Nidhan
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన హైటెన్షన్ ఫైట్‌లో డుప్లెసిస్ సేన 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది.
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన హైటెన్షన్ ఫైట్‌లో డుప్లెసిస్ సేన 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది.
Nidhan
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది డుప్లెసిస్ సేన. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 178 రన్స్ చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విక్టరీ కొట్టడానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్సీబీ ముందు మంచి టార్గెట్ ఉంచింది పంజాబ్. స్టార్ బ్యాటర్లతో నిండిన బెంగళూరు ఈ స్కోరు ఛేజ్ చేయడం పెద్ద కష్టం కాదని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. టాప్-6లో విరాట్ కోహ్లీని మినహాయిస్తే ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్క్‌ను దాటలేకపోయారు. కోహ్లీ (49 బంతుల్లో 77) ఫెంటాస్టిక్ నాక్‌తో టీమ్‌ను ఆదుకున్నాడు. కింగ్ గనుక పరుగులు చేయకపోతే ఆర్సీబీ అసలు మ్యాచ్‌లో ఉండేదే కాదు. అతడు పట్టుదలతో ఆడుతూ చిన్న చిన్న భాగస్వామ్యాలు నమోదు చేయడం వల్లే ఛేజింగ్‌లో నిలిచింది. అందుకే బెంగళూరు గెలుపులో అందరికంటే ఎక్కువ క్రెడిట్ కోహ్లీకే ఇవ్వాలి.
ఛేజింగ్‌లో అప్పటికి బెంగళూరు స్కోరు 130 పరుగులకు 6 వికెట్లు. గెలవాలంటే 22 బంతుల్లో 47 పరుగులు చేయాలి. క్రీజులో మహిపాల్ లోమ్రోర్ లాంటి పెద్దగా అంచనాలు లేని ప్లేయర్ ఉన్నాడు. ఆ టైమ్‌లో బరిలోకి దిగాడు దినేష్ కార్తీక్. తన అనుభవం మొత్తాన్ని రంగరించి అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో అదరగొట్టాడు. 10 బంతుల్లో 28 పరుగులు చేసి ఓడిపోయే మ్యాచ్‌లో ఆర్సీబీకి థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ బెంగళూరును నిలిపితే.. కార్తీక్ ఫినిష్ చేశాడు.
బెంగళూరు విజయం సాధించడానికి మరో కారణం బౌలర్లు. సీఎస్కేతో మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఆర్సీబీ బౌలర్లు.. పంజాబ్‌తో మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటారు. మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్వెల్ చెరో 2 వికెట్లు తీశారు. యష్ దయాల్ కూడా 1 వికెటే తీసినా పరుగులు కట్టడి చేశాడు. బౌలింగ్ యూనిట్ రాణించడం వల్లే పంజాబ్‌ను భారీ స్కోరు చేయకుండా బ్రేకులు వేయగలిగింది ఆర్సీబీ.
పంజాబ్‌తో మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో 3 పరుగులు చేసి ఫెయిలైన డుప్లెసిస్.. కెప్టెన్‌గా మాత్రం తన రోల్‌ను సరిగ్గా నిర్వర్తించాడు. అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను కరెక్ట్‌గా ఉపయోగించుకున్నాడు. బ్యాటర్ల వీక్నెస్, అలాగే సిచ్యువేషన్‌ను బట్టి బౌలింగ్ ఛేంజెస్ చేశాడు. బ్రేక్‌త్రూలు అందించే సత్తా ఉన్న మాక్స్‌వెల్‌ను అతడు వాడుకున్న తీరు కూడా బాగుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ కూడా కీలకపాత్ర పోషించింది. పిచ్ మీద తేమను గమనించిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ ఛేజింగ్ ఈజీ అవుతుందని భావించాడు. అందుకే టాస్ నెగ్గాక పంజాబ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అదే టైమ్‌లో బెంగళూరు బలం బ్యాటింగ్ కాబట్టి.. ఛేదన చేసేందుకు అతడు మొగ్గు చూపాడు. ఇది కూడా ఆ టీమ్‌కు కలసి వచ్చింది.
The winning celebration from Virat Kohli. 🤘 pic.twitter.com/wfpRE5zYqD
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024