iDreamPost

వీడియో: జూనియర్లు కూడా పాండ్యాను కెప్టెన్‌గా చూడట్లేదా? మరి ఇదేంటి?

  • Published Apr 20, 2024 | 2:42 PMUpdated Apr 20, 2024 | 2:42 PM

Akash Madhwal, Hardik Pandya, Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ ప్లేస్‌లో పాండ్యా అవ్వడం చాలా మందికి నచ్చలేదు. అందులో కొంతమంది ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే తమ అయిష్టాన్ని వాళ్లు ఇలా గ్రౌండ్‌లోనే చూపిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Akash Madhwal, Hardik Pandya, Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ ప్లేస్‌లో పాండ్యా అవ్వడం చాలా మందికి నచ్చలేదు. అందులో కొంతమంది ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే తమ అయిష్టాన్ని వాళ్లు ఇలా గ్రౌండ్‌లోనే చూపిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 20, 2024 | 2:42 PMUpdated Apr 20, 2024 | 2:42 PM
వీడియో: జూనియర్లు కూడా పాండ్యాను కెప్టెన్‌గా చూడట్లేదా? మరి ఇదేంటి?

ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో రెండు గ్రూపులు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తున్న విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ప్రస్తుత కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా ఇద్దరూ చెరో గ్రూప్‌ మెయిటెన్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇవన్నీ ఆఫ్‌ ది ఫీల్డ్‌ కనిపించాలి కానీ, ఆన్ ది ఫీల్డ్‌లోనే కనిపిస్తున్నాయి. ఏకంగా గ్రౌండ్‌లోనే ముంబై ఇండియన్స్‌ జట్టు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. రోహిత్‌ గ్రూప్‌ సభ్యులు పాండ్యా మాట వినకపోవడం, పాండ్యా గ్రూప్‌ సభ్యులు రోహిత్‌ శర్మ మాటను పట్టించుకోకపోవడం జరుగుతుంది. దీనికి పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చివరి ఓవర్‌లో విజయం సాధించింది. ఎంతో కీలకమైన ఆ ఓవర్‌లోను ఆకాశ్‌ మధ్వల్‌ అనే కుర్ర బౌలర్‌ వేశాడు. అయితే.. మ్యాచ్‌ విజయాన్ని డిసైడ్‌ చేసే ఓవర్‌ కావడంతో అతను కాస్త ఒత్తిడికి గురయ్యాడు. ఫీల్డింగ్‌ సెట్‌ చేసే సమయంలో కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా సాయం కాకుండా.. రోహిత్‌ శర్మ సాయాన్ని కోరాడు. అక్కడి పాండ్యా కూడా వచ్చినా.. పాండ్యా చెబుతున్న ఫీల్డ్‌ సెట్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. కేవలం రోహిత్‌ శర్మ చెప్పేది మాత్రమే విన్నాడు. అక్కడ కావాలనే పాండ్యాను అవైడ్‌ చేసినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌లో మధ్వల్‌ ఇక యువ క్రికెటర్‌, అయినా కూడా ఆ జట్టు కెప్టెన్‌ పాండ్యానే లెక్కచేయడం లేదు.

అందుకు కారణం కెప్టెన్‌గా పాండ్యా వైఫల్యం కూడా ఒకటని తెలుస్తోంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఏడు మ్యాచ్‌లు ఆడితే నాలుగింటిలో ఓడి మూడు విజయాలు సాధించింది. వరుసగా తొలి మూడు మ్యాచ్‌లో ఓడిపోయి.. హ్యాట్రిక్‌ ఓటములను చవిచూసింది. ఆ తర్వాత రెండు వరుస విజయాలు, మళ్లీ చెన్నైపై ఓటమి.. తిరిగి పంజాబ్‌పై విజయం సాధించింది. ఈ క్రమంలోనే కెప్టెన్‌గా పాండ్యా తీసుకుంటున్న నిర్ణయాలు దెబ్బకొడుతుండటంతో.. టీమ్‌లోని యువ క్రికెటర్లు సైతం పాండ్యాను కాదని, రోహిత్‌ శర్మతో సంప్రదింపులు జరుపుతూ.. అతని సలహాలు, సుచనలే పాటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆకాశ్‌ మధ్వల్‌ కూడా అలాగే రోహిత్‌ శర్మతో మాట్లాడుతూ.. పాండ్యాను కనీసం పట్టించుకోకుండా అతని పరువు తీశాడని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి