Nidhan
ఐపీఎల్-2024లో ఆర్సీబీ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఓటమితో పాయింట్స్ టేబుల్లో దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది. అయితే ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
ఐపీఎల్-2024లో ఆర్సీబీ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఓటమితో పాయింట్స్ టేబుల్లో దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది. అయితే ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
Nidhan
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర నడుస్తోంది. వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది డుప్లెసిస్ సేన. ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ఓటముల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఒక్క పంజాబ్‌తో మ్యాచ్‌లో తప్పితే ఇప్పటిదాకా ఆడిన 6 మ్యాచుల్లో ఐదింట ఓటమిపాలైంది ఆర్సీబీ. దీంతో ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటినట్లేనని అంతా అనుకుంటున్నారు. అయితే ఆర్సీబీకి ఇంకా ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు వెళ్లడం అంత ఈజీ కాదు. అలాగని అసాధ్యమని అనలేం. బెంగళూరు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్లో ఇప్పటిదాకా ఆడిన ఆరు మ్యాచుల్లో ఒక్కదాంట్లోనే నెగ్గిన ఆర్సీబీ రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఆ టీమ్ 9వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓటమి తర్వాత బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలు మరింత క్లిష్టం అయ్యాయి. ఆ జట్టు చేతిలో ఇంకా 8 మ్యాచ్‌లు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌తో రెండేసి చొప్పున మ్యాచుల్ని ఆడనుంది డుప్లెసిస్ సేన. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఒక్కో గేమ్‌లో తలపడనుంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే కనీసం 6 మ్యాచుల్ని భారీ రన్‌రేట్ తేడాతో నెగ్గాలి. రన్‌రేట్ తక్కువగా ఉంటే మాత్రం 7 మ్యాచుల్లో విజయం అవసరం అవుతుంది. ఆ టీమ్ ఇన్ని విజయాలను అందుకున్నా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమని చెప్పలేం.
ఒకవేళ ఆర్సీబీ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో పైకి దూసుకొచ్చినా తీవ్ర పోటీ ఉంటుంది. కాబట్టి ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఇతర జట్ల గెలుపోటములు, సమీకరణాల మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ జట్టు ప్రస్తుతం ఆడుతున్న తీరు, బౌలర్ల ఫెయిల్యూర్‌ను బట్టి ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నెక్స్ట్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ లాంటి పటిష్టమైన జట్లతో పోటీపడాల్సి రావడం ఆ టీమ్‌కు బిగ్ ఛాలెంజ్ కానుంది. ఒకవేళ ఈ మూడు మ్యాచుల్లో రెండింట ఓడినా ఆర్సీబీ కథ సమాప్తమనే చెప్పాలి. ఇన్ని సవాళ్ల మధ్య తదుపరి డుప్లెసిస్ సేన ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరి.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.