iDreamPost

ఆ ప్లేయర్​ను ఎలాగైనా T20 వరల్డ్ కప్​లో ఆడించాలి.. సెలక్టర్లకు రైనా రిక్వెస్ట్!

  • Published Apr 24, 2024 | 9:40 PMUpdated Apr 24, 2024 | 9:40 PM

టీ20 వరల్డ్ కప్​కు ఇంకా ఎక్కువ టైమ్ లేదు. ఐపీఎల్-2024 ముగిసిన కొద్ది గ్యాప్​లోనే మెగా టోర్నీ మొదలుకానుంది. త్వరలోనే పొట్టి కప్​లో ఆడే టీమ్స్ తమ స్క్వాడ్​​ను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు మాజీ బ్యాటర్ సురేష్ రైనా ఓ రిక్వెస్ట్ చేశాడు.

టీ20 వరల్డ్ కప్​కు ఇంకా ఎక్కువ టైమ్ లేదు. ఐపీఎల్-2024 ముగిసిన కొద్ది గ్యాప్​లోనే మెగా టోర్నీ మొదలుకానుంది. త్వరలోనే పొట్టి కప్​లో ఆడే టీమ్స్ తమ స్క్వాడ్​​ను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు మాజీ బ్యాటర్ సురేష్ రైనా ఓ రిక్వెస్ట్ చేశాడు.

  • Published Apr 24, 2024 | 9:40 PMUpdated Apr 24, 2024 | 9:40 PM
ఆ ప్లేయర్​ను ఎలాగైనా T20 వరల్డ్ కప్​లో ఆడించాలి.. సెలక్టర్లకు రైనా రిక్వెస్ట్!

ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్​-2024కు టైమ్ దగ్గర పడుతోంది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా ఎంతో కాలం లేదు. జూన్ 2వ తేదీన పొట్టి కప్పుకు తెరలేవనుంది. దీంతో ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. యూఎస్​ఏ-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 కప్పును ఎగరేసుకుపోవాలని అన్ని టీమ్స్ అనుకుంటున్నాయి. గతేడాది వన్డే వరల్డ్ కప్​ ఫైనల్​లో ఓడి టైటిల్​ను చేజార్చుకున్న టీమిండియా కూడా ఇదే ఆలోచనతో ఉంది. వన్డే కప్ మిస్సయింది.. కాబట్టి టీ20ల్లోనైనా ఛాంపియన్స్​గా నిలవాలని భావిస్తోంది. త్వరలోనే వరల్డ్ కప్​లో ఆడే భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా వరల్డ్ కప్​ స్క్వాడ్​లో ఏయే ఆటగాళ్లు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పేస్ ఆల్​రౌండర్ పొజిషన్​కు తీవ్ర పోటీ ఉండటంతో ఎవర్ని తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి. సీనియర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబె ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. హార్దిక్ ఫామ్​లో లేడు. బ్యాటర్​గా, బౌలర్​గా తరచూ ఫెయిల్ అవుతున్నాడు. దూబె మాత్రం ఫుల్ స్వింగ్​లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆల్​రౌండర్ రోల్ కోసం ఎవర్ని తీసుకోవాలనే దానిపై మాజీ ఆటగాడు రైనా రియాక్ట్ అయ్యాడు. శివమ్ దూబెను టీమిండియాలోకి తీసుకోవాలని అతడు అన్నాడు. ఎలాగైనా సరే భారత జట్టులో దూబెకు స్థానం కల్పించాలని చీఫ్​ సెలక్టర్ అజిత్ అగార్కర్​ను అతడు రిక్వెస్ట్ చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియోలో ఓ పోస్ట్ పెట్టాడు.

శివమ్ దూబెను వరల్డ్ కప్​లో ఆడించాలి.. అగార్కర్ భాయ్ ప్లీజ్ అతడ్ని సెలక్ట్ చేయండి అంటూ రైనా ట్విట్టర్​లో ఒక పోస్ట్ పెట్టాడు. దీనికి అగార్కర్​ను ట్యాగ్ చేశాడు. రైనా ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ప్రపంచ కప్​ జట్టులో దూబె ఉండాల్సిందేనని.. అతడ్ని మించిన ఫినిషర్ దొరకడంటూ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ ఫామ్​లో లేడని.. ముంబై వరుస ఓటములు, పూర్ ఫామ్, ట్రోలింగ్​తో అతడు మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడని అంటున్నారు. అదే దూబె ఫుల్ కాన్ఫిడెన్స్​తో రఫ్ఫాడిస్తున్నాడని చెబుతున్నారు. ఇక, ఈ ఐపీఎల్​లో ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో 311 పరుగులు చేశాడు దూబె. 169 స్ట్రైక్ రేట్​తో అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. గ్రౌండ్​లోకి దిగింది మొదలు బౌలర్లను ఊచకోత కోస్తున్న దూబె.. లక్నోతో నిన్న జరిగిన మ్యాచ్​లో 27 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. మరి.. దూబెను వరల్డ్ కప్​లో ఆడించాలంటూ రైనా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి