iDreamPost

RCBని కాపాడిన రియల్ హీరో.. ఆ రోజు బ్యాట్​తో సిరాజ్ చేసిన మ్యాజిక్ పనికొచ్చింది!

  • Published May 20, 2024 | 5:07 PMUpdated May 20, 2024 | 5:07 PM

కథ ముగిసింది ఇంటికి వెళ్లడం ఖాయం అనుకున్న ఆర్సీబీ.. ఐపీఎల్-2024లో కొత్త కథ రాస్తోంది. వరుస ఓటముల నుంచి కోలుకొని బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో ప్లేఆఫ్స్​కు దూసుకొచ్చింది.

కథ ముగిసింది ఇంటికి వెళ్లడం ఖాయం అనుకున్న ఆర్సీబీ.. ఐపీఎల్-2024లో కొత్త కథ రాస్తోంది. వరుస ఓటముల నుంచి కోలుకొని బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో ప్లేఆఫ్స్​కు దూసుకొచ్చింది.

  • Published May 20, 2024 | 5:07 PMUpdated May 20, 2024 | 5:07 PM
RCBని కాపాడిన రియల్ హీరో.. ఆ రోజు బ్యాట్​తో సిరాజ్ చేసిన మ్యాజిక్ పనికొచ్చింది!

కథ ముగిసింది ఇంటికి వెళ్లడం ఖాయం అనుకున్న ఆర్సీబీ.. ఐపీఎల్-2024లో కొత్త కథ రాస్తోంది. వరుస ఓటముల నుంచి కోలుకొని బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో ప్లేఆఫ్స్​కు దూసుకొచ్చింది. దూకుడు మంత్రాన్ని నమ్ముకొని ఆశల్లేని స్థితి నుంచి ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరుకుంది. ఒక టైమ్​లో 1 పర్సెంట్ ఛాన్స్ ఉన్న జట్టు కాస్తా ఆ తర్వాత వరుస విజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాల్ని మెరుగుపర్చుకుంటూ వచ్చింది. మొన్న నాకౌట్ పోరులో చెన్నైని చిత్తు చేసి రాయల్​గా ప్లేఆఫ్స్​ గడప తొక్కింది. దీంతో బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, కెప్టెన్ డుప్లెసిస్, హిట్టర్ రజత్ పాటిదార్​, ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్, స్పిన్నర్ స్వప్నిల్ సింగ్, పేసర్ యష్ దయాల్​ను అందరూ మెచ్చుకుంటున్నారు.

కోహ్లీ, రజత్, డుప్లెసిస్, డీకే, గ్రీన్ తదితరులు ఆర్సీబీ విజయాల్లో మెయిన్ రోల్ పోషించారు. వీళ్ల కాంట్రిబ్యూషన్​ను ఎంత పొగిడినా తక్కువే. అయితే బెంగళూరును కాపాడిన రియల్ హీరో మహ్మద్ సిరాజ్ గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. సీజన్ మొదట్లో చెత్త బౌలింగ్​తో నిరాశపర్చిన సిరాజ్.. సెకండాఫ్​లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. టీమ్ సక్సెస్​లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అంత మాత్రాన అతడ్ని హీరో అనాల్సిన అవసరం ఏం ఉందనే డౌట్ మీకు రావొచ్చు. అయితే అతడు చేసిన ఓ పని వల్లే బెంగళూరు ప్లేఆఫ్స్​కు చేరుకుందని మీకు తెలుసా? అవును, లక్నో సూపర్ జియాంట్స్​తో మ్యాచ్​లో అతడు బ్యాట్​తో అద్భుతం చేశాడు. ఈ సీజన్ ఫస్టాఫ్​ ఆఖర్లో ఓ మ్యాచ్​లో లక్నోతో తలపడింది ఆర్సీబీ. అప్పటికే వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బెంగళూరు.. ఆ మ్యాచ్​లో 28 పరుగుల తేడాతో ఓడింది.

ఆ మ్యాచ్​లో చివర్లో బ్యాటింగ్​కు దిగిన సిరాజ్ 8 బంతుల్లో 2 భారీ సిక్సులతో 12 పరుగులు చేశాడు. ఆర్సీబీ గెలవలేదు గానీ భారీ తేడాతో ఓడకుండా.. ఆ టీమ్ నెట్ రన్​ రేట్​ పడిపోకుండా ఉండటంలో ఈ హైదరాబాదీ ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ పనికొచ్చింది. వరుసగా ఆరు మ్యాచుల్లో గెలిచినా గానీ అంతకుముందు ఓడిన మ్యాచుల్లో సిరాజ్​లాగే.. ఎస్​ఆర్​హెచ్​తో మ్యాచ్​లో దినేష్ కార్తీక్ (35 బంతుల్లో 83 పరుగులు), కేకేఆర్​తో మ్యాచ్​లో కర్ణ్ శర్మ (7 బంతుల్లో 20) ఇన్నింగ్స్​లు ఆర్సీబీ నెట్ రన్​ రేట్ పడిపోకుండా కాపాడాయి. డీకే స్పెషలిస్ట్ బ్యాటర్, కర్ణ్ బ్యాట్​ ఊపే సామర్థ్యం ఉన్నోడు కాబట్టి వాళ్లను సిరాజ్​తో పోల్చలేం. అతడు బ్యాట్​తో ఎప్పుడోసారి గానీ పరుగులు చేయడు. అలాంటోడు రెండు సిక్సులు బాది టీమ్​ను కాపాడాడు. ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరడంలో అతడి కాంట్రిబ్యూషన్​ను మెచ్చుకోకుండా ఉండలేం.

 

View this post on Instagram

 

A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి