iDreamPost

RCBని కడిగి పారేసిన రాయుడు.. 16 ఏళ్ల నుంచి అదే తప్పు చేస్తున్నారంటూ..!

  • Published Apr 03, 2024 | 9:48 AMUpdated Apr 03, 2024 | 3:27 PM

ప్రతిసారి ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగడం.. వరుస ఓటములతో నిరాశపర్చడం ఆర్సీబీకి ఆనవాయితీగా మారింది. ఈ సీజన్​లో కూడా బెంగళూరు జర్నీ సాఫీగా సాగడం లేదు.

ప్రతిసారి ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగడం.. వరుస ఓటములతో నిరాశపర్చడం ఆర్సీబీకి ఆనవాయితీగా మారింది. ఈ సీజన్​లో కూడా బెంగళూరు జర్నీ సాఫీగా సాగడం లేదు.

  • Published Apr 03, 2024 | 9:48 AMUpdated Apr 03, 2024 | 3:27 PM
RCBని కడిగి పారేసిన రాయుడు.. 16 ఏళ్ల నుంచి అదే తప్పు చేస్తున్నారంటూ..!

ఐపీఎల్​లో హ్యూజ్ ఫ్యాన్​బేస్ ఉన్న టీమ్స్​లో అదొకటి. ఆ జట్టు అభిమానులు చాలా లాయల్​గా ఉంటారు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ట్రోఫీ గెలుచుకోకపోయినా ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే వాళ్ల ఎక్స్​పెక్టేషన్స్​ను అందుకోవడంలో మాత్రం టీమ్ ఫెయిల్ అవుతూనే ఉంది. ఈసారి ఐపీఎల్​లో కూడా వరుస ఓటములతో డీలా పడింది. మనం మాట్లాడుకుంటోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి అనేది ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. ప్రతిసారి ఫేవరెట్స్​లో ఒకటిగా సీజన్​ను స్టార్ట్ చేసే ఆర్సీబీ.. ఫస్టాఫ్ అయ్యేసరికే చతికిలపడటం చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్​లోనూ ఆడిన 4 మ్యాచుల్లో మూడింట ఓడి అందర్నీ తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో బెంగళూరుపై టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు సీరియస్ అయ్యాడు.

ఆర్సీబీని రాయుడు కడిగి పారేశాడు. 16 ఏళ్లుగా ఐపీఎల్​లో ఒకే తప్పును రిపీట్ చేస్తున్నారని అన్నాడు. దాని వల్లే ఒక్కసారి కూడా కప్పు గెలవలేకపోయారని చెప్పాడు. ‘బెంగళూరు బౌలర్లు భారీగా రన్స్ సమర్పించుకుంటున్నారు. ఈ టీమ్ బ్యాటర్లు అంచనాలకు తగ్గట్లుగా పెర్ఫార్మ్ చేయడం లేదు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు యంగ్ ఇండియన్ బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు. వాళ్లకు తోడుగా సీనియర్ దినేష్ కార్తీక్ రన్స్ చేస్తున్నాడు. కానీ ఎంతో పేరు కలిగిన స్టార్ ఫారెన్ బ్యాటర్స్ మాత్రం పెర్ఫార్మ్ చేయడం లేదు. ప్రెజర్ సిచ్యువేషన్​లో వాళ్లే ఆడాలి. కానీ అలా జరగడం లేదు. వాళ్లంతా డ్రెస్సింగ్​ రూమ్​కు పరిమితం అవుతున్నారు. 16 ఏళ్ల నుంచి ఈ టీమ్​ది ఇదే కథ. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆర్సీబీలోని బడా బ్యాటర్ ఒక్కరు కూడా నిలబడి టీమ్​ను ఆదుకోరు’ అని రాయుడు స్పష్టం చేశాడు.

బెంగళూరు జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు యంగ్ ప్లేయర్స్ బాధ్యత తీసుకొని పరుగులు చేస్తుంటారని రాయుడు పేర్కొన్నాడు. కానీ పేరున్న స్టార్ ఆటగాళ్లు మాత్రం కేక్ మీద ఉండే క్రీమ్​ను తింటూ ఎంజాయ్ చేస్తుంటారని విమర్శించాడు. ఇలాంటి టీమ్ ఎప్పుడూ గెలవదని చెప్పుకొచ్చాడు రాయుడు. ఈ కారణం వల్లే ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్పు గెలవలేదని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్​తో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ నవ్​జ్యోత్ సింగ్ సిద్ధు కూడా ఏకీభవించాడు. రాయుడు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పాడు. ఇక, లక్నో సూపర్ జియాంట్స్​తో బుధవారం జరిగిన మ్యాచ్​లో 28 పరుగుల తేడాతో ఓడింది ఆర్సీబీ. లక్నో సంధించిన 181 పరుగుల టార్గెట్​ను రీచ్ కాలేక.. 153 పరుగులకే కుప్పకూలింది. మరి.. బెంగళూరు ఓటములకు పేరున్న స్టార్ బ్యాటర్లే కారణమంటూ రాయుడు చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఇది ఆరంభం మాత్రమే.. నా గోల్ అదే! పేసుగుర్రం మయాంక్ కామెంట్స్

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి