గుజరాత్ కు గుడ్ న్యూస్.. రాబిన్ మింజ్ ప్లేస్ లో చిచ్చర పిడుగు ఎంట్రీ!

తొలి మ్యాచ్ కు ముందు గుజరాత్ టీమ్ కు ఓ శుభవార్త అందింది. యాక్సిడెండ్ కారణంగా టోర్నీకి దూరమైన రాబిన్ మింజ్ ప్లేస్ ఓ చిచ్చర పిడుగును తీసుకొస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

తొలి మ్యాచ్ కు ముందు గుజరాత్ టీమ్ కు ఓ శుభవార్త అందింది. యాక్సిడెండ్ కారణంగా టోర్నీకి దూరమైన రాబిన్ మింజ్ ప్లేస్ ఓ చిచ్చర పిడుగును తీసుకొస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే ఐపీఎల్ 17వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ను మట్టికరిపించింది. అయితే ఈ సీజన్ స్టార్టింగ్ కొన్ని రోజుల ముందు నుంచి గాయాలు ఫ్రాంచైజీలను తెగ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ప్లేయర్లు గాయాల బారినపడటంతో.. యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. గత సీజన్ రన్నరప్ టీమ్ గుజరాత్ టీమ్ ను సైతం గాయాలు వదల్లేదు. యాక్సిడెంట్ కారణంగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రాబిన్ మింజ్ టోర్నీ మెుత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అయితే అతడి ప్లేస్ ని ఓ చిచ్చర పిడుగుతో భర్తీ చేస్తోంది గుజరాత్.

రాబిన్ మింజ్.. ఐపీఎల్ మినీ వేలంలో రూ. 3.60 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఇంత భారీ మెుత్తంలో ధరపెట్టి కొనడంతో.. అంతా ఎవరీ రాబిన్ మింజ్? అని వెతకడం ప్రారంభించారు. అయితే జాక్ కొట్టిన సంతోషం ఎంతో కాలం నిలవలేదు మింజ్ కు. యాక్సిడెంట్ రూపంలో అతడి సంతోషం ఆవిరైంది. బైక్ యాక్సిడెండ్ కావడంతో.. ఈ సీజన్ ఐపీఎల్ మెుత్తానికి అతడు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో మింజ్ ప్లేస్ ను ఓ చిచ్చర పిడుగుతో భర్తీ చేయాలని భావిస్తోంది. ఆ పిడుగు పేరే BR శరత్.

కర్ణాటకకు చెందిన శరత్ రైట్ హ్యాండర్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. పైగా టీ20లకు తగ్గట్లుగా ఆడటంలో స్పెషలిస్ట్ గా శరత్ పేరుగాంచాడు. 27 ఏళ్ల శరత్ 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 43 లిస్ట్ ఏ, 28 టీ20 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. టీ20 క్రికెట్ లో 30 ఫోర్లు, 12 సిక్స్ లతో 328 రన్స్ చేశాడు. ఫాస్ట్ గా రన్స్ చేయడంలో సిద్ధహస్తుడు శరత్. ఇతడిని రూ. 20 లక్షల బేస్ ప్రైస్ కు గుజరాత్ దక్కించుకుంది. మరి జార్ఖండ్ క్రిస్ గేల్ గా పేరొందిన రాబిన్ మింజ్ ప్లేస్ లో వస్తున్న శరత్ ఏ మేరకు రాణిస్తాడో వేచిచూడాలి. మార్చి 24న గుజరాత్ టీమ్ ముంబై ఇండియన్స్ ను ఢీకొనబోతోంది. అయితే మింజ్ ప్లేస్ లో సర్ఫరాజ్ ఖాన్ ను తీసుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి.

ఇదికూడా చదవండి: పస తగ్గలేదు.. సరికొత్త రికార్డు సృష్టించిన ధోని! ఏకైక ప్లేయర్ గా

Show comments