iDreamPost
android-app
ios-app

IPL 2024.. హార్దిక్ ముందు రేర్ ఫీట్.. ఈ రికార్డు కొడితే రోహిత్, ధోని జుజుబీ! ఏంటంటే?

  • Published Mar 20, 2024 | 6:00 PM Updated Updated Mar 20, 2024 | 6:00 PM

ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా ముందు ఓ అరుదైన ఘనత ఉంది. ఈ రికార్డు గనక పాండ్యా సాధిస్తే.. అతడి ముందు ఐదు టైటిల్స్ సాధించిన రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని కూడా జుజుబీనే అవుతారు. మరి ఆ అరుదైన ఘనత ఏంటి? తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా ముందు ఓ అరుదైన ఘనత ఉంది. ఈ రికార్డు గనక పాండ్యా సాధిస్తే.. అతడి ముందు ఐదు టైటిల్స్ సాధించిన రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని కూడా జుజుబీనే అవుతారు. మరి ఆ అరుదైన ఘనత ఏంటి? తెలుసుకుందాం పదండి.

IPL 2024.. హార్దిక్ ముందు రేర్ ఫీట్.. ఈ రికార్డు కొడితే రోహిత్, ధోని జుజుబీ! ఏంటంటే?

రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా ఇద్దరూ ఒకే టీమ్ లో ఉన్నాగానీ ప్రత్యర్థులే. దానికి కారణం ఏంటో మనందరికి తెలియనిది కాదు. ముంబై టీమ్ ప్రాక్టీస్ లో పైకి బాగానే కనిపిస్తున్నా విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తీసేయడంతో.. సూర్యకుమార్ తో సహా మరికొందరు ప్లేయర్లు నిరాశలో ఉన్నారు. ఇదంతాకాసేపు పక్కనపెడితే.. ఐపీఎల్ 2024లో ఓ రేర్ ఫీట్ ను సాధించే అవకాశం ఉంది. ఈ అరుదైన రికార్డు గనక పాండ్యా సాధిస్తే.. అతడి ముందు ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించిన రోహిత్, ఎంఎస్ ధోని కూడా జుజుబీనే. మరి ఇంతకీ ఆ రికార్డు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. అప్పటి నుంచి 7 సీజన్లు ముంబైకే ప్రాతినిథ్యం వహించాడు. కానీ 2022 మినీ వేలంలో పాండ్యాను గుజరాత్ టైటాన్స్ వేలంలో దక్కించుకుంది. ఇక లీగ్ లోకి అరంగేట్రం చేసిన తొలిసీజన్ లోనే గుజరాత్ కు టైటిల్ అందించి.. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఆ నెక్ట్స్ సీజన్ లో కూడా గుజరాత్ ను రన్నరప్ గా నిలిపి.. నిఖార్సైన కెప్టెన్ గా ముద్రవేయించుకున్నాడు.

Pandya has a chance to get rare record

దీంతో ముంబై కన్ను అతడిపై పడింది. ఇంకేముంది క్యాష్ ఆన్ ట్రేడ్ విధానం ద్వారా పాండ్యాను ముంబై దక్కించుకుంది. అందుకోసం పాండ్యాకు దాదాపు రూ. 100 కోట్ల వరకు ముట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. డబ్బులే కాదు.. హార్దిక్ కు కెప్టెన్సీని కూడా అప్పగించింది. ఈ విషయం ఎంత పెద్ద దుమారం లేపిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ సీజన్ లో హార్దిక్ ఓ అరుదైన ఘనత సాధించే అవకాశం ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మ ముంబైకి, ఎంఎస్ ధోని చెన్నైకి కెప్టెన్లుగా చెరో ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించారు. ఇక లీస్ట్ లో గౌతమ్ గంభీర్ కేకేఆర్ కు రెండు టైటిళ్లను అందించి ఉన్నాడు. మిగతా కొన్ని టీమ్స్ కెప్టెన్లు ఒక్కోసారి ఈ ఘనతను సాధించారు. కానీ రెండు వేర్వేరు ఫ్రాంచైజీలకు కెప్టెన్ గా టైటిల్ అందించిన ప్లేయర్ ఐపీఎల్ చరిత్రలో లేడు. ప్రస్తుతం ఆ ఘనత సాధించేందుకు హార్దిక్ పాండ్యాకు అవకాశం ఉంది. ఈ సీజన్ లో కప్ కొడితే.. పాండ్యా అరుదైన రికార్డు సాధించిన ప్లేయర్ గా చరిత్రలో నిలుస్తాడు. మరి ఈ రేర్ ఫీట్ ను పాండ్యా సాధిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: టీమ్‌లోకి వచ్చాకా కూడా రోహిత్‌ను అవమానిస్తున్న ముంబై! మరీ ఇంత దారుణమా?