iDreamPost

Virat Kohli: కోహ్లీ రేంజ్ కు మరో మచ్చుతునక! ఇది కదా రికార్డు అంటే!

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ రేంజ్ ఏంటో మరోసారి రుజువైంది. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఇదికదా రికార్డు అంటే.. అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. మరి ఇంతకీ ఆ ఘనత ఏంటి? తెలుసుకుందాం పదండి.

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ రేంజ్ ఏంటో మరోసారి రుజువైంది. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఇదికదా రికార్డు అంటే.. అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. మరి ఇంతకీ ఆ ఘనత ఏంటి? తెలుసుకుందాం పదండి.

Virat Kohli: కోహ్లీ రేంజ్ కు మరో మచ్చుతునక! ఇది కదా రికార్డు అంటే!

వేదిక ఏదైనా, ఫార్మాట్ వేరైనా విరాట్ కోహ్లీ రేంజే వేరు. ప్రపంచ క్రికెట్ లో మరే ఇతర ఆటగాళ్లకు లేని ఫాలోయింగ్ ఈ రన్ మెషిన్ సొంతం. బ్యాట్ తో టన్నుల కొద్ది పరుగులు చేయడమే కాదు.. కోట్ల మంది అభిమానులను సంపాదించుకోవడంలో కూడా ముందున్నాడు. విరాట్ కు ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఐపీఎల్ లో విరాట్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్సీబీ మ్యాచ్ జరిగితే చాలు గ్రౌండ్ మెుత్తం కోహ్లీ నామంతో దద్దరిల్లుతుంది. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ రేంజ్ ఏంటో మరోసారి రుజువైంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా పంజాబ్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ ఓ రేర్ ఫీట్ ను నమోదు చేశాడు. అసలేం జరిగిందంటే? ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు మహ్మద్ సిరాజ్. తొలి రెండు బంతులను వరుసగా బౌండరీలుగా తరలించాడు పంజాబ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో. ఆ తర్వాత బాల్ ను కూడా భారీ షాట్ కు ప్రత్నించాడు. కానీ బాల్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో.. బంతి గాల్లోకి లేచింది. కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకున్నాడు.

దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ కోహ్లీ నామంతో దద్దరిల్లిపోయింది. ఇక్కడే ఓ రికార్డు నమోదు అయ్యింది. ప్రేక్షకులు ఈ టైమ్ లో అరిచిన అరుపులు 124 డెసిబల్స్ గా నమోదు అయ్యింది. ఈ ఐపీఎల్ లో ఇదే రికార్డు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది సార్ కోహ్లీ రేంజ్ అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఈ రికార్డును దాటగలరా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ శిఖర్ ధావన్ 45 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇదికూడా చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్! మెరుపు బౌలర్ ఎంట్రీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి