iDreamPost
android-app
ios-app

హార్దిక్ ఓవరాక్షన్​పై పఠాన్ ఓపెన్ కామెంట్స్! కడిగి పారేశాడు!

  • Published Mar 25, 2024 | 2:44 PM Updated Updated Mar 25, 2024 | 2:44 PM

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్​లోనే ఓవరాక్షన్ చేశాడు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అతడ్ని కడిగి పారేశాడు.

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్​లోనే ఓవరాక్షన్ చేశాడు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అతడ్ని కడిగి పారేశాడు.

  • Published Mar 25, 2024 | 2:44 PMUpdated Mar 25, 2024 | 2:44 PM
హార్దిక్ ఓవరాక్షన్​పై పఠాన్ ఓపెన్ కామెంట్స్! కడిగి పారేశాడు!

ఐపీఎల్-2024 జర్నీని ఓటమితో స్టార్ట్ చేసింది ముంబై ఇండియన్స్. ఈసారి ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఎంఐకి గుజరాత్ టైటాన్స్ షాక్ ఇచ్చింది. విక్టరీ పక్కా అని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మ్యాచ్​ను లాగేసుకుంది. బ్యాటింగ్​లో ఫర్వాలేదనిపించిన జీటీ.. బౌలింగ్​లో అదరగొట్టింది. ఆ టీమ్ బౌలర్లు, ఫీల్డర్లు సమష్టిగా రాణించారు. కొత్త కెప్టెన్ శుబ్​మన్ గిల్-కోచ్ ఆశిష్​ నెహ్రా జోడీ మ్యాజిక్ చేసి ముంబైని ఓడించింది. గెలుపుతో కెప్టెన్సీ కెరీర్​ను ఘనంగా ఆరంభించాడు గిల్. మరోవైపు గుజరాత్​ను వీడి ముంబైకి వచ్చి, సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా ఓటమితో టోర్నీని స్టార్ట్ చేశాడు. ఈ మ్యాచ్​లో బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీలో దారుణంగా ఫెయిలయ్యాడు పాండ్యా. దీంతో అతడిపై అన్ని వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. భారత మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పాండ్యాను కడిగి పారేశాడు.

హార్దిక్ పాండ్యా మీద పఠాన్ ఓపెన్ కామెంట్స్ చేశాడు. హార్దిక్ వల్లే ముంబై ఇండియన్స్ ఓడిపోయిందని పఠాన్ అన్నాడు. కెప్టెన్సీలో పాండ్యా చేసిన రెండు ప్రధాన తప్పులే ఆ జట్టు కొంపముంచాయని చెప్పాడు. హార్దిక్ సరిగ్గా టీమ్​ను నడిపించే ఉంటే ఆ టీమ్ ఓడేది కాదంటూ కడిగి పారేశాడు. ‘ఈ మ్యాచ్​లో హార్దిక్ రెండు బిగ్ మిస్టేక్స్ చేశాడు. టీమ్​లో జస్​ప్రీత్ బుమ్రా లాంటి టాప్ బౌలర్ ఉన్నాడు. అయినా పాండ్యానే తొలుత బౌలింగ్​కు దిగాడు. అంతేగాక పవర్​ప్లేలోనే రెండు ఓవర్లు వేసేశాడు. ఇది తొలి తప్పిదం. అలాగే బ్యాటింగ్​లో తాను రావాల్సిన టైమ్​లో టిమ్ డేవిడ్​ను ఆడమని పంపాడు. అది కూడా రషీద్ ఖాన్ లాంటి ప్రమాదకర బౌలర్ బౌలింగ్ వేస్తున్న టైమ్​లో బరిలోకి దింపాడు. అక్కడే మ్యాచ్ ముగిసింది’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

చాన్నాళ్ల తర్వాత ఆడుతుండటంతో రషీద్ బౌలింగ్​ను ఫేస్ చేయడానికి హార్దిక్ పాండ్యా ఆసక్తి చూపించలేదని.. అందుకే డేవిడ్​ను ముందుకు పంపి ఉంటాడని పఠాన్ పేర్కొన్నాడు. అయితే మ్యాచ్ అక్కడే ముగిసిందని.. టిమ్ డేవిడ్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడని, ఒత్తిడికి గురై అతడితో పాటు తిలక్ వర్మ కూడా వికెట్లు సమర్పించుకున్నారని వ్యాఖ్యానించాడు. ఇక, పవర్​ప్లేతో పాటు మొత్తంగా 3 ఓవర్లు వేసిన పాండ్యా 30 పరుగులు ఇచ్చుకున్నాడు. అదే బుమ్రా మాత్రం 4 ఓవర్లు వేసి 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (19)ను ఔట్ చేసి ముంబైకి తొలి బ్రేక్ త్రూను బుమ్రానే అందించాడు. ఆ తర్వాత బాగా ఆడుతున్న సాయి సుదర్శన్ (45)తో పాటు డేంజరస్ డేవిడ్ మిల్లర్ (12)ను కూడా వెనక్కి పంపాడు బుమ్రా. అలాంటోడ్ని కాదని తాను బౌలింగ్​కు దిగాడు హార్దిక్. బ్యాటింగ్​లో కూడా ముందు ఆడకుండా డౌన్ ది ఆర్డర్ వచ్చాడు. దీంతో అతడ్ని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఇదేం కెప్టెన్నీ అంటూ క్రిటిసైజ్ చేస్తున్నారు. మరి.. పాండ్యాపై పఠాన్ సీరియస్ అవడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: హార్దిక్​ను కుక్కతో పోలుస్తూ ఫ్యాన్స్ అరుపులు.. ఇంతకంటే అవమానం ఉండదు!

 

View this post on Instagram

 

A post shared by Irfan Pathan (@irfanpathan_official)