దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్.. బుమ్రాకి కూడా చెమటలు పట్టిస్తూ..

MI vs RCB- Dinesh Karthik: ఐపీఎల్ 2024లో దినేశ్ కార్తీక్ మెరుపులు కొనసాగుతూనే ఉన్నాయి. డీకే బ్యాటింగ్ లో ఇంకా పదును తగ్గలేదు అని మరోసారి నిరూపించాడు. అర్ధ శతకం బాదడం మాత్రమే కాకుండా.. ఆర్సీబీకి ఇంకా తన అవసరం ఉందని నిరూపించాడు.

MI vs RCB- Dinesh Karthik: ఐపీఎల్ 2024లో దినేశ్ కార్తీక్ మెరుపులు కొనసాగుతూనే ఉన్నాయి. డీకే బ్యాటింగ్ లో ఇంకా పదును తగ్గలేదు అని మరోసారి నిరూపించాడు. అర్ధ శతకం బాదడం మాత్రమే కాకుండా.. ఆర్సీబీకి ఇంకా తన అవసరం ఉందని నిరూపించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో దాదాుపగా అన్ని మ్యాచ్ లో నెయిల్ బైటింగ్ గానే ఉంటున్నాయి. ఆఖరి బంతి పడితే గానీ అసలు విషయం అర్థం కావడం లేదు. తాజాగా ముంబయి- బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ కూడా దాదాపుగా అలాంటి ఒక అనుభూతినే ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు తేలిపోయినట్లు కనిపించింది. కోహ్లీ 3 పరుగులకే అవుట్ అవ్వడంతో స్కోర్ బోర్డు చతికిల పడింది. నిజానికి డుప్లెసిస్ ఆడుతున్నా కూడా కోహ్లీ లేడనే ఫీలింగ్, మ్యాక్స్ వెల్ మరోసారి డకౌట్ అయ్యాడనే అసహనం మ్యాచ్ మీద ఫ్యాన్స్ నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాయి. కానీ, దినేశ్ కార్తీక్ తన ఇన్నింగ్స్ తో అంతా మార్చేశాడు. నిజానికి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడమే కాకుండా.. ఫ్యాన్స్ లో కూడా జోష్ నింపాడు.

ముంబయితో జరిగిన మ్యాచ్ లో పేరుకి ఆర్సీబీ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు అర్ధ శతకాలు నమోదు చేశారు. కానీ, జట్టు మాత్రం 200 పరుగులు చేయలేకపోయింది. ఆఖర్లో దినేశ్ కార్తీక్ మెరుపు మెరిపించకపోతే మాత్రం జట్టు స్కోర్ నామమాత్రంగానే ఉండేది. కానీ, దినేశ్ కార్తీక్ మాత్రం ఆర్సీబీ పాలిట దేవుడయ్యాడు. అతను మైదానంలోకి వచ్చింది మొదలు అద్భుతమైన షాట్స్ తో ముంబయి బౌలర్లను ఆడుకున్నాడు. అంత ప్రెజర్ లో కూడా దినేశ్ కార్తీక్ ఎంతో కూల్ గా తనదైనశైలిలో చిత్ర విచిత్రమైన షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డుప్లెసిస్ అవుట్ అవ్వగానే ఆర్సీబీ జట్టు మాత్రమే కాదు.. ఫ్యాన్స్ కూడా చతికిల పడ్డారు.

అదర్ ఎండ్ లో వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలిన్ చేరుతుంటే దినేశ్ మాత్రం పాతుకుపోయాడు. బుమ్రాకి ఒకవైపు వికెట్ల మీద వికెట్లు పడుతున్నాయి. కానీ, డీకేని మాత్రం ఏం చేయలేక చూస్తుండిపోయాడు. బుమ్రా ఈ మ్యాచ్ లో 5 వికెట్ హాల్ అందుకున్నాడు. కానీ, దినేశ్ కార్తీక్ ని మాత్రం ఔట్ చేయలేకపోయాడు. అటు బుమ్రా బౌలింగ్ లో కూడా డీకే రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో బుమ్రా 2 వికెట్లు తీసుకుంటే.. ఆఖర్లో వచ్చి డీకే సిక్సర్ కొట్టడం అందరినీ షాక్ కి గురిచేసింది. మొత్తం మీద ఈ ఇన్నింగ్స్ లో దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఏకంగా 53 పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు. దినేశ్ కార్తీక్ నుంచి ఆర్సీబీ కావాల్సిన అసలు సిసలైన ఫినిష్ అయితే అందించాడు.

డీకే మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ జట్టు 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేశారు. దినేశ్ కార్తీక్ జట్టులో ఎందుకు ఉండాలి? అతని అవసరం జట్టుకు ఎంత ఉంది? ఇంకా డీకేలో ఆ పదును తగ్గలేదు అనే అర్థమయ్యేలా చెప్పిన ఇన్నింగ్స్ ఇది. ఆర్సీబీ బ్యాటింగ్ చూస్తే.. కోహ్లీ(3), డుప్లెసిస్(61), విల్ జాక్స్(8), పాటిదార్(50), మ్యాక్స్ వెల్(0), దినేశ్ కార్తీక్(53), లోమ్రోర్(0), సౌరవ్(9), వ్యాషక్(0), ఆకాశ్ దీప్(2) పరుగులు చేశారు. మొత్తానికి ముగ్గురు బ్యాటర్లు అర్ధ శతకాలు నమోదు చేసినా కూడా ఆర్సీబీ జట్టు 200 పరుగులు చేయలేకపోయింది. మరి.. దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments