iDreamPost

పస తగ్గలేదు.. సరికొత్త రికార్డు సృష్టించిన ధోని! ఏకైక ప్లేయర్ గా

తొలి మ్యాచ్ లోనే తనలో పస తగ్గలేదని నిరూపించుకుంటూ.. సరికొత్త చరిత్ర సృష్టించాడు మహేంద్రసింగ్ ధోని. దీంతో ఐపీఎల్ లో ఈ రికార్డు సాధించిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. మరి రేర్ ఫీట్ ఏంటో తెలుసుకుందాం..

తొలి మ్యాచ్ లోనే తనలో పస తగ్గలేదని నిరూపించుకుంటూ.. సరికొత్త చరిత్ర సృష్టించాడు మహేంద్రసింగ్ ధోని. దీంతో ఐపీఎల్ లో ఈ రికార్డు సాధించిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. మరి రేర్ ఫీట్ ఏంటో తెలుసుకుందాం..

పస తగ్గలేదు.. సరికొత్త రికార్డు సృష్టించిన ధోని! ఏకైక ప్లేయర్ గా

మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్లో ఈ పేరుతెలియని క్రికెట్ అభిమాని ఉండడు అంటే అతియశయోక్తి కాదు. అంతలా వరల్డ్ క్రికెట్ పై తనముద్రను వేశాడు. ఇక భారత చిరకాల స్వప్నం అయిన వన్డే వరల్డ్ కప్ ను 2011లో అందించి.. అభిమానుల గుండెల్లో దేవుడిగా నిలిచాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ధోనిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. 42 ఏళ్ల వయసులో మెకాలికి సర్జరీ కావడం, ఇదే లాస్ట్ ఐపీఎల్ అని వార్తలు రావడంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. తొలి మ్యాచ్ లోనే తనలో పస తగ్గలేదని నిరూపించుకుంటూ.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఐపీఎల్ లో ఈ రికార్డు సాధించిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు.

ఐపీఎల్-చెన్నై సూపర్ కింగ్స్-ఎంఎస్ ధోని.. ఈ మూడింటిని విడదీసి చూడలేం. అంతలా ఈ బంధం పెనవేసుకుపోయింది. గత సీజన్ లో చెన్నైని ఛాంపియన్ గా నిలిపిన ధోని.. అదే జోరును ఈ ఎడిషన్ లో కూడా కొనసాగించే పనిలో పడ్డాడు. అందులో భాగంగా తొలి మ్యాచ్ లోనే ఆర్సీబీని 6 వికెట్ల తేడాతో చిత్తుచేశాడు. అయితే మోకాలికి సర్జరీ కావడం, 42 సంవత్సరాల ఏజ్ రావడంతో.. చాలా మంది ధోని మునపటిలా ఆడలేడని పేర్కొన్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. చిరుత వేగంతో గ్రౌండ్ లో కదిలి ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీతో మ్యాచ్ లో మూడు వికెట్లలో ధోని భాగస్వామ్యం ఉంది. తన కీపింగ్ లో ఏ మాత్రం పదును తగ్గలేదని మరోసారి నిరూపించుకుంటూ.. అనూజ్ రావత్ ను రనౌట్ చేసిన తీరు చూసి తీరాల్సిందే.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఓ రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఎంఎస్ ధోని. ఇన్నింగ్స్ చివరి బంతికి అనూజ్ ను రనౌట్ చేయడంతో.. ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ లో అత్యధిక రనౌట్లు చేసిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు మహేంద్రసింగ్ ధోని. ఇంతకు ముందు తన సహచర ఆటగాడు రవీంద్ర జడేజా(23)తో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును పంచుకున్న ధోని.. తాజాగా చేసిన రనౌట్ తో ఐపీఎల్ లో అత్యధిక రనౌట్లు చేసిన ప్లేయర్ గా అవతరించాడు. ఈ ఏజ్ లో కూడా ఇలా పెరిగెత్తి రనౌట్ చేయడం ఒక్క ధోనికే చెల్లుతుందని అభిమానులు కితాబిస్తున్నారు. భాయ్ మీలో ఇంకా పసతగ్గలేదు అంటూ ప్రశంసిస్తున్నారు. మరి ధోని సాధించిన ఈ రేర్ ఫీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

ఇదికూడా చదవండి: DKని తిడుతున్న RCB ఫ్యాన్స్! ఓడిపోయినందుకు కాదు.. ఎందుకంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి