ఇదీ చదవండి: రోహిత్ నామ స్మరణతో ఊగిపోతున్న ఉప్పల్ స్టేడియం! హార్దిక్ కి మళ్ళీ చుక్కలే!