పాండ్యా ఉన్నా ముంబైకి కప్ కష్టమే.. ABD షాకింగ్ కామెంట్స్!

సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముంబై టైటిల్ గెలవడానికి పాండ్యా కెప్టెన్సీ ఒక్కటే సరిపోదని చెప్పుకొచ్చాడు. మరి ఏబీడీ అలా అనడానికి కారణాలు ఏంటి? వివరాల్లోకి వెళితే..

సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముంబై టైటిల్ గెలవడానికి పాండ్యా కెప్టెన్సీ ఒక్కటే సరిపోదని చెప్పుకొచ్చాడు. మరి ఏబీడీ అలా అనడానికి కారణాలు ఏంటి? వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభాని కంటే ముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. మినీ వేలం టైమ్ లోనే ముంబై ఇండియన్స్ కు క్యాష్ ఆన్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టీమ్ నుంచి వచ్చిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు డైరెక్ట్ గా టీమ్ పగ్గాలను అందించింది ముంబై యాజమాన్యం. ఈ విషయంలో రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తికి గురైయ్యాడు. దీంతో తాజాగా ఈ ఐపీఎల్ ఆడను అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముంబై టైటిల్ గెలవడానికి పాండ్యా కెప్టెన్సీ ఒక్కటే సరిపోదని చెప్పుకొచ్చాడు ఏబీడి. మరి సౌతాఫ్రికా స్టార్ అలా అనడానికి కారణాలు ఏంటి? వివరాల్లోకి వెళితే..

ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2024లో హాట్ టాపిక్ గా మారిన జట్టు. కెప్టెన్సీ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. రాబోయే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఐపీఎల్ ఆడను అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు హిట్ మ్యాన్. దీంతో ఈ సీజన్ లో ముంబై కప్ కొట్టడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్, మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. కెప్టెన్సీ మార్పు విషయాన్ని ఎత్తిచూపుతూ..”పాండ్యా ముంబైకి కెప్టెన్ గానే కాకుండా.. బౌలర్ గా, బ్యాటర్ గా ఓవరాల్ గా మంచి ఆల్ రౌండర్ గా సేవలు అందిస్తేనే ఎంఐ టీమ్ ట్రోఫీని గెలుస్తుంది. పాండ్యా కెప్టెన్సీ ఒక్కటే టైటిల్ గెలవడానికి సరిపోదు. మిగతా ప్లేయర్లు కూడా రాణించాలి” అని పేర్కొన్నాడు డివిలియర్స్.

ఈ క్రమంలోనే గాయంతో గత ఐపీఎల్ ఆడని జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు ఏబీడీ. అయితే ఈసారి ముంబై టీమ్ బ్యాలెన్స్ గా కనిపించడం లేదు. రోహిత్ శర్మ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బని ఈ స్టార్ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. కానీ ఈ సీజన్ లో పాండ్యా అద్భుతంగా రాణిస్తాడని, అతడి పునరాగమనం టీమ్ కు ప్లస్ పాయింట్ అని డివిలియర్స్ వివరించాడు. ప్రస్తుతం ఏబీడీ వ్యాఖ్యలు ముంబై ఫ్యాన్స్ లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించిన దగ్గరి నుంచి బుమ్రా కూడా అసంతృప్తిలో ఉన్నాడు. దీంతో ఆ టీమ్ లో సమతూల్యత లోపించింది. ఇది ఇలాగే కొనసాగితే.. ముంబై టీమ్ కప్ కొట్టడం కష్టమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు సౌతాఫ్రికా స్టార్. మరి ఏబీడీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రిషబ్ పంత్ కమ్ బ్యాక్.. వీరాభిమాని గొప్ప పని! వైరలవుతున్న వీడియో

Show comments