iDreamPost

వీడియో: రోహిత్​ను భయపెట్టాడు.. ఫీల్డింగ్ చేస్తున్న హిట్​మ్యాన్ దగ్గరకు వచ్చి..!

  • Published Apr 02, 2024 | 8:01 AMUpdated Apr 02, 2024 | 8:15 AM

రాజస్థాన్​తో మ్యాచ్​లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కసారిగా భయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న టైమ్​లో ఈ ఘటన జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

రాజస్థాన్​తో మ్యాచ్​లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కసారిగా భయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న టైమ్​లో ఈ ఘటన జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Apr 02, 2024 | 8:01 AMUpdated Apr 02, 2024 | 8:15 AM
వీడియో: రోహిత్​ను భయపెట్టాడు.. ఫీల్డింగ్ చేస్తున్న హిట్​మ్యాన్ దగ్గరకు వచ్చి..!

మన దేశంలో క్రికెటర్లకు ఏ రేంజ్​లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనేది స్పెషల్​గా చెప్పాల్సిన పని లేదు. ప్లేయర్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అభిమానులు కోరుకోవడం సహజమే. వారితో సెల్ఫీ, ఆటోగ్రాఫ్​ల కోసం ఎగబడటం కూడా కామనే. అయితే ఆ ఛాన్స్ అంత ఈజీగా రాదు. ఏ కొందరికో మాత్రం లక్కీ ఛాన్స్ వస్తుంది. దీంతో మరికొందరు ఫ్యాన్స్ ఎలాగైనా తమ ఫేవరెట్ ప్లేయర్స్​ను కలవాలనే అత్యుత్సాహంలో ఒక్కోసారి వింత చేష్టలకు పాల్పడుతుంటారు. మ్యాచ్​ జరుగుతున్న టైమ్​లో గ్రౌండ్​లోకి వచ్చి ఆటగాళ్లను కలవడం, వాళ్ల కాళ్లకు నమస్కారాలు పెట్టడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి చేష్టల వల్ల ఒక్కోసారి ఆటగాళ్లు భయాందోళనలకు లోనవుతారు. తాజాగా ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ఒక అభిమాని ఇలాగే భయపెట్టాడు.

క్రికెట్​లో ప్రస్తుత తరంలో హ్యూజ్ ఫ్యాన్​బేస్ కలిగిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. బ్యాటర్​గా, టీమిండియా కెప్టెన్​గా అతడు రాణిస్తున్న తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. ముంబైకి కెప్టెన్​గా ఉంటూ 5 ట్రోఫీలు అందించాడు రోహిత్. దీంతో ఎంఐ అంటే రోహిత్, రోహిత్ అంటే ఎంఐ అనేది స్థిరపడిపోయింది. అందుకే హిట్​మ్యాన్​తో​ సెల్ఫీలు దిగేందుకు, అతడి ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎంఐ ఫ్యాన్స్ ఎగబడతారు. అయితే అతడ్ని నేరుగా కలిసే ఛాన్స్ రాదని అనుకున్నాడో ఏమో.. ఓ అభిమాని డైరెక్ట్​గా గ్రౌండ్​లోకి అడుగుపెట్టాడు. రాజస్థాన్-ముంబై మధ్య మ్యాచ్ టైమ్​లో వాంఖడే మైదానంలోకి దూసుకొచ్చాడో అభిమాని. ఆ సమయంలో గ్రౌండ్​లో ఫీల్డింగ్ చేస్తున్నాడు రోహిత్​. వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన అభిమానిని చూసి హిట్​మ్యాన్ షాకయ్యాడు.

సడన్​గా తన వెనుక వైపు ఎవరో దూసుకొచ్చినట్లు అనిపించడంతో రోహిత్ భయపడ్డాడు. వెంటనే రెండు అడుగులు వెనక్కి వేశాడు. అయితే అతడు తన అభిమాని అని తెలిశాక కౌగిలించుకున్నాడు హిట్​మ్యాన్. పక్కనే కీపింగ్ చేస్తున్న ఇషాన్​ కిషన్ కూడా ఆ ఫ్యాన్​కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అలాగే అతడ్ని హగ్ చేసుకున్నాడు. అయితే ఫ్యాన్ గ్రౌండ్​లోకి దూసుకొచ్చిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన భద్రతా సిబ్బంది తేరుకొని అతడ్ని బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. అభిమానం మంచిదే, కానీ ఇలా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్​ను ఫ్యాన్ భయపెట్టిన ఈ ఘటన మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ముంబయి జట్టులో వర్గపోరు? కావాలనే వాళ్లంతా బాగా ఆడట్లేదా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి