Cameron Green: వీడియో: గ్రీన్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. పక్షిలా గాల్లోకి ఎగిరి..!

ఆర్సీబీ ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్ సింగిల్ హ్యాండ్​ క్యాచ్​తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్​లో బెస్ట్ క్యాచ్​ల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు.

ఆర్సీబీ ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్ సింగిల్ హ్యాండ్​ క్యాచ్​తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్​లో బెస్ట్ క్యాచ్​ల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు.

క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే సామెత క్రికెట్​లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. క్యాచ్​లు పట్టుకుంటే మ్యాచ్ గెలిచినట్లేననేది దీనర్థం. ఇలా క్యాచ్​లు పట్టి, రనౌట్లు, స్టంపౌట్లతో టీమ్స్ మ్యాచ్ గెలిచిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే ఎంత మంచి బౌలింగ్ యూనిట్ ఉన్నా అందుకు తగ్గట్లు పరుగులు కాపాడే ఫీల్డర్లు టీమ్​లో ఉండాల్సిందే లేకపోతే బౌలర్ల శ్రమ వృథానే అంటుంటారు. ఇక, క్రికెట్​లో సింగిల్ హ్యాండ్ క్యాచ్​లు చూసే ఉంటారు. తాజాగా మరో స్టన్నింగ్ క్యాచ్​కు ఐపీఎల్ వేదికైంది. కోల్​కతా నైట్ రైడర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఆర్సీబీ ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్ అద్భుతమైన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.

స్టన్నింగ్ క్యాచ్​తో కేకేఆర్ యంగ్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ (3)ని పెవిలియన్​కు పంపాడు గ్రీన్. యష్ దయాల్ బౌలింగ్​లో రఘువంశీ లెగ్ సైడ్ ఫ్లిక్ చేసిన బాల్ మిడ్ వికెట్ మీదుగా దూసుకెళ్లింది. మంచి టైమింగ్​తో కొట్టిన ఆ షాట్​కు బాల్ ఈజీగా బౌండరీ వెళ్తుందని అంతా అనుకున్నారు. అయితే మధ్యలోనే దాన్ని పక్షిలా ఎగిరి కుడి చేతితో అందుకున్నాడు గ్రీన్. బాల్​ వేగాన్ని, ఎత్తును సరిగ్గా అంచనా వేసిన గ్రీన్.. రైట్ హ్యాండ్​ను సాధ్యమైనంత వెనక్కి వంచి మొత్తం శరీరం గాలిలో ఉండగా బాల్​ను అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ సూర్యవంశీ సహా ఆర్సీబీ ఆటగాళ్లు కూడా షాకయ్యారు. దీన్ని చూసిన నెటిజన్స్ సింగిల్ హ్యాండ్ క్యాచ్​ల్లో దీన్ని మించినది లేదని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన కేకేఆర్ ప్రస్తుతం 9 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 102 పరుగులతో ఉంది. మరి.. గ్రీన్ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments