iDreamPost
android-app
ios-app

IPLలో కొత్త అనుమానం! ధోనికి కావాల్సిన దగ్గరే బాల్స్ ఎందుకు వేస్తున్నారు?

  • Published Apr 20, 2024 | 7:36 PM Updated Updated Apr 20, 2024 | 7:36 PM

ఐపీఎల్-2024లో ఎంఎస్ ధోని తన విశ్వరూపం చూపిస్తున్నాడు. లాస్ట్​లో బ్యాటింగ్​కు వస్తూ విధ్వంసక ఇన్నింగ్స్​లతో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్నాడు. దీంతో అందరికీ కొత్త అనుమానం వస్తోంది.

ఐపీఎల్-2024లో ఎంఎస్ ధోని తన విశ్వరూపం చూపిస్తున్నాడు. లాస్ట్​లో బ్యాటింగ్​కు వస్తూ విధ్వంసక ఇన్నింగ్స్​లతో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్నాడు. దీంతో అందరికీ కొత్త అనుమానం వస్తోంది.

  • Published Apr 20, 2024 | 7:36 PMUpdated Apr 20, 2024 | 7:36 PM
IPLలో కొత్త అనుమానం! ధోనికి కావాల్సిన దగ్గరే బాల్స్ ఎందుకు వేస్తున్నారు?

ఐపీఎల్-2024లో మహేంద్ర సింగ్ ధోని తన విశ్వరూపం చూపిస్తున్నాడు. లాస్ట్​లో బ్యాటింగ్​కు వస్తూ విధ్వంసక ఇన్నింగ్స్​లతో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో అతడి పాత్ర కీలకంగా మారింది. టీమ్​కు భారీ స్కోర్లు అందించడంలోనూ, బిగ్ టార్గెట్స్​ను ఛేజ్ చేయడంలోనూ మాహీ తనదైన రోల్ పోషిస్తున్నాడు. ఈ సీజన్​లో ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచుల్లో కలిపి 87 పరుగులు చేశాడు. అతడి స్ట్రయిక్ రేట్ 255.8గా ఉంది. 87 పరుగులు చేయడానికి అతడు ఎదుర్కొంది 34 బంతులే కావడం గమనార్హం. ఇందులో 57 పరుగులు ఫైనల్ ఓవర్స్​లోనే చేయడం విశేషం. ఆఖరి ఓవర్​లో 16 బంతుల్లో 57 పరుగులు చేశాడు. దీంట్లో 4 బౌండరీలతో పాటు 6 సిక్సులు ఉన్నాయి. అయితే ధోని ధనాధన్ బ్యాటింగ్​ చూస్తున్న కొందరికి ఓ అనుమానం వస్తోంది.

సీఎస్​కే మ్యాచ్​లు చూసిన వారికి ఇప్పుడు కొత్త డౌట్ వస్తోంది. ధోనికి కావాల్సిన దగ్గరే బౌలింగ్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడాది కాలంగా క్రికెట్​కు దూరంగా ఉన్న బ్యాటర్ రెగ్యులర్​గా ఆడుతున్న వాళ్ల కంటే కూడా బాగా బ్యాటింగ్ చేయడం, బాల్ కొడితే స్టాండ్స్​లోనే పడుతుండటం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. మాహీ మెరుపు బ్యాటింగ్​కు అతడి బలం, ఫిట్​నెస్, బాల్​పై సడలని ఫోకస్, బ్యాటింగ్ టెక్నిక్ ఓ కారణం. మెయిన్ రీజన్ అపోజిషన్ టీమ్ బౌలర్లు ఒత్తిడిలో పడటమేనని చెప్పొచ్చు. ఈ సీజన్​లో మాహీ ఆఖర్లో బ్యాటింగ్​కు వస్తున్నాడు. ఇంకో రెండు లేదా మూడు ఓవర్లు ఉన్న సమయంలోనే అతడు గ్రౌండ్​లోకి అడుగు పెడుతున్నాడు. ఆ టైమ్​లో ఆడియెన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

ధోని కోసమే భారీగా స్టేడియాలకు తరలివస్తున్న ప్రేక్షకులు ‘మాహీ.. మాహీ’ అంటూ గట్టిగా అరుస్తూ కేకలు వేస్తున్నారు. వాళ్ల శబ్దానికి స్టేడియాలు దద్దరిల్లుతున్నాయి. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ముందుగా అనుకున్న లెంగ్త్​లో కాక అడ్డగోలుగా బంతుల్ని విసురుతున్నారు. ప్రెజర్​లో పడి ఫుల్ లెంగ్త్​ డెలివరీస్​ వేస్తున్నారు. ఇలాంటి బంతుల్ని కొట్టడంలో ఆరితేరిన మహేంద్రుడు వాటిని రెప్పపాటులో సిక్సులుగా మలుస్తున్నాడు. ధోనికి ఉన్న క్రేజ్, అతడి అభిమానులు చేసే సందడి బ్యాటింగ్ టైమ్​లో బాగా ఉపయోగపడుతోంది. అపోజిషన్ బౌలర్లను ప్రెజర్​లోకి నెట్టడానికి ఇది హెల్ప్ అవుతోంది. దీని వల్ల సీఎస్​కే లాభపడుతోంది. సేమ్ టైమ్ ధోని ఫ్యాన్స్ కూడా అతడి షాట్లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.