Nidhan
లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్‌ను చూసి ఆస్ట్రేలియా టీమ్ భయపడుతోంది. అతడి పేస్, బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్న తీరుకు ఆసీస్ వణుకుతోంది.
లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్‌ను చూసి ఆస్ట్రేలియా టీమ్ భయపడుతోంది. అతడి పేస్, బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్న తీరుకు ఆసీస్ వణుకుతోంది.
Nidhan
ఈసారి ఐపీఎల్లో లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ హాట్ టాపిక్‌గా మారాడు. సంచలన ప్రదర్శనలతో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నాడీ యంగ్ పేసర్. 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో అతడు విసురుతున్న బంతులు చూసి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఇతనెక్కడి బౌలర్? ఇదేం స్పీడ్ అంటూ షాకవుతున్నారు. ఒక బంతో, ఒక ఓవరో కాదు.. స్పెల్ మొత్తం నిలకడగా ఒకే స్పీడ్‌తో బౌలింగ్ వేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. బ్రెట్ లీ దగ్గర నుంచి డేల్ స్టెయిన్ వరకు వరల్డ్ టాప్ స్పీడ్‌స్టర్స్ అంతా మయాంక్‌ను మెచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లకు భారత్ నుంచి ఎక్స్‌ప్రెస్ పేసర్ వచ్చాడని అంటున్నారు. అయితే అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న మయాంక్‌ను చూసి ఆస్ట్రేలియా టీమ్ భయపడుతోంది.
మయాంక్ యాదవ్‌ను చూసి కంగారూ టీమ్ వణుకుతోంది. అతడి పదునైన పేస్ బౌలింగ్, బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్న తీరుకు ఆసీస్ షేక్ అవుతోంది. ఈ మెరుపు బౌలర్ ఎక్కడ వచ్చి తమ మీద పడతాడోనని భయపడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆర్సీబీ-లక్నో మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మయాంక్ 3 వికెట్లు తీశాడు. ఇందులో రెండు వికెట్లు ఆసీస్ బ్యాటర్లవే కావడం గమనార్హం. స్టార్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్‌ను భయపెట్టి ఔట్ చేశాడు మయాంక్. ఏ బౌలర్‌ను లెక్క చేయని మాక్సీని బౌన్సర్లతో వణికించి ఔట్ చేశాడు. బుల్లెట్ స్పీడ్‌తో మయాంక్ వేసిన బాల్‌కు మాక్స్‌వెల్‌కు మైండ్ బ్లాంక్ అయింది. అతడి బౌన్సర్‌ను ఎదుర్కోలేక పెవిలియన్‌కు చేరుకున్నాడు.
కామెరాన్ గ్రీన్‌ను మయాంక్ ఔట్ చేసిన తీరు సూపర్బ్ అనే చెప్పాలి. బౌన్సర్‌తో అతడ్ని మొదట భయపెట్టాడు లక్నో ఎక్స్‌ప్రెస్. ఆ తర్వాత మళ్లీ బౌన్సరే వస్తుందని గ్రీన్ అనుకున్నాడు. కానీ కాస్త ముందు పడిన బాల్ గ్రీన్ బ్యాట్ ఊపే లోపే మెరుపు వేగంతో వచ్చి వికెట్లను గిరాటేసింది. ఈ వికెట్ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. కాకలు తీరిన మాక్సీతో పాటు టాప్ ఫామ్‌లో ఉన్న గ్రీన్‌ను క్రీజులో నిలబడటానికి కూడా భయపడేలా చేశాడు మయాంక్. దీంతో ఆస్ట్రేలియా టీమ్ వణుకుతోంది. ఈ ఫాస్ట్ బౌలర్ ఎక్కడ వచ్చి తమ మీద పడతాడోనని టెన్షన్ పడుతోంది. టీ20 వరల్డ్ కప్‌లో తమను ముంచేస్తాడేమోనని అనుకుంటోంది. పొట్టి ప్రపంచ కప్‌కు వెళ్లే భారత జట్టులో మయాంక్‌కు ప్లేస్ పక్కా అని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దీంతో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఈ డేంజరస్ బౌలర్ నుంచి తమకు ముప్పు తప్పదని భయపడుతోంది. మరి.. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకుండానే ఆసీస్‌ను మయాంక్ వణికిస్తుండటం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: RCBని కడిగి పారేసిన రాయుడు.. 16 ఏళ్ల నుంచి అదే తప్పు చేస్తున్నారంటూ..!
𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥
Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim
— IndianPremierLeague (@IPL) April 2, 2024