iDreamPost
android-app
ios-app

ముంబయి క్యాంప్ లో ఇంట్రెస్టింగ్ సీన్.. రోహిత్ ని కౌగిలించుకున్న హార్దిక్..

Hardik Pandya- Rohit Sharma: ముంబయి టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఇంకా వ్యతిరేకత తగ్గలేదు. తాజాగా రోహిత్ శర్మతో హార్దిక్ వ్యవహరించిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది.

Hardik Pandya- Rohit Sharma: ముంబయి టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఇంకా వ్యతిరేకత తగ్గలేదు. తాజాగా రోహిత్ శర్మతో హార్దిక్ వ్యవహరించిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది.

ముంబయి క్యాంప్ లో ఇంట్రెస్టింగ్ సీన్.. రోహిత్ ని కౌగిలించుకున్న హార్దిక్..

ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ లో అందరి దృష్టి ఐపీఎల్ మీదే ఉంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ లీగ్ లో అన్ని జట్లు ఒకవైపు అయితే ముంబయి జట్టు ఒకవైపు అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఈ లీగ్ ప్రారంభానికి ముందే ముంబయి కెప్టెన్ విషయంలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో అందరం చూశాం. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాని ట్రేడింగ్ లో ముంబయి జట్టు తీసుకుంది. అయితే కెప్టెన్ చేస్తేనే వస్తానంటూ హార్దిక్ రూల్ పెట్టడంపై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబయి క్యాంపులో ఒక ఆసక్తికర ఘటన ఆవిష్కృతమైంది. హార్దిక్ పాండ్యా- రోహిత్ శర్మ ఎదురు పడ్డారు.

ఐపీఎల్ 2024 సీజన్ కి సంబంధించి ముంబయి జట్టులో చాలానే జరిగాయి. వాటిలో ముఖ్యంగా ఈ ఏడాది జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాని ప్రకటిచడం. అయితే ఇలా ప్రకటన చేయగానే ముంబయి ప్యాన్స్ అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అలాగే ముంబయి ఫ్రాంచైజీని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తూ వచ్చారు. ఇటీవల రోహిత్ శర్మ తాను ఈ ఐపీఎల్ ఆడటం లేదంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్టేటస్ ని కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంచి డిలీట్ చేశాడు. అసలు ఎందుకు డిలిట్ చేశాడు? డిలీట్ చేసేవాడు ఎందుకు పెట్టాడు? అంటూ అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు.

Rohith

ఎట్టకేలకు రోహిత్ శర్మ ముంబయి క్యాంపులో అడుగుపెట్టాడు. అందుకు సంబంధించి ముంబయి జట్టు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో హోరెత్తించే ప్రమోషన్స్ చేసింది. అలాగే హార్దిక్ పాండ్యా మరోవైపు రోహిత్ శర్మను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా చేశాడు. కోచ్ తో కలిసి చేసిన ప్రెస్ మీట్ లో రోహిత్ శర్మ సపోర్ట్ తనకు ఉంటుందని భావిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశాడు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత అందరూ రోహిత్ శర్మ- హార్దిక్ పాండ్యా ఎదురు పడితే ఎలా ఉంటుంది? అని అనుకున్నారు. అలాంటి తరుణం రానే వచ్చింది. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా- రోహిత్ శర్మ ఎదురుపడ్డారు. అప్పుడు హార్దిక్ పాండ్యా ఒకడుగు ముందుకేసి రోహిత్ శర్మకు హగ్ ఇచ్చాడు. రోహిత్ కూడా నవ్వుతూనే హార్దిక్ పాండ్యాను దగ్గరకు తీసుకుని హగ్ చేసుకున్నాడు.

ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో రోహిత్ శర్మ గొప్పతనాన్ని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ఎలాంటి వాడైనా రోహిత్ శర్మ మాత్రం ఒక సీనియర్ గా ఎంతో హుందాగా వ్యవహరించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం హార్దిక్ పాండ్యాకు కాస్త దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ పోవడానికి కారణం హార్దిక్ పాండ్యా అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్సీ ఇస్తేనే జట్టులోకి వస్తాను అంటూ షరతు పెట్టడం దారుణం అంటున్నారు. మరి.. హార్దిక్ పాండ్యా వచ్చి రోహిత్ కు హగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి