Nidhan
ఫ్యాన్స్ మధ్య గొడవలు కామనే. కానీ అభిమానం హద్దులు దాటి గొడవలకు దారితీయడం ఆందోళనకరమనే చెప్పాలి. ఓ సీఎస్కే అభిమానిపై రోహిత్ శర్మ అభిమానులు దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్యాన్స్ మధ్య గొడవలు కామనే. కానీ అభిమానం హద్దులు దాటి గొడవలకు దారితీయడం ఆందోళనకరమనే చెప్పాలి. ఓ సీఎస్కే అభిమానిపై రోహిత్ శర్మ అభిమానులు దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఫిల్మ్ స్టార్స్, క్రికెటర్స్, పొలిటీషియన్స్‌కు భారీ సంఖ్యలో అభిమాన గణం ఉంటారు. ముఖ్యంగా క్రికెట్‌ను ఓ మతంగా కొలిచే మన దేశంలో ఆటగాళ్లకు ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే క్రికెటర్లకు సంబంధించిన చిన్న విషయం ఏదైనా బయటకు వచ్చినా వెంటనే వైరల్ అయిపోతుంది. ప్లేయర్ల ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలు ఏమైనా ఉన్నా తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాము ఆరాధించే ఆటగాళ్లను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఈ క్రమంలో దాడులు చేసేందుకు కొందరు వెనుకాడరు. ఫ్యాన్స్ మధ్య గొడవలు కామనే. కానీ అభిమానం హద్దులు దాటి గొడవలకు వెళ్లడం ఆందోళనకరమనే చెప్పాలి. ఓ సీఎస్కే అభిమానిపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రోహిత్ ఫ్యాన్స్ దాడిలో ఓ చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఔట్ కావడంతో సీఎస్కే అభిమాని బండోపంత్ టిబిలే (63).. ‘రోహిత్ ఔట్ అయ్యాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఎలా నెగ్గుతుంది’ అంటూ హేళన చేశాడు. అంతే హిట్‌మ్యాన్ అభిమానులు బల్వంత్, సాగర్ పట్టరాని కోపంతో టిబిలే తల మీద కర్రతో బలంగా కొట్టారు. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. ప్రస్తుతం టిబిలే పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అభిమానం మంచిదే గానీ అది గొడవలకు, దాడులకు దారి తీయొద్దని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: MS Dhoni: ధోని ముసలోడే కదా.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!