iDreamPost
android-app
ios-app

RCB గెలుపు తర్వాత కోహ్లీ షాకింగ్ కామెంట్స్.. తన పేరును వాడుకుంటున్నారంటూ..!

  • Published Mar 26, 2024 | 9:09 AM Updated Updated Mar 26, 2024 | 9:09 AM

ఐపీఎల్-2024లో ఆర్సీబీ తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్​ను ఓడించింది డుప్లెసిస్ సేన. అయితే ఈ మ్యాచ్​లో సూపర్బ్ నాక్ ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గెలుపు తర్వాత చేసిన పలు కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

ఐపీఎల్-2024లో ఆర్సీబీ తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్​ను ఓడించింది డుప్లెసిస్ సేన. అయితే ఈ మ్యాచ్​లో సూపర్బ్ నాక్ ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గెలుపు తర్వాత చేసిన పలు కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

  • Published Mar 26, 2024 | 9:09 AMUpdated Mar 26, 2024 | 9:09 AM
RCB గెలుపు తర్వాత కోహ్లీ షాకింగ్ కామెంట్స్.. తన పేరును వాడుకుంటున్నారంటూ..!

ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి విక్టరీ కొట్టింది. మొదటి మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్​లో బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్​తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. బౌలింగ్​లో ఫర్వాలేదనిపించిన బెంగళూరు.. బ్యాటింగ్​లో మాత్రం చేతులెత్తేసింది. అయితే సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (49 బంతుల్లో 77), దినేష్ కార్తీక్ (10 బంతుల్లో 28 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్​ను ఫినిష్ చేశారు. కోహ్లీ ఇన్నింగ్స్​ను బిల్డ్ చేసి ఆర్సీబీని గేమ్​లో నిలబట్టగా.. కార్తీక్ ఆఖర్లో వచ్చి తీవ్ర ఒత్తిడిలో ధనాధన్ ఇన్నింగ్స్​తో విజయాన్ని అందించాడు. హైటెన్షన్ మ్యాచ్​లో గెలవడంతో కోహ్లీ సంతోషంలో మునిగిపోయాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్​లో బెంగళూరు తొలి విజయం సాధించడంతో కోహ్లీ ఫుల్ హ్యాపీగా కనిపించాడు. కార్తీక్ ఫోర్లు, సిక్సులు కొడుతున్న టైమ్​లో డగౌట్​లో కూర్చున్న కింగ్ లేచి డాన్స్ చేశాడు. మ్యాచ్ ముగిశాక భార్య అనుష్క శర్మకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. తన సంతోషాన్ని ఫ్యామిలీతో పంచుకున్నాడు. అయితే ప్లేయర్ ఆఫ్ మ్యాచ్​ అవార్డును అందుకున్న సమయంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన పేరును వాడుకుంటున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు కింగ్. ‘వరల్డ్​వైడ్​గా టీ20 క్రికెట్​ను ప్రమోట్ చేసేందుకు నా పేరును వాడుకుంటున్నారు. నాకు తెలిసి ఇంకా ఆడే సత్తా నాలో ఉంది. నాలో ఆట మిగిలే ఉంది’ అని కోహ్లీ స్పష్టం చేశాడు.

My name is being used

టీ20 వరల్డ్ కప్​కు వెళ్లే భారత జట్టులో కోహ్లీకి చోటు లేదంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అతడ్ని టీమ్​లో నుంచి తప్పించే యోచనలో భారత క్రికెట్ బోర్డు ఉందని జోరుగా వినిపించింది. మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న కరీబియన్ పిచ్​లపై విరాట్​కు మంచి స్ట్రైక్ రేట్ లేదని.. అందుకే అతడ్ని తీసేయాలని బోర్డు అనుకుంటోందని రూమర్స్ వచ్చాయి. స్వయంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంపై విరాట్​తో డిస్కస్ చేయనున్నాడంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్​తో మ్యాచ్ తర్వాత కోహ్లీ ఇలా రియాక్ట్ అయ్యాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. టీ20 క్రికెట్​ను ప్రమోట్ చేసేందుకు తన పేరును వాడుతున్నారని, తనలో ఇంకా ఎంతో ఆట మిగిలి ఉందని, అలాంటప్పుడు ఈ రూమర్స్ ఏంటంటూ కోహ్లీ కౌంటర్ ఇచ్చాడని చెబుతున్నారు. మరి.. తన పేరును వాడుకుంటున్నారంటూ విరాట్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీ రేంజ్ కు మరో మచ్చుతునక! ఇది కదా రికార్డు అంటే!