iDreamPost
android-app
ios-app

లగ్జరీ ఫ్లాట్ కొన్న పృథ్వీ షా.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

  • Published Apr 10, 2024 | 4:18 PM Updated Updated Apr 10, 2024 | 4:18 PM

టీమిండియా యంగ్ బ్యాటర్ పృథ్వీ షా లగ్జరీ ఫ్లాట్ కొనేశాడు. దాని ధరెంతో తెలిస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే.

టీమిండియా యంగ్ బ్యాటర్ పృథ్వీ షా లగ్జరీ ఫ్లాట్ కొనేశాడు. దాని ధరెంతో తెలిస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే.

  • Published Apr 10, 2024 | 4:18 PMUpdated Apr 10, 2024 | 4:18 PM
లగ్జరీ ఫ్లాట్ కొన్న పృథ్వీ షా.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

మన దేశంలో సెలబ్రిటీలు అందులోనూ క్రికెటర్ల లైఫ్​కు సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట ఇట్టే వైరల్ అయిపోతుంది. ఆటగాళ్ల కెరీర్​తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎవరితో రిలేషన్​లో ఉన్నారు? ఎవర్ని మ్యారేజ్ చేసుకుంటున్నారు? లాంటివి అందులో కొన్ని ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. క్రికెటర్ల ఇళ్లు, ఫ్లాట్​లకు సంబంధించిన సమాచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తూనే ఉంటాం. ఇప్పుడో టీమిండియా క్రికెటర్ ఖరీదైన ఫ్లాట్ కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్లేయర్ మరెవరో కాదు.. పృథ్వీ షా. అతడు కొన్న ఫ్లాట్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

స్టార్ బ్యాటర్ పృథ్వీ షా ఖరీదైన ఇల్లు కొన్నాడు. దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసే లగ్జరీ ఫ్లాట్​ను షా సొంతం చేసుకున్నాడని క్రికెట్ వర్గాల సమాచారం. దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలోని బాంద్రాలో సముద్రానికి దగ్గర్లో ఈ ఫ్లాట్​ను కొనుగోలు చేశాడని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో ఓ నోట్ రాశాడు షా. ఈ ప్లేస్ గురించి ఎన్నో కలలుగన్నానని.. ఇప్పుడు వాటిని నిజం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తనకంటూ సొంత ఇల్లు ఉండాలనేది డ్రీమ్ అని.. అదిప్పుడు నిజమైందన్నాడు. సొంత ఇల్లు అనేది స్వర్గం లాంటిదని.. ఇక మీదట అంతా మంచే జరగాలంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు పృథ్వీ షా. అతడి ఫ్లాట్​కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పృథ్వీ షా ఫ్లాట్ పిక్స్ చూసిన నెటిజన్స్.. ఇల్లు సూపర్​గా ఉందని అంటున్నారు. అతడికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు. ఇక, టీమిండియాలోకి 2018లో ఎంట్రీ ఇచ్చాడు షా. ఓపెనర్​గా ఆడుతూ మంచి పేరు సంపాదించాడు. అయితే ఆ తర్వాత టీమ్​లో తన ప్లేస్​ను నిలబెట్టుకోవడంలో ఫెయిలయ్యాడు. ఫామ్​ కోల్పోవడం, బరువు పెరగడంతో అతడు మళ్లీ కమ్​బ్యాక్ ఇవ్వలేకపోయాడు. డొమెస్టిక్ క్రికెట్​లో రాణించినా సెలక్టర్లు అతడ్ని పరిగణనలోకి తీసుకోలేదు. రీసెంట్​గా ఇంజ్యురీ నుంచి కోలుకున్న షా.. రంజీ ట్రోఫీ-2024లో బరిలోకి దిగి అదరగొట్టాడు. ముంబై కప్పు కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఈసారి ఐపీఎల్​లోనూ తన మార్క్ చూపిస్తున్నాడీ ఓపెనర్. ఢిల్లీ క్యాపిటల్స్​కు శుభారంభాలు అందిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి 119 పరుగులు చేశాడు.