iDreamPost
android-app
ios-app

ముంబైపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ.. గిల్ సేన విజయానికి 5 కారణాలు!

  • Published Mar 25, 2024 | 7:56 AM Updated Updated Mar 25, 2024 | 7:56 AM

ఐపీఎల్-2024ను గుజరాత్ టైటాన్స్ గ్రాండ్​గా స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​కు షాక్ ఇచ్చింది గిల్ సేన. ఈ మ్యాచ్​లో జీటీ విజయానికి గల 5 కారణాలు ఏంటో తెలుసుకుందాం..

ఐపీఎల్-2024ను గుజరాత్ టైటాన్స్ గ్రాండ్​గా స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​కు షాక్ ఇచ్చింది గిల్ సేన. ఈ మ్యాచ్​లో జీటీ విజయానికి గల 5 కారణాలు ఏంటో తెలుసుకుందాం..

  • Published Mar 25, 2024 | 7:56 AMUpdated Mar 25, 2024 | 7:56 AM
ముంబైపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ.. గిల్ సేన విజయానికి 5 కారణాలు!

ఐపీఎల్-2024ను గుజరాత్ టైటాన్స్ గ్రాండ్​గా స్టార్ట్ చేసింది. ఆరంభ సీజన్​లో ఛాంపియన్​గా నిలిచిన జీటీ.. గతేడాది రన్నరప్​గా నిలిచింది. ఈ సీజన్​ను కూడా అంతే పాజిటివ్​గా స్టార్ట్ చేసింది. ఓడిపోయే మ్యాచ్​లో ఆఖరి వరకు పోరాడి ముంబై ఇండియన్స్​కు షాక్ ఇచ్చింది. ఈజీగా నెగ్గుతుందని అనుకున్న హార్దిక్ సేన 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టైటాన్స్​ ప్లేయర్లలో గెలవాలన్న కసి, తపన కనిపించింది. అదే వారికి విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 రన్స్ చేసింది. ఛేజింగ్​కు దిగిన ఎంఐ అన్ని ఓవర్లు ఆడి 9 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది. ఈ నేపథ్యంలో టైటాన్స్ విజయానికి గల 5 కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సాయి సుదర్శన్

టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ గుజరాత్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. సెకండ్ ఇన్నింగ్స్ టైమ్​లో పిచ్​ మీద తేమ పడుతుంది కాబట్టి బ్యాటింగ్ ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఆ డిసిషన్ తీసుకున్నాడు. టైటాన్స్ బ్యాటర్లు ఎవరూ సరిగ్గా రాణించలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతూ పోయాయి. అయితే యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (45) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లతో కలసి చిన్న చిన్న భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఇన్నింగ్స్​ను బిల్డ్ చేశాడు. అతడు లేకపోతే జీటీ మంచి స్కోరు చేసేది కాదు. అందుకే సాయి సుదర్శన్​ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.

GT Winning Reasons

బౌలింగ్

గుజరాత్ ఈ మ్యాచ్​లో విజయం సాధించడానికి రెండో ప్రధాన కారణం బౌలింగ్ అనే చెప్పాలి. రోహిత్ శర్మ (43), డేవిడ్ బ్రేవిస్ (46) లాంటి బ్యాటర్లు భయపెట్టడంతో ఈ మ్యాచ్​లో జీటీ నెగ్గడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఆ టీమ్ బౌలర్లు అజ్మతుల్లా ఒమర్జాయి (2/27), ఉమేశ్ యాదవ్ (2/31), స్పెన్సర్ జాన్సన్ (2/25), మోహిత్ శర్మ (2/35) అదరగొట్టారు. ఆఖరి ఓవర్లలో జాన్సన్, మోహిత్, ఉమేశ్​లు కలసి ముంబై బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ వికెట్లు తీయకున్నా పరుగులు కట్టడి చేస్తూ, డాట్ బాల్స్ వేస్తూ ఎంఐపై ప్రెజర్ పెట్టాడు. దాని వల్ల ఇతర బౌలర్లకు వికెట్లు పడ్డాయి.

ఉమేశ్ యాదవ్

ముంబై వర్సెస్ జీటీ మ్యాచ్​లో ఆఖరి ఓవర్ సూపర్బ్ అనే చెప్పాలి. అది ఓ సినిమాను తలపించింది. ఆ ఓవర్​లో 19 రన్స్ రావాల్సి ఉండగా.. తొలి రెండు బంతులకు 6, 4 కొట్టాడు పాండ్యా. దీంతో మిగిలిన నాలుగు బంతుల్లో 9 రన్స్ చేస్తే చాలు. కానీ ఇక్కడే మ్యాజిక్ జరిగింది. వరుస బంతుల్లో హార్దిక్ (11)తో పాటు పీయుష్ చావ్లా (0)ను వెనక్కి పంపాడు ఉమేష్. తన ఎక్స్​పీరియెన్స్ మొత్తాన్ని యూజ్ చేసి అతడు వేసిన ఆఖరి స్పెల్ సూపర్బ్ అనే చెప్పాలి.

శుబ్​మన్ గిల్

గుజరాత్​కు కొత్త కెప్టెన్​గా వచ్చిన గిల్ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. మ్యాచ్ మొత్తం కూల్​గా కనిపించాడు. బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డ్ పొజిషన్స్​తో అతడు ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్​ను అతడు వాడుకున్న విధానం బాగుంది. అలాగే చివరి ఓవర్ ఉమేష్ యాదవ్​కు ఇవ్వడం కూడా వర్కౌట్ అయింది. ఓవరాల్​గా మ్యాచ్ సిచ్యువేషన్స్​కు తగ్గట్లు డిసిషన్స్ తీసుకుంటూ మంచి కెప్టెన్ అయ్యే సత్తా తనకు ఉందని ప్రూవ్ చేసుకున్నాడు గిల్.

ఆశిష్ నెహ్రా

టైటాన్స్​ను గ్రౌండ్​ లోపల ఉన్న కెప్టెన్ గిల్ ఎంత బాగా లీడ్ చేశాడో బయట ఉండి కోచ్ నెహ్రా కూడా అలాగే నడిపించాడు. ఏ కోచ్ అయినా డగౌట్​లో కూర్చొని ప్లాన్స్ వేస్తుంటారు. కానీ నెహ్రా మాత్రం ఫుట్​బాల్​ కోచ్​ల మాదిరిగా బౌండరీ లైన్ పక్కన నిలబడి ఎప్పటికప్పుడు కెప్టెన్ గిల్​కు కావాల్సిన ఇన్​పుట్స్ పంపించాడు. అలాగే పేసర్లకు ధైర్యాన్ని ఇస్తూ మ్యాచ్ మనదే, వదిలేదేలే అంటూ ధైర్యాన్ని నూరిపోశాడు. ఈ విషయాన్ని స్వయంగా బౌలర్ జాన్సన్ పంచుకున్నాడు. కాబట్టి గుజరాత్ విజయానికి నెహ్రాకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.

ఇదీ చదవండి: షారుఖ్‌ ఖాన్‌తో కలిసి IPL మ్యాచ్‌కు వచ్చిన ఈమె ఎవరు? షారుఖ్‌తో రిలేషన్‌ ఏంటి?

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin