Nidhan
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. ఊహకందని రీతిలో చెలరేగిన యంగ్ బ్యాటర్.. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. ఊహకందని రీతిలో చెలరేగిన యంగ్ బ్యాటర్.. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించాడు.
Nidhan
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు పంత్. అతడి ఇన్నింగ్స్‌లో 5 బౌండరీలతో పాటు 8 భారీ సిక్సులు ఉండటం విశేషం. ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడిన పంత్.. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడతను.
ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో జూలు విదిల్చిన పంత్ తొలి బంతికి డబుల్ తీశాడు. ఆ తర్వాతి బంతి వైడ్ అవడంతో మరో రన్ స్కోర్ బోర్డు మీద చేరింది. అనంతరం ఐదు బంతుల్లో నాలుగు భారీ సిక్సులు బాదాడు పంత్. అలాగే ఓ బౌండరీ కూడా కొట్టాడు. దీంతో 200 చేరితే గొప్ప అనుకున్న డీసీ స్కోరు కాస్తా 224కు చేరింది. మోహిత్ ఓవర్లో అతడు కొట్టిన ఓ హెలికాప్టర్ షాట్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి. పంత్‌తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66) కూడా మంచి ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (7 బంతుల్లో 26) కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో ఢిల్లీ భారీ స్కోరును సెట్ చేయగలిగింది. మరి.. పంత్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝙋𝘼𝙉𝙏𝙖𝙨𝙩𝙞𝙘!
FIFTY 🆙 for the @DelhiCapitals skipper, who aims to finish on a high with such serious shots 😎
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvGT | @RishabhPant17 pic.twitter.com/Vc8ZXRBngj
— IndianPremierLeague (@IPL) April 24, 2024
Vintage Rishabh Pant™ 💙❤ pic.twitter.com/k8DlSI1S8B
— Delhi Capitals (@DelhiCapitals) April 24, 2024