Nidhan
గుజరాత్ జట్టులోని ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పోయిస్తున్నాడు. ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయినోడు ఆ కసిని అంతా మ్యాచ్‌ల్లో చూపిస్తున్నాడు. ఎవరా ఆటగాడు అనేది ఇప్పుడు చూద్దాం..
గుజరాత్ జట్టులోని ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పోయిస్తున్నాడు. ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయినోడు ఆ కసిని అంతా మ్యాచ్‌ల్లో చూపిస్తున్నాడు. ఎవరా ఆటగాడు అనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఫ్రాంచైజీ క్రికెట్లో ఏ టీమ్ అయినా స్టార్ ప్లేయర్ల మీదే ఎక్కువ మొత్తాలను ఇన్వెస్ట్ చేస్తుంది. ఆక్షన్‌లో వారి కోసం తెగ పోటీపడుతుంది. కోట్లకు కోట్లు కుమ్మరించేందుకు రెడీ అవుతుంది. అయితే ఇలా భారీ ధరకు తెచ్చుకున్న స్టార్లలో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. అదే టాలెంట్ ఉండి కూడా వెలుగులోకి రాని ప్లేయర్లను తీసుకొని ప్రోత్సహిస్తే రాణించాలనే కసితో ఆడతారు. తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు చాలా కష్టపడతారు. అందుకే కొన్ని ఫ్రాంచైజీలు ఇలాంటి వాళ్లను వెతికి మరీ పట్టుకుంటాయి. అలా గుజరాత్ టైటాన్స్ ఓ ఆటగాడ్ని దక్కించుకుంది. రెండేళ్ల కింద ఐపీఎల్లో అన్‌సోల్డ్‌గా మిగిలిన ఆ ప్లేయర్ ఇప్పుడు జీటీ టీమ్‌లో కీలకంగా మారాడు. ఆ జట్టు విజయాల్లో అతడిదే కీ రోల్. ఎవరా ప్లేయర్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్లో దుమ్మురేపుతున్నాడు. నిరుడు కూడా క్యాష్ రిచ్ లీగ్‌లో చెలరేగి బౌలింగ్ చేశాడతను. 14 మ్యాచుల్లో ఏకంగా 27 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో మోహిత్ పోషించిన పాత్రను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఈసారి కూడా అదే పెర్ఫార్మెన్స్ను రిపీట్ చేస్తున్నాడీ పేసర్. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు మోహిత్. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1 వికెట్ తీశాడు. ఇవాళ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న పోరులో చెలరేగిపోయాడు మోహిత్. 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో జోరు మీద ఉన్న అభిషేక్ శర్మ (20 బంతుల్లో 29)ను ఔట్ చేశాడు మోహిత్. అలాగే ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (20), వాషింగ్టన్ సుందర్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. లాస్ట్ ఓవర్స్‌లో రన్స్‌ను కట్టడి చేయడమే గాక కీలక బ్రేక్ త్రూలు అందిస్తూ ప్రత్యర్థి జట్ల దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు మోహిత్. వేరియేషన్సే ప్రధాన బలంగా చెలరేగిపోతున్నాడు. కట్టర్స్, యార్కర్స్, స్లో బాల్స్‌తో బ్యాటర్లను ఉక్కిరిబిక్కరి చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు సీఎస్కే తరఫున కొన్ని సీజన్ల పాటు అదరగొట్టిన మోహిత్‌ను తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఐపీఎల్-2022లో అతడు అన్‌సోల్డ్‌గా ఉన్నాడు. అలాంటోడ్ని అక్కున చేర్చుకుంది గుజరాత్. గత సీజన్‌కు ముందు అతడ్ని టీమ్‌లోకి తీసుకుంది. దీంతో రెస్పాన్సిబిలిటీ తీసుకున్న మోహిత్.. అపోజిషన్ టీమ్ బ్యాటర్లతో ఆడుకుంటున్నాడు. మరి.. ఈ సీజన్లో మోహిత్ బౌలింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: MI vs RR: ముంబై vs రాజస్థాన్.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
TAKE A BOW, MOHIT SHARMA…!!! 💥
3/25 against SRH at the Narendra Modi Stadium – he was unsold in IPL 2022, from there on to making a great comeback last season to now consistently performing. 🔥 pic.twitter.com/yaJD5upK1I
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2024