Nidhan
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై-గుజరాత్ మ్యాచ్‌లో ఫ్యాన్స్ మధ్య ఫైట్ జరిగింది. రోహిత్ శర్మ- హార్దిక్ పాండ్యా అభిమానులు స్టేడియంలోనే పొట్టుపొట్టు కొట్టుకున్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై-గుజరాత్ మ్యాచ్‌లో ఫ్యాన్స్ మధ్య ఫైట్ జరిగింది. రోహిత్ శర్మ- హార్దిక్ పాండ్యా అభిమానులు స్టేడియంలోనే పొట్టుపొట్టు కొట్టుకున్నారు.
Nidhan
ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ హైటెన్షన్ మ్యాచ్‌లో గుజరాత్ 6 పరుగుల థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 168 రన్స్ చేసింది. ఛేజింగ్‌కు దిగిన ఎంఐ 162 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలుపోటముల కంటే కూడా మిగిలిన విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ చేయడం, రోహిత్ శర్మ అభిమానులు అతడ్ని ‘కుక్క.. కుక్క’ అంటూ గేలి చేయడం హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇదే మ్యాచ్‌లో స్టేడియంలో ఫ్యాన్స్ పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హార్దిక్ పాండ్యా-రోహిత్ శర్మ అభిమానుల మధ్య అహ్మదాబాద్ స్టేడియంలో ఫైట్ జరిగింది. ఇద్దరి ఫ్యాన్స్ పొట్టుపొట్టు కొట్టుకుంటున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుతూ, కుర్చీల మీద దొర్లుతూ మరీ ఫైట్ చేశారు. పాండ్యా ఫ్యాన్స్‌ను రోహిత్ ఫ్యాన్స్ చితకబాదారు. దీంతో అసలు వాళ్లు ఎందుకు గొడవపడ్డారు? ఒకే జట్టు అభిమానులు ఇలా ఫైట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనేది తెలుసుకునేందుకు ఆడియెన్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సీజన్ మొదలవడానికి ముందే రోహిత్-పాండ్యా ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయింది. జట్టుకు 5 కప్పులు అందించిన హిట్‌మ్యాన్‌ను ముంబై కెప్టెన్సీ నుంచి పీకేయడం అప్పట్లో సంచలనంగా మారింది. గుజరాత్‌కు సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి టీమ్ కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించించారు.
టీమ్‌కు కప్పులు అందించినోడు, భారత జట్టును కూడా అద్భుతంగా నడిపిస్తూ సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తీసేయడం అతడి అభిమానులకు నచ్చలేదు. అందునా ముంబైని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిన హార్దిక్‌ను తిరిగి తీసుకురావడంతో వాళ్లు సీరియస్ అయ్యారు. దీనికి తోడు గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ ఉండమని పాండ్యా ఆదేశించాడు. హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ పట్టరాని కోపంతో ఊగిపోయారు. ఈ మ్యాచ్ మొత్తం హార్దిక్‌ను ర్యాగింగ్ చేశారు. కుక్క.. కుక్క అంటూ పాండ్యాను ఓ ఆటాడుకున్నారు. దీంతో స్టేడియంలోని హార్దిక్ ఫ్యాన్స్.. రోహిత్ అభిమానులను టార్గెట్ చేశారని సమాచారం. ఒకర్నొకరు పొట్టుపొట్టుగా కొట్టుకోవడానికి ఇదే కారణమని వినికిడి. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అయ్యిందేదో అయిపోయింది, ఇలాంటి గొడవలు మాని, క్రికెట్‌ను ఎంజాయ్ చేయాలని అంటున్నారు. మరి.. రోహిత్-పాండ్యా ఫ్యాన్స్ ఫైట్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.