iDreamPost

నితీష్ రెడ్డి అరుదైన ఘనత.. IPL హిస్టరీలో ఏకైక ప్లేయర్​గా తెలుగోడి రికార్డు!

  • Published Apr 10, 2024 | 3:20 PMUpdated Apr 10, 2024 | 3:20 PM

సన్​రైజర్స్ నయా స్టార్ నితీష్ కుమార్ రెడ్డి అరుదైన ఘనత సాధించాడు. ఇన్నేళ్ల ఐపీఎల్​ హిస్టరీలో ఎవరి వల్లా కానిది అతడు చేసి చూపించాడు.

సన్​రైజర్స్ నయా స్టార్ నితీష్ కుమార్ రెడ్డి అరుదైన ఘనత సాధించాడు. ఇన్నేళ్ల ఐపీఎల్​ హిస్టరీలో ఎవరి వల్లా కానిది అతడు చేసి చూపించాడు.

  • Published Apr 10, 2024 | 3:20 PMUpdated Apr 10, 2024 | 3:20 PM
నితీష్ రెడ్డి అరుదైన ఘనత.. IPL హిస్టరీలో ఏకైక ప్లేయర్​గా తెలుగోడి రికార్డు!

సన్​రైజర్స్​ హైదరాబాద్​కు మరో ఆణిముత్యం దొరికాడు. గత కొన్ని సీజన్లుగా నిరాశపరుస్తూ వస్తున్న జట్టుకు అతడు ఆపద్బాంధవుడు అయ్యాడు. ఐపీఎల్-2024లో ఎస్​ఆర్​హెచ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు తెలుగుతేజం, విశాఖపట్నం కుర్రాడు నితీష్​ కుమార్ రెడ్డి. 20 ఏళ్ల ఈ యంగ్ ఆల్​రౌండర్ తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్​తో ఆడిన ఫస్ట్ మ్యాచ్​లో ఆఖర్లో వచ్చి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు నితీష్​. పంజాబ్ కింగ్స్​తో నిన్న జరిగిన మ్యాచ్​లో 37 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. అతడితో పాటు బౌలర్లు కూడా రాణించడంతో పంజాబ్​ను 2 పరుగుల తేడాతో ఓడించింది ఆరెంజ్ ఆర్మీ. ఈ మ్యాచ్​తో నితీష్​ చరిత్ర సృష్టించాడు.

పంజాబ్​పై మ్యాచ్​లో బ్యాట్​తో పాటు బాల్​తోనూ మెరిశాడు నితీష్ రెడ్డి. 3 ఓవర్లు వేసిన అతడు 33 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. 11 బంతుల్లో 19 పరుగులతో జోరు మీదున్న జితేష్ శర్మను ఔట్ చేసి మంచి బ్రేక్ త్రూ అందించాడు. తద్వారా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఒక మ్యాచ్​లో హాఫ్ సెంచరీ బాదడం, ఓ వికెట్ తీయడం, అలాగే క్యాచ్ కూడా అందుకున్న ఏకైక అన్​క్యాప్డ్ ప్లేయర్​గా నితీష్ నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్​లో ప్రభుసిమ్రన్ సింగ్ ఇచ్చిన క్యాచ్​ను అందుకున్నాడతను. ఈ మ్యాచ్​లో అతడు మరో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఫిఫ్టీ బాదిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు నితీష్​. 20 ఏళ్ల 319 రోజుల వయసులో అతడు ఈ ఘనతను అందుకున్నాడు.

ఐపీఎల్​లో చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన వారిలో నితీష్ రెడ్డి కంటే ముందు ప్రియమ్ గార్గ్ ఉన్నాడు. అతడు 19 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ మైల్​స్టోన్​ను రీచ్ అయ్యాడు. టీమ్ విజయాల్లో కీలకంగా మారిన నితీష్​ను అందరూ పొగుడుతున్నారు. ఎస్​ఆర్​హెచ్​కు మరో ఆణిముత్యం దొరికాడని ప్రశంసిస్తున్నారు. పంజాబ్​తో మ్యాచ్​లో తన పెర్ఫార్మెన్స్ మీద ఈ యంగ్ ఆల్​రౌండర్ రియాక్ట్ అయ్యాడు. ‘ఇది వ్యక్తిగతంగా నాతో పాటు నా జట్టుకు కూడా బిగ్ కాంట్రిబ్యూషన్. నిన్ను నువ్వు నమ్ముకో, ఏదైనా చేయగలవు అంటూ నాకు నేనే పదే పదే చెప్పుకున్నా’ అని నితీష్ తెలిపాడు. యంగ్ బ్యాటర్ పెర్ఫార్మెన్స్​ మీద సన్​రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. నితీష్ అద్భుతమైన ఆటగాడని.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏదైనా సరే గ్రౌండ్​లో అతడ్ని ఆపడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. మరి.. నితీష్ రెడ్డి అరుదైన ఘనత మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి