Nidhan
గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓడిన ఆర్సీబీ నిరాశలో కూరుకుపోయింది. అయితే ఆ టీమ్ ఓటమిలో అంపైర్ల పాత్ర తెలిస్తే మీరూ షాకవ్వాల్సిందే.
గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓడిన ఆర్సీబీ నిరాశలో కూరుకుపోయింది. అయితే ఆ టీమ్ ఓటమిలో అంపైర్ల పాత్ర తెలిస్తే మీరూ షాకవ్వాల్సిందే.
Nidhan
డూ ఆర్ డై మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన వేళ ఓటమిపాలైంది డుప్లెసిస్ సేన. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ టీమ్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఏదైనా అద్భుతాలు జరిగితే చెప్పలేం. కానీ అఫీషియల్‌గా మాత్రం ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోయాయి. అయితే హైటెన్షన్ మ్యాచ్‌లో బంతి బంతికి విజయం ఇరు టీమ్స్‌తో దోబూచులాడింది. ఆఖరి వరకు పోరాడినా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఆ జట్టు ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నా అసలు రీజన్ మాత్రం అంపైర్లేనని చెప్పాలి. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
విరాట్ కోహ్లీ ఔట్‌తో సహా ఇంకొన్ని విషయాల్లో అంపైరింగ్ మిస్టేక్స్ బెంగళూరుకు శాపంగా మారాయి. అవన్నీ అనుకూలంగా వచ్చి ఉంటే ఆ టీమ్ మరికొన్ని బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించేది. విరాట్ ఔట్ నుంచి మొదలైన అంపైరింగ్ తప్పులు సుయాష్ సిక్స్ విషయం వరకు బెంగళూరుకు వ్యతిరేకంగా వచ్చాయి. హర్షిత్ రాణా వేసిన బీమర్కు విరాట్ ఔట్ అయ్యాడు. అప్పటికే 7 బంతుల్లో 1 బౌండరీ, 2 సిక్సుల సాయంతో 18 పరుగులు చేసిన కింగ్ సూపర్ టచ్‌లో కనిపించాడు. కానీ నడుము కంటే ఎత్తులో వచ్చిన బాల్‌ను డిఫెన్స్ చేయబోయి ఔట్ అయ్యాడతను. సాధారణంగా అది నో బాల్. కానీ టెక్నికల్‌గా చూసుకుంటే బాల్ డిప్ అయింది కాబట్టి విరాట్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఇక్కడే ఆర్సీబీకి మొదటి దెబ్బ పడింది. ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్ (4) రూపంలో ఆ టీమ్‌కు మరో షాక్ తగిలింది.
లోమ్రోర్ను సునీల్ నరైన్ ఔట్ చేశాడు. కాట్ అండ్ బౌల్డ్‌గా ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడతను. అయితే అది నో బాల్. నరైన్ బంతి వేసిన సమయంలో అతడి ఫ్రంట్ ఫుట్ లైన్‌ను దాటింది. అయినా దీన్ని గమనించని అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. తీరా తర్వాత రీప్లేలో చూస్తే అది క్లియర్ నో బాల్ అని తేలింది. అలాగే సూయాష్ ప్రభుదేశాయ్ విషయంలోనూ అంపైర్లు తప్పు చేశారు. 18 బంతుల్లో 24 పరుగులతో సూయాష్ జోరు మీదున్నాడు. అతడే మ్యాచ్‌ను ఫినిష్ చేస్తాడని అంతా అనుకున్నారు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో లెగ్ సైడ్ అతడు కొట్టిన బౌండరీ లైన్ బయట పడింది. అయితే అది సిక్స్ అయినా దాన్ని అంపైర్లు బౌండరీగా ఇచ్చారు. తర్వాత రీప్లేలో అది స్పష్టంగా సిక్స్‌కు వెళ్లినట్లు తేలింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 1 పరుగు తేడాతో ఓడింది. ఒకవేళ సూయాష్ షాట్‌ను సిక్స్‌గా ఇచ్చి ఉంటే ఇంకో బంతి మిగిలి ఉండగానే మ్యాచ్‌ను నెగ్గేది. ఇది చూసిన నెటిజన్స్.. ఆర్సీబీని అంపైర్లే ఓడించారని కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చెత్త అంపైరింగ్ ఏంటని.. బీసీసీఐ ఏం చేస్తోందని నిలదీస్తున్నారు. మరి.. కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్‌లో అంపైరింగ్ మిస్టేక్స్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Oh My God, How did they missed this, seems like a clear SIX 🧐
RCB lost by 1 Run, and if this SIX wasn’t FOUR, then RCB would have won this do or die match 👀 with a ball spare 😌#RCBvsKKR #ViratKohli #MitchellStarc #EarthDay2024 #MIvRR #IPL2024pic.twitter.com/rQLMQPYaRj
— Richard Kettleborough (@RichKettle07) April 22, 2024
Reason behind today’s loss –
– Kohli got out on a no ball.
– Lomror was given out on a clear no ball.
– Suyash hits a six in 15th over which was given as 4 but umpires didn’t check that ball clearly.Worst thing is, not a single commentator spoke on last 2 decisions.#RCBvsKKR pic.twitter.com/hIDebhHEjC
— αbhι¹⁸ (@CricCineHub) April 21, 2024