iDreamPost
android-app
ios-app

Virat Kohli: సోషల్ మీడియాకు భయపడుతున్న కోహ్లీ! అసలు కింగ్​కు ఏమైంది?

  • Published Apr 11, 2024 | 9:37 PM Updated Updated Apr 11, 2024 | 9:37 PM

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్​లో అదరగొడుతున్నాడు. మంచి ఫామ్​లో ఉన్న విరాట్ వరుసగా సూపర్బ్ నాక్స్​తో అందర్నీ ఫుల్ ఎంటర్​టైన్ చేస్తున్నాడు.

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్​లో అదరగొడుతున్నాడు. మంచి ఫామ్​లో ఉన్న విరాట్ వరుసగా సూపర్బ్ నాక్స్​తో అందర్నీ ఫుల్ ఎంటర్​టైన్ చేస్తున్నాడు.

  • Published Apr 11, 2024 | 9:37 PMUpdated Apr 11, 2024 | 9:37 PM
Virat Kohli: సోషల్ మీడియాకు భయపడుతున్న కోహ్లీ! అసలు కింగ్​కు ఏమైంది?

ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిపోయింది. ఈసారైనా కప్ గెలుస్తుందని అనుకుంటే సీజన్ ఆరంభంలోనే ఇలా వరుస పరాజయాలను మూటగట్టుకోవడంతో ఆ టీమ్ అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. అయితే వాళ్లకు ఏదైనా ఊరటను ఇస్తున్న విషయం ఉందంటే అది విరాట్ కోహ్లీ ఫామే. ఈ ఆర్సీబీ ఓపెనర్ ఈసారి పరుగుల వరద పారిస్తున్నాడు. 319 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్​గా ఉన్నాడు కింగ్. ఈ సీజన్​లో ఓ సెంచరీ కూడా బాదిన విరాట్.. టోర్నీ ముగిసేసరికి ఇంకెన్ని పరుగులు చేస్తాడో చూడాలి. అయితే అతడు సోషల్ మీడియాకు భయపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కోహ్లీ స్ట్రయిక్ రేట్ విషయంలో ఈ మధ్య కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి. ఐపీఎల్-2024లో లీడింగ్ రన్ స్కోరర్​గా ఉన్న విరాట్ స్ట్రయిక్ రేట్ 146గా ఉంది. దీంతో అతడు స్లోగా ఆడుతున్నాడంటూ నెట్టింట భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. ఇదే ఆటతీరును త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్​లో కంటిన్యూ చేస్తే టీమిండియాకు నష్టమేనని.. ఫార్మాట్​కు తగ్గట్లు అతడు దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆ నోటా ఈ నోటా పడి ఆఖరికి కోహ్లీ చెవికి చేరినట్లుంది. స్ట్రయిక్ రేట్ అంశాన్ని సీరియస్​గా తీసుకున్న ఆర్సీబీ బ్యాటర్.. ముంబైతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్​లో ప్రతి బంతిని బాదేద్దామనే తీరుతో బ్యాటింగ్ చేశాడు. బాల్ మెరిట్​ను బట్టి షాట్లు కొట్టే అతడు.. ఇవాళ తన బ్యాటింగ్ శైలికి పూర్తిగా విరుద్ధంగా ఆడాడు.

ముంబైతో మ్యాచ్​లో 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 3 పరుగులు మాత్రమే చేశాడు. ఎంఐ పేసర్లు గెరాల్డ్ కొయెట్జీ, జస్​ప్రీత్ బుమ్రాను ఎదుర్కొనేందుకు అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. బాల్​ను అంచనా వేసి టైమింగ్​తో షాట్స్ బాదే కింగ్.. ఇవాళ క్రీజులో అన్​కంఫర్టబుల్​గా కనిపించాడు. ఎక్స్​ట్రా బ్యాగేజ్ మోస్తున్నట్లు కనిపించాడు. బౌండరీలు, సిక్సులతో భారీ స్కోరు చేయాలని, స్ట్రయిక్ రేట్ అమాంతం పెంచాలనే ఆలోచనతో అతడు ఆడుతున్నట్లు అనిపించింది. కానీ ఒక్క షాట్ కూడా కనెక్ట్ కాకపోవడంతో అడ్డగోలుగా బ్యాట్​ను ఊపేశాడు కోహ్లీ. ఇదే క్రమంలో బుమ్రా బౌలింగ్​లో ఔట్ అయ్యాడు విరాట్. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు భయపడే విరాట్ ఇలా ఆడాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది అతడి న్యాచురల్ గేమ్ కాదని అంటున్నారు. విరాట్ తనదైన శైలిలో యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడుతూనే కాస్త వేగంగా పరుగులు చేస్తే చాలని చెబుతున్నారు.