Somesekhar
ఐపీఎల్ 2024లోకి ఓ విధ్వంసకారుడు రాబోతున్నట్లు సమాచారం. ఆ చిచ్చరపిడుగును కొనేందుకు ఉత్సాహం చూపిస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ కుర్ర ప్లేయర్ స్ట్రైక్ రేట్ చూస్తే.. దిమ్మతిరిగడం ఖాయం. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2024లోకి ఓ విధ్వంసకారుడు రాబోతున్నట్లు సమాచారం. ఆ చిచ్చరపిడుగును కొనేందుకు ఉత్సాహం చూపిస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ కుర్ర ప్లేయర్ స్ట్రైక్ రేట్ చూస్తే.. దిమ్మతిరిగడం ఖాయం. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Somesekhar
IPL అంటేనే వీరబాదుడుకు మరోపేరు. ఎలాంటి బంతులనైనా ప్రేక్షకుల్లోకి ఎలా పంపాలి అని చూస్తుంటారు బ్యాటర్లు. దీంతో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడగల ప్లేయర్లు ఎక్కడున్నారా? అని భూతద్దం వేసుకుని వెతికి మరీ తమ టీమ్ లోకి తెచ్చుకుంటూ ఉంటాయి యాజమాన్యాలు. అలాంటి ఓ చిచ్చరపిడుగు ఐపీఎల్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 21 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ స్ట్రైక్ రేట్ చూస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఈ విధ్వంసకారుడైన ఆటగాడిని కొనాలని ప్లాన్ చేస్తోందట ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఆ చిచ్చరపిడుగు ఎవరు? అతడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
జాక్ ఫ్రేజర్ మెక్ గుర్క్.. ఇండియాలో ఈ పేరు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ ఆస్ట్రేలియా క్రికెట్ లో మాత్రం చర్చనీయాంశంగా మారిన ప్లేయర్ ఇతడు. 21 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ ఆసీస్ దేశవాలీ, బిగ్ బాష్ లీగ్ లో దుమ్మురేపాడు. ఒకే ఒక్క సెంచరీతో ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు ఈ చిచ్చరపిడుగు. లిస్ట్-ఏ (ఇంటర్నేషనల్ వన్డేల్లో, దేశవాలీ వన్డే టోర్నీలు) క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఫ్రేజర్ గతేడాది కేవలం 29 బంతుల్లోనే శతకం బాది.. 2015లో లిస్ట్ ఏ క్రికెట్ లో సౌతాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
ఓవరాల్ గా ఆ మ్యాచ్ లో 38 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 125 పరుగులతో పెను విధ్వంసం సృష్టించాడు మెక్ గుర్క్. బిగ్ బాష్ లీగ్ లో ఓపెనర్ గా వచ్చి సిక్సులు, ఫోర్లతో బౌలర్లపై యుద్ధాన్ని ప్రకటించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆసీస్ వన్డే టీమ్ లో చోటు సంపాదించాడు. ఇటీవలే వెస్టిండీస్ తో ముగిసిన వన్డే సిరీస్ ద్వారా జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు ఫ్రేజర్. కేవలం ఆడింది రెండు మ్యాచ్ లే అయినప్పటికీ.. స్ట్రైక్ రేట్ మాత్రం మామూలుగా లేదు. 222 స్ట్రైక్ రేట్ తో పెను విధ్వంసం సృష్టించగల సత్తా ఉన్న ఆటగాడు జాక్. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం దృష్టి ఇతడిపై పడింది. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇంతవరకు ఐపీఎల్ సన్నాహక క్యాంప్ లో జాయిన్ కాలేదు. దీంతో అతడి ప్లేస్ ల ఇంగ్లండ్ కే చెందిన డానియల్ లారెన్స్ ను ఎంపిక చేసింది. కాగా.. లిస్ట్ ఏ క్రికెట్ లో విధ్వంసాలు నెలకొల్పుతున్న ఇతడిని కొనుగోలు చేయాలని భావిస్తుందట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. చూడాలి మరి ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్ లోకి వస్తే.. ఎలాంటి మెరుపు ఇన్నింగ్స్ లు ఆడగలడో.
Delhi Capitals have shown interest in Jake Fraser-McGurk as a possible replacement for Harry Brook, who’s uncertain at the moment. (Code Sports). pic.twitter.com/as5gzOpHZw
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2024
ఇదికూడా చదవండి: క్యాటరింగ్ బాయ్ టు క్రికెటర్.. సిరాజ్ బర్త్ డే స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన BCCI!