iDreamPost

MI vs RR: ముంబై vs రాజస్థాన్.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Mar 31, 2024 | 5:51 PMUpdated Mar 31, 2024 | 5:51 PM

ఈసారి ఐపీఎల్​లో ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. రాజస్థాన్ రాయల్స్​తో మ్యాచ్​తోనైనా బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం..

ఈసారి ఐపీఎల్​లో ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. రాజస్థాన్ రాయల్స్​తో మ్యాచ్​తోనైనా బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం..

  • Published Mar 31, 2024 | 5:51 PMUpdated Mar 31, 2024 | 5:51 PM
MI vs RR: ముంబై vs రాజస్థాన్.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఈసారి ఐపీఎల్​లో ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. తొలి విజయం కోసం హార్దిక్ సేన ఎదురు చూస్తోంది. రాజస్థాన్ రాయల్స్​తో సోమవారం వాంఖడేలో జరిగే పోరులో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచుల్లోనూ నెగ్గి ఫుల్ జోష్​లో ఉంది రాజస్థాన్. గెలుపు జోరును కొనసాగిస్తూ అపోజిషన్ టీమ్స్​కు డేంజర్ సిగ్నల్స్ పంపాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు మనం చూద్దాం..

ముంబై ఇండియన్స్

ఓపెనింగ్ మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై. ఆ తర్వాత సన్​రైజర్స్​తో మ్యాచ్​లో 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ రెండు మ్యాచుల్లోనూ ముంబై బ్యాటర్లు బాగానే పెర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ సూపర్బ్​ టచ్​లో ఉండటం ఆ టీమ్​కు ప్రధాన బలం. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ భీకర ఫామ్​లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇషాన్ కిషన్ కూడా ఫామ్​ను అందుకోవడం విశేషం. అయితే ఇంత బ్యాటింగ్ డెప్త్ ఉన్నా ముంబై మ్యాచ్​లు ఫినిష్ చేయలేకపోతోంది.

బౌలింగ్​లో జస్​ప్రీత్ బుమ్రా ఒక్కడే రాణిస్తున్నాడు. మిగిలిన వాళ్లందరూ గత మ్యాచ్​లో ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం మైనస్​గా మారింది. అయితే ముంబై టీమ్​కు అతిపెద్ద నెగెటివ్ అంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని చెప్పకతప్పదు. తొలి రెండు మ్యాచుల్లో బౌలింగ్​లో భారీగా పరుగులు సమర్పించుకున్న పాండ్యా.. బ్యాటింగ్​లో కీలక సమయాల్లో ఔటై నిరాశపర్చాడు. అతడి కెప్టెన్సీ టీమ్​కు మరో మైనస్​గా మారింది. ఫీల్డింగ్ పొజిషన్స్​, బౌలింగ్ ఛేంజెస్​ విషయంలో మాజీ కెప్టెన్ రోహిత్ నుంచి అతడు సలహాలు తీసుకోకుంటే ఎంఐ మరింత నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ జట్టు ఈసారి బలంగా కనిపిస్తోంది. బౌలింగ్​, బ్యాటింగ్​లో ఆ టీమ్​కు పెద్దగా మైనస్​లు లేవు. ఓవరాక్షన్ స్టార్​గా ముద్రపడిన రియాన్ పరాగ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ నాక్స్​తో సత్తా చాటాడు. ఆ టీమ్​కు అతడే ప్రధాన బలంగా మారాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా మంచి టచ్​లో ఉన్నాడు. అతడి సారథ్యం ఆకట్టుకుంటోంది. బ్యాటింగ్​లో యశస్వి జైస్వాల్​ నుంచి ఓ బిగ్ నాక్ బాకీ ఉంది. బౌలింగ్​లో బర్గర్, చాహల్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ ఫుల్ స్వింగ్​లో ఉన్నారు. గత మ్యాచ్​లో అవేశ్ ఫైనల్ ఓవర్ వేసిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. వీళ్లు అదే ఫామ్​ను కంటిన్యూ చేస్తే రాజస్థాన్​కు తిరుగుండదు.

ప్రిడిక్షన్

రెండు టీమ్స్ బలాబలాలను బట్టి రేపటి మ్యాచ్​లో రాజస్థాన్ నెగ్గడం ఖాయం. ఈ ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 28 మ్యాచ్​లు జరిగాయి. అందులో ముంబై 15 సార్లు, రాజస్థాన్ 12 సార్లు నెగ్గాయి. గెలుపోటముల రికార్డుల్లో ముంబై ముందంజలో ఉన్నా రాజస్థాన్ ఆడుతున్న తీరు, వరుస విజయాలు సాధించడంతో ఆ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. హార్దిక్​ కెప్టెన్సీ, అతడి ఆటతీరు, ముంబై జట్టులో లుకలుకలు, టీమ్ రెండుగా చీలిందనే రూమర్స్ నేపథ్యంలో ఆ జట్టు రాజస్థాన్​ను నిలువరించడం కష్టమే.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

ముంబై:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రేవిస్, గెరాల్డ్ కొయెట్జీ, రొమారియో షెఫర్డ్, పీయుష్ చావ్లా, జస్​ప్రీత్ బుమ్రా.

రాజస్థాన్:
జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్​మెయిర్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్.

ఇదీ చదవండి: T20 వరల్డ్ కప్​కు కేఎల్ రాహుల్ దూరం.. ఈ పాపం BCCIదే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి