iDreamPost
android-app
ios-app

రోహిత్​పై పగ తీర్చుకున్న చాహల్.. IPLతో సంబంధం లేని రైవల్రీ ఇది!

  • Published Apr 02, 2024 | 3:21 PM Updated Updated Apr 02, 2024 | 3:21 PM

సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన పగ తీర్చుకున్నాడు. రోహిత్​ శర్మ మీద ఇన్నాళ్లకు రివేంజ్ తీర్చుకున్నాడు. అయితే వీళ్లది ఐపీఎల్​తో సంబంధం లేని రైవల్రీ.

సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన పగ తీర్చుకున్నాడు. రోహిత్​ శర్మ మీద ఇన్నాళ్లకు రివేంజ్ తీర్చుకున్నాడు. అయితే వీళ్లది ఐపీఎల్​తో సంబంధం లేని రైవల్రీ.

  • Published Apr 02, 2024 | 3:21 PMUpdated Apr 02, 2024 | 3:21 PM
రోహిత్​పై పగ తీర్చుకున్న చాహల్.. IPLతో సంబంధం లేని రైవల్రీ ఇది!

ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ చెత్తాట కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి పాయింట్స్ టేబుల్​లో లాస్ట్ ప్లేస్​లో నిలిచింది ఎంఐ. సీఎస్​కే, ఎస్​ఆర్​హెచ్​ చేతుల్లో పోరాడి ఓడిన హార్దిక్ సేన.. సొంత మైదానం వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. కనీసం ఫైట్ చేయకుండానే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. ఈ టార్గెట్​ను సంజూ సేన 15.3 ఓవర్లలోనే ఉఫ్​మని ఊదిపారేసింది. ఈ మ్యాచ్​లో ఓటమికి బ్యాటింగ్ ఫెయిల్యూర్​ మెయిన్ రీజన్ అని చెప్పాలి. ఇక, ఈ మ్యాచ్​తో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పగ తీర్చుకున్నాడు. అయితే వీళ్లది ఐపీఎల్​తో సంబంధం లేని రైవల్రీ.

ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో చాహల్ 4 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పరుగులు కట్టడి చేస్తూనే వికెట్లు కూడా తీశాడు. పర్ఫెక్ట్​ లెంగ్త్​లో బాల్స్ వేస్తూ, చక్కటి టర్న్​తో  బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. షాట్లకు వెళ్తే ఔట్ అవుతుండటంతో అతడి బౌలింగ్​లో వికెట్ కాపాడుకునేందుకు బ్యాటర్లు ప్రయత్నించారు. దీన్ని బట్టే చాహల్ స్పిన్ మ్యాజిక్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ వికెట్ తీసే ఛాన్స్ అతడికి దక్కలేదు. కానీ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మతో పాటు గెరాల్డ్‌ కొయెట్జీని పెవిలియన్​కు పంపాడు చాహల్. ఇక, మంచి ఫామ్​లో ఉన్న చాహల్​ను వన్డే వరల్డ్ కప్​లో ఆడించలేదు. టీ20 కప్ వరల్డ్ కప్ సెలక్షన్​ రాడార్​లో అతడి పేరు లేదని తెలుస్తోంది. టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో స్పిన్ మ్యాజిక్​తో విజయాలు అందించినోడి కెరీర్ ఇలా అయిపోవడంలో రోహిత్ పాత్ర ఉందనే విమర్శలు ఉన్నాయి.

Chahal

హిట్​మ్యాన్ ఒక్క మాట చెబితే చాహల్ టీమ్​లోకి వస్తాడు. కానీ అతడి కంటే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వైపే రోహిత్ మొగ్గుచూపుతున్నాడు. వన్డే ప్రపంచ కప్​కు ముందు అక్షర్​కు గాయమైన టైమ్​లోనూ చాహల్​కు బదులుగా రవిచంద్రన్ అశ్విన్​ను ఎంచుకున్నాడు హిట్​మ్యాన్. దీంతో టీమ్​లోకి రీఎంట్రీ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. వరల్డ్ కప్ కాదు కదా నార్మల్ సిరీస్​ల్లో కూడా ఛాన్సులు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్​లో రోహిత్ టీమ్ అయిన ముంబైని ఓడించడం ద్వారా తన పగ తీర్చుకున్నాడు చాహల్. హిట్​మ్యాన్ చూస్తుండగానే హార్దిక్, తిలక్​ను ఔట్ చేసి ముంబై వెన్ను విరిచాడు. తనలో పస తగ్గలేదని ప్రూవ్ చేశాడు. మరి.. చాహల్-రోహిత్ రివేంజ్ స్టోరీపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: రోహిత్​ను భయపెట్టాడు.. ఫీల్డింగ్ చేస్తున్న హిట్​మ్యాన్ దగ్గరకు వచ్చి..!